శ్రావణ భార్గవి… అందరికీ తెలిసిన గాయకురాలు… మంచి మెరిట్ ఉన్న సింగర్… డౌట్ లేదు… భర్త హేమచంద్రతో విడిపోయిందని వార్తలు… ఆ ఇద్దరూ ఖండించింది లేదు, అవునని అంగీకరించిందీ లేదు… సరే, చాలామంది విడాకులు తీసుకుంటారు, వీళ్లు తీసుకున్నారేమో, వదిలేస్తే…
ఆమె సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ పెట్టుకుంది.,. ఏవో వీడియోలు పెడుతుంటుంది… అడపాదడపా ఈవెంట్లు, సాంగ్స్, డబ్బింగులు… ఒకరే సంతానం అనుకుంటా… బిడ్డ పేరు శిఖర చంద్రిక అని గుర్తు… స్కాట్లండ్ విద్యార్థి ఆమె… ఆమధ్య ఏదో కాళ్లూపుకుంటూ ఏదో ఒకపరి అనే శృంగార కీర్తనను ఆలపిస్తూ ఒక వీడియో… ఇంకేం, విరుచుకుపడ్డారు… ఏవేవో విమర్శలు… చివరకు ఆమే ఆ వీడియో డిలిట్ చేసి, మీ అందరికీ ఓ పేద్ధ నమస్తేరా బాబూ అన్నట్టుగా స్పందించింది…
హిందుత్వాన్ని అవమానించిందని కొందరు… అన్నమయ్య కీర్తనను కించపరిచిందని మరికొందరు… తిరుమలలో అడుగు పెట్టనివ్వబోమని అన్నమయ్య వంశస్తులు… ఆమె అనసూయ కాదు కదా, స్థిరంగా నిలబడి, ఏం చేసుకుంటారో చేసుకొండనే రీతిలో పెడసరం సమాధానాలు ఇవ్వడానికి… భయపడింది… వీడియోను తీసేసింది… లేదా కొన్ని మార్పులు చేసింది…
Ads
ఎందుకోగానీ, శ్రావణ భార్గవి మీద విడాకుల వార్తల తరువాత విపరీతంగా వ్యతిరేకత పెరిగింది… సమంత మీద పెరిగినట్టు… ఆమెకు శాస్త్రీయ సంగీతం తెలుసు, మంచి గొంతు ఉంది, బాగానే పాడుతుంది… అదంతా వదిలేసి ఆమె ఏ వీడియో పెట్టినా విరుచుకుపడుతున్నారు…
రీసెంటుగా ఓ వీడియోను ఓ మిత్రుడు పంపించాడు… 1.32 లక్షల వ్యూస్, 2500 లైక్స్… పర్లేదు, కానీ కామెంట్స్ కొన్ని చూస్తే చిరాకేసింది… చివరకు ట్రోలింగు ఏ స్థాయికి చేరుతున్నదో అనిపించేలా ఉంది… ఒకరు అంటారు, ఏమిటా చేతులు తిప్పడం, ఆ వేషం, ఒక కట్టు బొట్టు లేని ఆహార్యం, (స్వతహాగా ఆంధ్ర అయినా) కృత్రిమ తెలంగాణ యాస, శని పట్టినట్టు చేతులు పాదాల మీద ఆడిస్తూ, చూస్తుంటే రోత పుడుతోంది అని… (శని పడితే అలా చేతులు పాదాల మీద ఆడిస్తుంటారా..?)
ఆంధ్రా వాళ్ళు అంతే.. తెలంగాణా మేకప్ వేసుకొని తాతల కాలం నుండి ఇక్కడే ఉన్నట్టు నటిస్తుంటారు.. కానీ మాట తీరులో ఎక్కడో ఒకచోట పట్టుబడుతుంటారు.. అని మరొకాయన… ఆమె తన అమ్మమ్మ, అమ్మతో ముచ్చటిస్తోంది, ఏవో నాస్తాల్జిక్ సంగతులు… చూసేవారు చూస్తారు, లేకపోతే లేదు… దానికి ఆమె వేషం, బాడీ లాంగ్వేజీ, మాట తీరు, సైగల్ని కూడా తిట్టడం దేనికి..?
ఒకాయాన కులాన్ని తీసుకొచ్చాడు… దామిని, సునీత, కౌసల్య, శ్రావణ భార్గవి కులాన్ని తీసుకొచ్చి ఏదో కామెంట్ చేస్తాడు… ఒకామె నేరుగా కొజ్జా దానా అని తిట్టేస్తుంది… ఒసేవ్, హేమచంద్ర ఎక్కడే అనడుగుతాడు మరొకరు… తనెక్కడో పులిహోర కలుపుతూ ఉంటాడు అని మరెవరిదో జవాబు… మరో దారుణమైన కామెంట్, మీ ముగ్గురూ మొగుళ్లను వదిలేశారా అని… బాబోయ్… ఆడుకున్నారు… ఫాఫం… అన్నట్టు, ఈసారి నీ బిడ్డను కూడా వీడియోలోకి తీసుకురావమ్మా… నాలుగు జనరేషన్లు ఒకేచోట ముచ్చట్లు… బాగుంటుంది…!!
Share this Article