Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రభాస్ బుజ్జి అంటే పాయల్ రాజపుత్ కాదా..? ఎంత హ్యాండిచ్చావు బాసూ…!!

May 19, 2024 by M S R

ఒక వార్త విభ్రాంతికి గురిచేసింది… దీన్ని జర్నలిజం అనాలంటే ఓ ఏవగింపు… ధూమీబచె అన్నట్టుగా… ఆ వార్త ఏం చెప్పిందంటే చాంతాడంత ఉపోద్ఘాతంతో ప్రభాస్ పెళ్లిచేసుకోబోయేది ఎవరో తెలుసా..? అని క్వశ్చించి, రెట్టించి, కుచ్చి, చివరకు ఏం చెప్పిందో తెలుసా..? తను పాయల్ రాజ్‌పుత్‌ను పెళ్లిచేసుకునే అవకాశాలు ప్రబలంగా ఉన్నాయట…

దేవుడా… ప్రభాస్ ఇన్నేళ్లూ ఆగీ ఆగీ చివరకు పాయల్‌ను చేసుకుంటున్నాడా అని అనిపిస్తే అది మీ ఖర్మ… అఫ్‌కోర్స్, ఆమెకు ఏం తక్కువైంది, ప్రభాస్‌కు ఆమె సరిపోదా ఏం..? అని కౌంటర్ దాడి చేయాలనుకుంటే మీ ఇష్టం… కానీ రియాలిటీలోకి వద్దాం… ప్రభాస్ పెళ్లి కుదిరితే, ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఫిక్సయిపోతే… తన ఎక్స్ ఖాతాలో, మార్మికంగా, ఎవరికీ అర్థం గాకుండా పోస్టు పెడతాడా..? అసలు ప్రభాస్ ఎక్స్‌లో ఎప్పుడైనా యాక్టివ్‌గా ఉంటాడా..?

‘మన జీవితాల్లోకి ఓ ఇంపార్టెంట్ పర్సన్ వస్తోంది’ అని ట్వీటాడు… ఇంకేముంది..? డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, మీడియా రెచ్చిపోయి ఏదేదో రాసేశాయి… అదుగో ప్రభాస్ పెళ్లి, ఇదే సంకేతం… వాళ్ల శ్యామలమ్మ ఈ ఏడాదిలోనే మా ప్రభాస్ పెళ్లి అని చెప్పిందట, ఇక ఇదే ఫైనల్ అని కుమ్మేశాయి… మరోసారి బుజ్జికి వెల్‌కం అన్నాడు ప్రభాస్… తీరా చూస్తే అది రాబోయే తన కల్కి సినిమాలో ఓ కారు పేరు బుజ్జి… క్లారిటీ కావాలా..? ఈ ట్వీట్ చూడొచ్చు…

Ads


Presenting '𝐅𝐫𝐨𝐦 𝐒𝐤𝐫𝐚𝐭𝐜𝐡 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟒: Builiding a Superstar #Bujji' from #Kalki2898AD!!!https://t.co/iv3McvKMYt @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji… pic.twitter.com/NjJJhreM5h

— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 18, 2024


ఎస్, అది ఓ సినిమా… వాళ్ల సినిమాకు హైప్ క్రియేట్ చేయడం కోసం, ప్రచారం కోసం ఇవన్నీ విభిన్నమైన ఎత్తుగడలు… తప్పుకాదు, ప్రేక్షకుల అటెన్షన్ డ్రా చేయడం వాళ్ల ఉద్దేశం… మరి ఐదారొందల కోట్ల ప్రాజెక్టు… ఏమాత్రం తేడా వచ్చినా ముందుగా దర్శకుడు నాగ్ అశ్విన్ తాడు తెగుతుంది, అందుకే ప్రచారజోరు స్టార్ట్ చేశారు… వాళ్లకు అది అవసరం…

పోనీ, ఇన్ని పెళ్లి వార్తలు వచ్చాయి కదా, ప్రభాస్ టీం నుంచి, కల్కి టీం నుంచి ఏమైనా ఖండనో, వివరణో వచ్చిందా..? రాదు… ఈ చర్చ ఇలాగే కొనసాగాలని కదా వాళ్ల ఉద్దేశం కూడా..! అదుగో రష్మి పెళ్లి, అబ్బాయి ఎవరో తెలుసా..? శ్రీముఖిని పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ కమెడియన్.., సుడిగాలి సుధీర్ పెళ్లి, రష్మికి అన్యాయం.., అనసూయ హైపర్ ఆదితో ఫిక్సయినట్టేనా వంటి సరదా కథనాలు కొన్ని కనిపిస్తాయి, అవి జస్ట్, ఆయా టీవీ ప్రోగ్రాముల ప్రోమోలను బట్టి రాసుకునే ఫన్ పోస్టులు…

ఎంత నాసిరకం నటుడైనా సరే, టీవీ షోలలో తమ లవ్ గురించి, తమ పెళ్లి గురించి ప్రకటిస్తాడా..? ఈ ప్రభాస్ బుజ్జి ఇంకాస్త కాస్ట్‌లీ ప్రోమో కథనం… మరి చాలా భారీ బడ్జెట్ కదా… (ఇలాంటి ప్రచారాలు కొన్నిసార్లు ఎదురుతన్నే ప్రమాదం ఉంది బహుపరాక్…) సరే, ఇంతకీ ఆ బుజ్జి కథేమిటీ అంటారా..?

bujji

‘Skratch EP4: Building A Superstar BUJJI’ పేరుతో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్… అందులో ఈ సినిమా టీంలోని కొందరు బుజ్జి గురించి మాట్లాడుతూ ఒక బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు… వీడియోలో “మన బాడీని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో.. బుజ్జిని కూడా ఓ బ్రెయినే అలా కంట్రోల్ చేస్తుంది” అని మేకర్స్ తెలిపారు. ఆ తర్వాత ఓ గ్యాడ్జెట్‌ మూవీ టీమ్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఫన్నీ గా తిట్లు తిడుతోంది. బుజ్జిని తయారు చేసిన వారిని కూడా పరిచయం చేశారు మేకర్స్…

ఇక చివర్లో భైరవ రోల్ లో హీరో ప్రభాస్ కనిపిస్తాడు… అప్పుడు గ్యాడ్జెట్ ఇంకా నా లైఫ్ అంతా బాడీ లేకుండా బతికేయాల్సి వస్తుందేమో అని అంటుంది. దీంతో ప్రభాస్.. నీ టైమ్ స్టార్ట్ అయింది బుజ్జి పదా అంటారు. ఆ తర్వాత కారుపై కవర్ తీస్తారు. కానీ బుజ్జిని మాత్రం చూపించలేదు… మే 22వ తేదీన పరిచయం చేస్తామంటూ మేకర్స్ మరో ట్విస్ట్ ఇచ్చారు… మరో నెల తరువాత కదా రిలీజ్… ఇంకెన్ని చూడాలో… పాయల్ రాజపుత్ గాకుండా ప్రభాస్‌కు ఇంకెంతమందికి పెళ్లి చేయాలో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions