కొద్దిరోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామి మీద ఫైరవుతున్నారు… ఎందుకు..? తన కెరీర్ బాగుండదని, కష్టాలు పడాల్సి వస్తుందని తను జోస్యం చెప్పాడు కాబట్టి… (తాజాగా ఉపాసనకు మలిసంతానయోగం లేదని మరో బాంబు పేల్చాడు, అది వేరే సంగతి)… ఎహె, మా హీరో జాతకం బాగా లేదని అంటావా..? సలార్ హిట్ చూడలేదా..? మావాడి చేతిలో ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టులున్నాయో తెలుసా..? అని ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రు…
చివరకు కృష్ణంరాజు భార్య కూడా వేణుస్వామి మీద ఏదో కామెంట్ చేయడం, దానికి వేణుస్వామి ఇంకేదో ఎన్కౌంటర్ కామెంట్ చేయడం తెలిసిందే కదా… మళ్లీ ఆ వివాదంలోకి మనం వెళ్లడం లేదు గానీ… స్థూలంగా బయటికి కనిపించేదేమిటి..? ప్రభాస్ వర్సెస్ వేణుస్వామి అన్నట్టుగా…! ఇద్దరికీ పడదు అన్నంతగా..!
నిజానికి వాళ్ల నడుమ సత్సంబంధాలున్నయ్… బయట జరిగే రచ్చను వాళ్లిద్దరూ పట్టించుకోరు… వేణుస్వామి జాతకం విని, చదివి ప్రభాస్ నవ్వేస్తాడు… వేణుస్వామి కూడా రిలేషన్ వేరు, జోస్యం వేరు అని తేల్చేస్తాడు…
Ads
అప్పట్లో ఏదో సినిమాలో ‘ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది, మహా అయితే మళ్లీ ప్రేమిస్తారు’ అంటాడు కదా ప్రభాస్… దాంతో అందరికీ డార్లింగ్ అయిపోయాడు… ఒక కోణంలో చూస్తే ప్రభాస్ చాలా డిఫరెంట్, పైన డైలాగులాంటి కేరక్టరే… మనుషుల్ని ప్రేమిస్తాడు… మర్యాద ఇస్తాడు… తన పర్సనల్ స్టాఫ్‌ను కూడా బాగా చూసుకుంటాడు… దోస్తీకి వాల్యూ ఇస్తాడు… ఇతర హీరోల్లాగా సినిమాకు సంబంధించిన ప్రతి అంశంలోనూ వేళ్లు కాళ్లు పెట్టడు… ఫేక్ ఇమేజ్ కోసం వెంపర్లాడడు… కాకపోతే ఆరోగ్య సమస్యలే తనను బాగా బాధిస్తున్నాయి…
ఎస్, వేణుస్వామిని కూడా తనేమీ దూషించడు, ఇద్దరూ బాగానే ఉన్నారు… (పై స్థాయిలో నాయకుల వ్యక్తిగత సంబంధాలు బాగానే ఉంటాయి, దిగువన ఫ్యాన్సే కొట్టుకుంటారు అన్నట్టుగా…) ఈ ఇన్‌స్టా పోస్ట్ చూడండి,
వేణుస్వామి సతీమణి శ్రీవాణి (వీణశ్రీవాణి) పోస్టు… ఎక్కడి నుంచి సేకరిస్తాడో గానీ వేణుస్వామి ప్రతి సీజన్లోనూ శ్రేష్టమైన పళ్లు వస్తుంటాయి తన వద్దకు… తనకు తెలిసిన వాళ్లకు పంపిస్తుంటాడు… ప్రభాస్‌కు కూడా శ్రీవాణి పంపించింది ఓ సీతాఫలాల బాక్సు…
వాటి రుచితో మైమరిచిన ప్రభాస్ మరో బాక్సు కావాలి ప్లీజ్ అన్నాడు… ఆమె ఆనందంగా మరో బాక్సు పంపిస్తూ ఈ పోస్టు పెట్టింది… (ఈమధ్య రోజువారీ రచ్చలు, వేడి, వివాదాలు, గాయిగత్తరలు ఇక్కడే వదిలేసి వేణుస్వామి, శ్రీవాణి ఎక్కడెక్కడికో టూర్లు వేసి చల్లబడుతూ, సరదా రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు తెలుసు కదా… ఆమె రీల్స్‌కు వ్యూయర్ షిప్ కూడా ఎక్కువ)… జోస్యాలు వేరు, పర్సనల్ రిలేషన్ వేరు… వేణుస్వామికి, ప్రభాస్‌కు చాలా క్లారిటీ ఉన్నట్టుంది… గుడ్…
Share this Article