ఒక సినిమా తారకు మేకప్ ఎందుకు..? అందంగా కనిపించడానికి… మొహంపై గుంతలు, మరకలు కప్పడిపోవడానికి… డార్క్ షేడ్ కవర్ చేసుకోవడానికి..! తెరపై కనిపించినంతసేపు ప్రేక్షకుడికి ప్లజెంటుగా అనిపించడానికి…! మేకప్ లేకుండా బయటికే రారు, డీగ్లామర్ లుక్కులో కనిపించడానికే ఇష్టపడరు… నాటకాల్లో కూడా రంగు పూసుకోవడం మస్ట్, అందంగా కనిపించడానికే కాదు… మొహంలో ఉద్వేగాలు ప్రస్ఫుటంగా ఎక్స్పోజ్ కావడానికి..! దూరంగా ఉన్న ప్రేక్షకుడికి కూడా స్పష్టంగా కనిపించడానికి..! అసలు సినిమా తారలు, సెలబ్రిటీలే కాదు… మహిళలు బయటికి వెళ్తున్నప్పుడు కాస్త హెవీ మేకప్ దట్టించడం కూడా సాధారణమైపోయింది ఈరోజుల్లో..! మరీ టీవీ సీరియళ్లలోనైతే లేడీ కేరక్టర్లు హాస్పిటల్లో బెడ్ మీద పడుకుని ఉన్నా సరే… నగలు, హెవీ మేకప్, తలలో పూలు, ఆధునిక డ్రెస్సులు గట్రా ఉండాల్సిందే… రిచ్‌నెస్ పైత్యం… సరే, ఇదంతా చెప్పుకోవడం ఎందుకంటే..? దృశ్యం సినిమాలో మీనా మేకప్ గురించిన విమర్శ… దానికి నిజాయితీగా దర్శకుడు జీతూ జోసెఫ్ అంగీకారం గురించి..!!
దృశ్యం సినిమాలో మీనా మేకప్ మీద ఫస్ట్ పార్ట్ సమయంలోనే బోలెడు విమర్శలొచ్చాయి… రెండో పార్ట్‌లోనూ సేమ్ హెవీ మేకప్… హెయిర్, లిప్ స్టిక్ గట్రా… అసలు ఆ పాత్ర ఓ మధ్యతరగతి గృహిణి… మధ్య వయస్సు యువతి… సినిమా అంతా మానసిక ఒత్తిడితో సతమతం అయ్యే పాత్ర… కానీ తన మేకప్ ఆ పాత్ర స్వభావానికి ఆడ్‌గా ఉందనీ, నప్పలేదనీ, వితవుట్ మేకప్ గనుక నటించి ఉంటే నేచురల్‌గా ఉండేదనీ అభిప్రాయాలు వినవచ్చాయి… నిజానికి ఇప్పుడు ట్రెండ్ నాన్-మేకప్… కాస్త మంచి కలర్, చూడబుల్ మొహం ఉంటే మేకప్ లేకుండా… లేదా మినిమం మేకప్‌తో తెర మీద కనిపిస్తున్నారు… నేచురల్ లుక్ వెండి తెర మీద బాగుంటుంది కూడా… పాత్ర స్వభావాన్ని బట్టి డార్క్ షేడ్ ఉన్న ఐశ్వర్యా రాజేష్ వంటి తారలు కూడా మేకప్ లేకుండా నటించటానికి అంగీకరిస్తున్నారు… దర్శకులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు… మరి మీనాకు దృశ్యం దర్శకుడు ఈ విషయం చెప్పలేదా..? ఈ సినిమాలో ఆమె పాత్రకు మేకప్ సూట్ కాదని అభ్యంతరపెట్టలేదా..?
Ads
అభ్యంతరపెట్టాడట… వద్దమ్మా అని చెప్పాడట… మళయాళ మనోరమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనే చెప్పాడు… ‘‘మీ పాత్ర స్వభావానికి మేకప్ లేకపోవడమే మంచిది, లేకపోతే మినిమం మేకప్ చాలు అని చెప్పాను… సరిత పాత్ర చేసిన అంజలి నాయర్‌కు చెప్పాను, ఆమె వెంటనే ఒప్పుకుంది… మీనా ఒప్పుకోలేదు… డీగ్లామరైజ్డ్గా కనిపిస్తాను అని అభ్యంతరపెట్టింది… నేనూ సరేననక తప్పలేదు… ఎందుకంటే..? నా సినిమాలో యాక్టర్స్ చాలా కంఫర్ట్‌గా నటన మీద ఫోకస్ చేయాలి… ఇలాంటి చిన్న చిన్న అంశాలు డిస్టర్బ్ చేయడం సరికాదు… హెవీ మేకప్ విమర్శలు నేనూ చదివాను… వాటిని అంగీకరిస్తున్నాను…’’ అని ఏం జరిగిందో చెప్పాడు… ఏజ్ బార్, ఏమాత్రం మేకప్ తగ్గినా మొహంలో అది కనిపిస్తుందని ఆమె సందేహించి ఉండవచ్చు… ఎవరి బాధ వాళ్లది… ఐనా తమిళం, మలయాళం వాళ్లు ఈమేకప్ గురించి పట్టించుకుని ట్రోలింగ్ చేశారేమో గానీ, మన తెలుగువాళ్లు పెద్దగా పట్టించుకోలేదు… మనం వేరు కదా…
Share this Article