Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పొరుగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ల ఆయన చేసే ముద్దూముచ్చట…

April 12, 2024 by M S R

Subramanyam Dogiparthi….   చలం నిర్మించి నటించిన సినిమాలలో చక్కటి , వినోదభరిత , మ్యూజికల్ హిట్ 1970 లో వచ్చిన ఈ సంబరాల రాంబాబు సినిమా . తమిళంలో కె బాలచందర్ దర్శకత్వం వహించిన ఎథీర్ నీచల్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో నగేష్ , జయంతి , షావుకారు జానకి , మనోరమ ప్రభృతులు నటించారు . తమిళంలో కూడా బాగా సక్సెస్ అయింది . హిందీలో లాఖోం మే ఏక్ అనే టైటిల్ తో మెహమూద్ తో నిర్మించబడింది . అక్కడా హిట్టయింది .

ఓ పెద్ద లోగిలిలో చాలా కుటుంబాలు ఉంటాయి . అనాధ అయిన రాంబాబు మెట్ల కింద ఉంటూ , అక్కడ ఉంటున్న అందరి అన్ని పనులు చేసిపెడుతూ చదువుకుంటూ , మంచి ఉద్యోగంలో చేరటంతో సినిమా అయిపోతుంది . ఆ ఇళ్ళల్లో ఉండే ఓ కుటుంబం లోని అమ్మాయి శారద ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది . ప్రపంచంలో చెడ్డవారు , మంచివారూ ఉన్నట్లే అక్కడా రెండు రకాల వాళ్ళూ ఉంటారు . గుమ్మడి , SVR , చంద్రమోహన్ , రేలంగి వంటి మంచివారు ; సూరేకాంతం , పద్మనాభం , గీతాంజలి , రావి కొండలరావు , రాధాకుమారి , మనోరమ , సి హెచ్ కృష్ణమూర్తి వంటి చెడ్డవారూ ఉంటారు .

చలం స్వంత సినిమా కదా ! హాస్య నటులు చాలామంది కనిపిస్తారు . మెరీనా బీచ్ లో బాలకృష్ణ , అల్లు రామలింగయ్యలు హాకర్సుగా కనిపిస్తారు . మిక్కిలినేని , రామచంద్రరావు , ప్రభాకరరెడ్డిలు కూడా ఉన్నారు . .

వి కుమార్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ హిట్ . జీవితమంటే అంతులేని ఒక పోరాటం , విన్నారా విన్నారా ఈ చిత్రం కన్నారా , పొరుగింటి మీనాక్షమ్మను చూసారా కన్నులే నవ్వేయి , మామా చందమామా వినరావా నా కధా పాటలు చాలా చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఈ సంగీత దర్శకుడు తమిళ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించేవారు . నాలుగయిదు సినిమాలకు మాత్రమే తెలుగులో సంగీత దర్శకత్వం వహించారు . జి వి ఆర్ శేషగిరిరావు దర్శకుడు . చలం లక్కీ ప్రొడ్యూసర్ . అతను తీసిన మట్టిలో మాణిక్యం వంటి సినిమాలు కూడా బాగా సక్సెస్ అయ్యాయి .

Ads

మా నరసరావుపేటలో చూసా . థియేటర్ గుర్తు లేదు . అప్పుడు కూడా రెండు మూడు సార్లు చూసా . యూట్యూబులో ఉంది . తప్పక చూడతగ్గ చక్కటి సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions