Bharadwaja Rangavajhala………………. దృశ్యాభిమానులకు క్షమాపణలతో ….
నా అనవగాహనే కావచ్చు … కానీ ఇలా అనిపించింది … అనిపించింది చెప్పేస్తే పోతుంది కదానీ ….
జరిగిన నేరాన్ని కప్పిపుచ్చి తన వాళ్లను కాపాడాలనే తాపత్రయం …
ఆ ప్రయత్నంలో … తెలివితేటలు … ఈ క్రమంలో మైండ్ గేమ్ , సీన్ రీ బిల్డ్ చేయడం లాంటి ప్రక్రియలు …
తెరమీద చూపించాలనే తాపత్రయం కనిపించింది నాకు రెండు దృశ్యాల్లోనూ …
ఆ కుర్రాడు చేసిన తప్పు … ఆ కుర్రాడి పెంపకంలో అతని తల్లిదండ్రులు చూపించిన అశ్రర్ద … ఇవే పెద్ద నేరాలుగా కనిపించాయి నాకు …
హత్య కాదది వధ … హత్య చేయడం తప్పేమోగానీ … వధించడం తప్పు కాదు … రెండో దృశ్యంలో ఆ కుర్రాడి తల్లి మోహన్ లాల్ ను లాగిపెట్టి కొట్టినప్పుడు నాకు చాలా పెద్ద బోల్డు ఖోపం వచ్చింది.
మోహన్ లాలుడు తప్పించుకోవడం … మాత్రమే కాదు … చుట్టుపక్కల వాళ్లు అతన్ని చూసి అతని తెలివితేటలు చూసి అసూయపడడం నేరాన్ని కప్పిపెట్టడానికి అతను పడిన తపనను తెలివిని చూసి మరీ అసూయపడడం లాంటివి కూడా భయం కలిగించాయి …
అబ్బ అలా నేరం చేసి కప్పిపెట్టుకునే తెలివితేటలు భగవంతుడు నాకిచ్చి ఉంటే ఎన్ని నేరాలు చేద్దునో అన్నట్టు అనిపించింది …
నేరం కప్పిపెట్టి కుటుంబాన్ని రక్షించుకున్నాను అనుకున్నాడుగానీ ..
ఆ నేర ప్రభావం నుంచీ కుటుంబాన్ని తప్పించలేకపోయాడు కదా ..
కూతురు ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి కల్పించాడు … అది కుదుటపడుతుందనే నమ్మకం కూడా కలగదు …
వీటన్నింటికన్నా … కోర్టులో కంటెస్ట్ చేసి మేం నేరగాళ్లం కాదు … గత్యంతరం లేక మాత్రమే … వధించాం … అలా చేయకపోతే … ఇలా జరిగేది … అని వాదించేసి కొద్దిపాటి శిక్ష అనుభవించేసినా ఆరోగ్యంగా ప్లెయిన్ గా భయం లేకుండా హాయిగా నవ్వేస్తూ … మహానదిలో చెయ్యి లేకుండా జైలు నుంచీ విడుదలైన కమల్ హసనుడి అంత హాయిగా ఉండేవాళ్లు కదా అనిపించింది …
బహుశా నా ఆలోచన తప్పు కావచ్చేమో లెండి … క్రైమ్ అండ్ పనిష్మెంట్ లో వడ్డీ వ్యాపారిని చంపేయడంతో దీన్ని పోల్చకూడదేమో అని కూడా అనిపించింది …
ఒక రకంగా ఆ కుర్రాడు చేసిన నేరం వెనుక సమాజం కూడా బోనెక్కే కేసు కదా ఇది … నేరాన్ని నేరంతోనే కోయాలి అంటే నేనేం చేయలేనుగానీ …
ఆ కుర్రాడు చేసిన క్రైమ్ అతని పోలీసు తల్లిగారి ప్రేమ చాటు దాష్టీకం మాత్రం నాకు భలే భయం కలిగిస్తూనే ఉన్నాయి …
రెండో దృశ్యంలో ఆవిడ మోహన్ లాల్ ని కొట్టినప్పుడైతే బోల్డు భయం వేసింది కూడా …
అయినా నాకెందుకులెండి … పొద్దున్నే హాయిగా ఏ దోశో ఇడ్లో తినేసి హాయిగా కూర్చోక …
Share this Article