బాలయ్య సారు గారు జనంలో ఉన్నప్పుడు కూడా సోయి లేకుండానే ప్రవర్తిస్తూ ఉంటారు… భోళాతనం అంటారు గానీ… తన బ్లడ్డు, తన బ్రీడు మీద విపరీతమైన అహం అది… సెల్ఫీలు దిగుతుంటే ఫోన్లు తీసుకుని విసిరేస్తారు… చెంప చెళ్లుమనిపిస్తారు… నెట్టేస్తారు… తిట్టేస్తారు… కొట్టేస్తారు… సారు గారు మరి అపర దైవాంశ సంభూతులు కదా…
సరే, జై బాలయ్యకూ ఓ బ్రాండ్ ఉంది… ఫలక్నుమా, మైసూరు మాన్షన్లలో దావత్ ఇచ్చినా సరే మాన్షన్ హౌజే కావాలట సారు గారికి… అవునులే, ఓ పెద్ద హీరో ఉన్నాడు, చాన్నాళ్లుగా ఉద్దరిస్తున్నాడు ఇండస్ట్రీని… అదేదో బ్రాండ్ రమ్ తాగితేనే ఎక్కుతుందట… సరే, బాలయ్య మైక్ పడితే ఏం మాట్లాడతాడో తనకే తెలియదు… ఆపై బ్రాండీ చుక్కలు పడితే మైక్ మైకమే ఇక…
ఈమధ్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరో మరొకటో సినిమా ఫంక్షన్ జరిగితే వచ్చాడు ముఖ్య అతిథిగా… విష్వక్సేన్ హీరో… తప్పదు కాబట్టి, బాలయ్య కీర్తన బాగానే చేశాడు… బాలయ్య కూడా విష్వక్సేన్ నాకు అన్నలాంటోడు అన్నాడు… మోక్షజ్ఞ వచ్చేస్తున్నట్టే అన్నాడు… ఎప్పుడనేది ఆ కాల బ్రహ్మంగారు కూడా చెప్పలేకపోయాడు… గుడ్, కానీ వేదిక మీద నిలబడ్డ హీరోయిన్ అంజలిని చేయితో వెనక్కి నెట్టాడు…
Ads
(ఇది సాక్షి సౌజన్యం)
మరీ సాక్షి వాళ్లు రాసినట్టు అసభ్యత అనిపించలేదు గానీ, ఏదో మాట చొరవగా సరదాగా అంటూ వెనక్కి తోశాడు కాస్త… అదీ తప్పే… మరి బాలయ్య కదా… ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి, కడుపైనా చేయాలి అనే కేరక్టర్ కదా… పాపులర్ హీరో, పాపులర్ హీరో కొడుకు, పాపులర్ కుటుంబం, సీఎం కొడుకు, సీఎం బావ, కాబోయే సీఎంకు మామ… కనీసం జనంలో తిరుగుతున్నప్పుడు, జనజీవనంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో కూడా తెలియనితనాన్ని భోళాతనం అనాలా..? ఇంకేదైనా మంచి పదం ఉందా తెలుగులో..?
(ఇది గ్రేటాంధ్ర సౌజన్యం)
అఫ్కోర్స్, మందు కొట్టనివాళ్లు సినిమా రంగంలో, ఆలెక్కన టీవీ, ఫ్యాషన్ రంగాల్లో తక్కువ… కొందరు అలవాటుగా, కొందరు కంపెనీ కోసం, కొందరు సర్కిల్ మెయింటెయిన్ చేయడం కోసం… అవసరాన్ని బట్టి… ఎవరైనా గెస్టుగా పిలిస్తే తాగి, మైక్ ముందు వాగేవాళ్లు కూడా బోలెడు మంది… కానీ మరీ ఓ ప్రిరిలీజ్ ఫంక్షన్లో వేదిక దగ్గరే కాళ్ల దగ్గర నీళ్లు కలిపిన మందు బాటిల్ పెట్టుకుని మరీ అక్కడే రౌండ్స్ ఫినిష్ చేయడం బాలయ్యకే చేతనైన విద్య… మళ్లీ తెల్లారిలేస్తే నీతులు, ఏతులు…
ప్రసంగిస్తాడు, సగం మాటలు ఎవరికీ అర్థం కావు… పంచ్ ఉండదు, ఆఁ ఊఁ అంటూ లాగ్ ఒకటి… ఒక సబ్జెక్టు నుంచి మరో సబ్జెక్టులోకి జంపై పోతుంటాడు… దీనికితోడు ఈ మందు కొట్టడాలు ఏమిటో, హీరోయిన్లను చేత్తో తోసేయడం ఏమిటో… తెలుగు ప్రజలు చేసుకున్న పుణ్యం ఆ బ్లడ్డు, ఆ బ్రీడు… జై బాలయ్యా…!! బాలయ్య అస్సలు మారడు, ఎహె, మారితే బాలయ్య ఎందుకవుతాడు..?!
Share this Article