…. ముందుగా ఆంధ్రజ్యోతికి అభినందనలు… ఈ పాలిటిక్సులో పడి పత్రికలు, టీవీలు ఇక వేరే జీవనాన్ని పట్టించుకోవడమే మానేశాయి… నాయకుల పిచ్చి వాగుళ్లను హైలైట్ చేయడమే పనిగా పెట్టుకున్నాయి… ఏపీలో కులసమరం, తెలంగాణలో గ్రేటర్ సమరం… ఇక జనం కష్టాలకు మీడియాలో స్పేస్ ఎక్కడిది..? కానీ… కానీ… ఈ హెక్టిక్, పొలిటికల్, కమర్షియల్ యాక్టివిటీలోనూ అన్నదాత అరిగోసను ఫస్ట్ పేజీలో హైలైట్ చేసినందుకు… పాత్రికేయం ఆత్మహత్య చేసుకుంటున్న ఈ గడ్డు రోజుల్లో, ఇంకా సదరు పత్రికలో అది కాస్త బతికి ఉన్నందుకు ఆనందంగా ఉంది…
కరోనాకు పారసెటమాల్ అద్భుతమైన మందు అని తేల్చేసినట్టుగానే… మన పాలకులు రైతుల కష్టాలకు ఇన్నేళ్ల ఉమ్మడి పాలనే కారణం అని చెబుతూ, చూపిస్తూ వచ్చారు… ఆరేళ్లు గడిచినా ఆ రైతుబంధు, రైతుబీమాలే అమృతాంజన్లు, జిందాతిలిస్మాత్లు… ఖర్మకాలి రైతు మరణిస్తే పరిహారం సంగతి బీమా కంపెనీవాడు చూసుకుంటాడు… వోట్ల యావతో రైతుబంధు పేరిట ప్రభుత్వం వేల కోట్లను పంచిపెడుతుంది… ఖేల్ ఖతం… ఇక రైతు ఎటుపోతే ఎవరిక్కావాలి..?
గిట్టుబాటు ధర, పంటలబీమా వంటివి కొత్తగా ఆలోచించరు… పైగా సన్నాలు వేయండి, పత్తి వేయండి అని కొత్తగా సుద్దులు… తీరా వేస్తే సన్నాలకు బీజేపీవాడు ధర ఇవ్వడట అని కొత్త సాకులతో కేంద్రంపై నెట్టేసే పన్నాగాలు… బస్తాకు వందో, రెండొందలో కేసీయార్ అదనపు మద్దతు ఇస్తానంటే మోడీ అడ్డం పడ్డాడా..?
Ads
‘ముచ్చట’ పదే పదే చెబుతోంది… తెలంగాణ ప్రభుత్వం కౌలు రైతులు అనే పదాన్ని వినడానికే ఇష్టపడటం లేదు… నిజానికి అన్నిరకాల రిస్కులూ తీసుకుని వ్యవసాయం చేస్తున్నది ఆ రైతులే… భూయజమానికి లీజు ఇవ్వాలి, తనకు బ్యాంకులు రుణాలివ్వవు, పంట అమ్మాలన్నా కష్టమే… చస్తే కూడా ఎవరికీ పట్టదు… ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతి కథనం చెబుతున్నదీ అదే… ఆత్మహత్యలకు పాల్పడే రైతుల్లో 80 శాతం వరకూ కౌలు రైతులే…
ఎక్కడో ఏదో కొలువులో పదిలంగా ఉన్నవాడు, భూమి తన పేరిట ఉన్నందుకు ప్రభుత్వం నుంచి ఎంచక్కా రైతుబంధు సాయాన్ని పొందుతాడు… ఆ భూమిని కౌలు చేసే రైతు మాత్రం నాగలికి ఉరేసుకుంటాడు… ఈ దుస్థితికి కారణాలను అన్వేషించి, అక్కడ కదా మందు వేయాల్సింది… పోనీ, కౌలు వ్యవసాయాన్నే నిషేధించలేరు కదా…
11 నెలల్లో 468 మంది చేజేతులా ప్రాణాలు తీసుకున్నారు అంటే… ఇంకా రావణకాష్టం మండిపోతున్నట్టే కదా… వీటిల్లో కొన్ని వ్యవసాయేతర కారణాలు ఉండవచ్చుగాక… కానీ తనయితే రైతే కదా… వ్యవసాయం తన సమస్యల పరిష్కారానికి తోడ్పడనట్టే కదా… కుటుంబసభ్యుల రోగాలు, చదువులు, అప్పులు, మిత్తీలు, పంటనష్టాలు… ఇవేకదా మెజారిటీ ఆత్మహత్యల వెనుక ఉన్న అసలు నిజం… దుర్గం చెరువు మీద వేలాడే వంతెన చూస్తూ సంబరపడిపోదామా..? నాగలికి ఉరేసుకుని వేలాడుతున్న ఓ బక్కరైతు పీనుగను చూసి కుమిలిపోదామా..? ఏం చేద్దాం సార్..?!
Share this Article