ఒకాయన… అకస్మాత్తుగా మరణించాడు… తనకు కొంత ఆస్తి ఉంది… అందులో ఎవరికి వారసత్వపు హక్కు ఉంటుంది..? మామూలుగా మనకు తెలిసిన వారసత్వపు పద్ధతులు, ఆనవాయితీలు, పెద్దల తీర్పులు, చట్టాల ప్రకారం… కొడుకు ప్రథమ హక్కుదారు… ఇప్పుడు స్త్రీలకూ ఆస్తి హక్కు వర్తిస్తున్నది కాబట్టి బిడ్డ కూడా హక్కుదారు… భర్త ఆస్తిపై సహజంగానే భార్య హక్కుదారు… కొడుకుల సంతానం, బిడ్డల సంతానం కూడా హక్కుదారులే… అంతేకదా… ఆ భార్య తరపు తమ్ముళ్లు, అన్నలు వచ్చి, ఆ ఆస్తి మీద మాకూ హక్కు ఉందీ అన్నారనుకొండి… నా అన్నలకు నా హక్కు మేరకు వచ్చిన వాటాను ఇచ్చేస్తాను అని ఆ భార్య అన్నదీ అనుకొండి… సాధారణంగా ఊళ్లల్లో పెద్దలు ఏమంటారు..? ఎహె, ఇదేం పద్ధతి..? తల్లి తరపు కుటుంబసభ్యులు హక్కుదారులు ఎలా అవుతారు..? వాళ్లు వారసులు ఎలా అవుతారు అంటారు… అంతే కదా… అసలు అక్కలకు, చెల్లెళ్ల నుంచి రూపాయి తీసుకున్నా అది అరిష్టమే అనే భావన కూడా హైందవ సమాజంలో ఉంటుంది… కానీ సుప్రీంకోర్టు ఇవన్నీ కొట్టేస్తోంది… ఒక మహిళ పేరిట ఉన్న ఆస్తికి సదరు మహిళ తల్లి తరపు కుటుంబసభ్యులు కూడా వారసులే అని తాజాగా తీర్పు చెప్పింది… అఫ్ కోర్స్, ఆ కేసు సంక్లిష్టత దృష్ట్యా అది కరెక్టు, కరెక్టు కాదు అని ఎవరూ అభిప్రాయపడలేరు… ఎందుకంటే..?
మరణించిన ఆమె భర్తకు ఆ ఆస్తి ఎలా సంక్రమించింది అనే పాయింట్ కూడా హిందూ వారసత్వపు హక్కులో కీలకం… తన తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి అయి ఉంటే మనమలు, మనమరాళ్లు హక్కుదారులు అవుతారు తప్ప భార్య కూడా హక్కుదారు కాబోదు… సరే, ఇన్నిరకాల సంక్లిష్టతలు, చిక్కుముళ్లు ఉన్నాయనుకొండి… ఇక్కడ ఆమెకు సంతానం లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది… సరే, ఈ తాజా తీర్పు నేపథ్యం ఏమిటంటే..? ఎప్పుడో 1953లో ఒకాయన చనిపోయాడు… దాన్ని ఆమె భార్య అనుభవిస్తోంది… తరువాత ఆమె తన తల్లి తరపు కుటుంబసభ్యులకు, అంటే సోదరులకు కొంత ఆస్తి రాసిచ్చింది… అది కరెక్టు కాదంటూ మరణించిన భర్త సోదరుల కుమారులు అభ్యంతరపెట్టారు… ఇదీ కేసు… మన కోర్టుల్లో సివిల్ కేసుల కథ తెలుసు కదా… దశాబ్దాలు సాగుతాయి… ఎంతకీ తెగవు… సాగీ సాగీ… హైకోర్టు దాటి, సుప్రీం దాకా చేరి… ఇప్పుడు తీర్పు వచ్చింది… డెబ్బయి ఏళ్ల క్రితం మరణించిన ఒక మనిషి ఆస్తికి వారసులు ఎవరు అనేది ఎట్టకేలకు తేల్చింది… హమ్మయ్య… 1956 హిందూ వారసత్వపు చట్టం ప్రకారం… ఒక మహిళ కుటుంబసభ్యులు అంటే… అందులో ఆమె పుట్టింటి తరపు సభ్యులు కూడా వస్తారనీ, వారిని విడిగా చూడలేమనీ సుప్రీం చెప్పింది ఇప్పుడు… నిజానికి ఇది చాలా కీలకమైన తీర్పు… ఒక మహిళ పేరిట ఉన్న ఆస్తికి పుట్టింటి వారూ హక్కుదారులే అవుతారు అనేది కొత్త బాష్యం… స్పష్టీకరణ…
Ads
Share this Article