అసలే అనసూయ… తన డ్రెస్సులు, జబర్దస్త్‌తో తన గెంతులు… అప్పటి రంగస్థలం రంగమ్మత్త ఇమేజీ… ఇక ఓ మాంచి మసాలా ఐటం సాంగ్ చేస్తున్నదంటే తెలుగు ప్రేక్షకుల్లో కాస్త ఇంట్రస్టు క్రియేటవుతుంది కదా… అలాగే హైప్ క్రియేటైంది… పైగా మంగ్లి టోన్‌లో ట్యూన్… అనసూయ పాట ఎత్తుకోగానే ఓ స్టేజీ మీద ప్రత్యక్షం… తీరా చూస్తూ చూస్తూ పోతూ ఉంటే ప్రేక్షకులు జుత్తు పీక్కున్నారు… అసలు తెర మీద అనసూయ వ్యాంప్ మార్క్ స్టెప్పులు… హొయలు, ఆ ఊపులు, భంగిమలు గట్రా పక్కా ఓ ఐటమ్ సాంగిలాగే… కానీ పాట కంటెంటు అంతా వైరాగ్యం, ఫిలాసఫీ… డొంక తిరుగుడు, మార్మిక అర్థాలు, ద్వంద్వార్థాలు ఏమీ లేవు… ప్యూర్ ఫిలాసఫికల్ కంటెంటు… నిజానికి పాట బాగుంది… ఈ జీవన తరంగాలలో పాట టైపు సీన్లకు బ్యాక్ గ్రౌండ్‌గా పెట్టదగిన కంటెంటు… దానికి ఐటమ్ ట్యూన్ పెట్టి, అనసూయ వంపూసొంపులు పెట్టి, ఓ కంపెనీ ఓనర్ లుక్కు పెట్టి, జానీ మాస్టర్ స్టెప్పులు పెట్టి, పక్కన కార్తికేయను పెట్టి… బోలెడుమంది డాన్సర్లను పెట్టి… ఐటం సాంగు ఏమిటి..? పాటేమో వైరాగ్యం, తెర మీద వయ్యారం… ఇదెక్కడి జుగల్ బందీరా బాబోయ్…
ఈ పాటలో అనసూయను చూస్తే మీకు ఇక నిదరే పట్టదు… మళ్లీ తెర మీద రంగమ్మత్త… అనసూయ తన ప్రౌఢ వయసు వంపులతో ఇరగదీసింది….. ఇలా సైటర్లు, యూట్యూబర్లు తెగ రాసేశారు… హహహ… ఫాఫం… ఒక సీన్ ఊహించుకొండి… సిల్క్ స్మిత తెర మీద కనిపిస్తూ కసెక్కించే స్టెప్పులు వేస్తుంటుంది… వెనక నుంచి ఈ జీవన తరంగాలలో పాట వినిపిస్తుందీ అనుకొండి… ఎలా ఉంటుంది… పోనీ, ఓ కోటప్పకొండ జాతరలోనో స్టేజీ మీద రికార్డింగ్ డాన్సర్లు స్టెప్పులు వేస్తుంటారు, దానికి పాట మాత్రం వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అని మాతృదేవోభవ వినిపిస్తుంటే ఏమనిపిస్తుంది… ఇదీ అంతే… అందుకే లిరికల్ వీడియోకు కూడా పెద్ద రెస్పాన్స్ లేదు… ఎలా ఉంటుంది..? చాలా మంది ఇంకా షాక్ నుంచి తేరుకుని ఉండరు… ఆ పాట ఇలా స్టార్టవుతుంది… ‘‘పుట్టువేళ తల్లికి నువ్వు పురుటి నొప్పివైతివి… గిట్టువేళ ఆలికేమో మనసునొప్పివైతివా..? బట్టమరక పడితే నువ్వు కొత్త బట్టలంటివి… ఇప్పుడేమో ఉతకలేని మట్టిబట్ట కడితివా..? పైన పటారం, ఈడ లోన లొటారం… విను బాసూ చెబుతాను ఈ లోక యవ్వారం…’’
Ads
ఇలా జీవన సత్యాలను, మనుషుల అసలు తత్వాలను బోధిస్తూ…. చివరకు ఏ చింతా వేధించని స్మశానమే బెటర్ బ్రదరూ, ఓ పీటరన్నయ్యా అని ముగుస్తుంది… వీడియో కింద కామెంట్లలో కొందరు ‘‘పైన పటారం, లోన లొటారం… బాగా సూటయ్యింది ఈ పాటకు’’ అని సెటైర్లు కూడా వేస్తున్నారు… ఇంతకీ అందరి డౌటు ఏమిటంటే… ఈ పాట చేయడానికి ముందు అనసూయ విన్నదా..? ఆమెకు ఏమైనా అర్థమైందా..? అసలు ఓ ఫిలసాఫికల్ సాంగ్‌కు జబర్దస్త్ స్టెప్పులు ఏమిటనే డౌట్ రాలేదా..? ఈ నృత్య దర్శకుడికైనా డౌటనుమానాలు ముంచెత్తాలి కదా… సర్లెండి, దర్శకుడు ఏదో ప్రయోగం చేశాడు… ఏమో, సినిమాలో ఏమైనా కొత్తగా చూపబోతున్నాడేమో… క్యారీ ఆన్ బ్రదర్… అనసూయ కెరీర్ ఏదో ఫిలసాఫికల్ బాటలోకి మళ్లుతున్నట్టే ఉంది…!! సినిమా పేరు చెప్పలేదు కదూ… చావు కబురు చల్లగా…! ఈ చావు పాట హాటుగా…!!
Share this Article