…… అప్పట్లో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా గుర్తుందా..? అందులో బ్రహ్మానందం పాత్ర… గొప్ప ధైర్యవంతుడుగా తనకుతాను మహా బిల్డప్ ఇచ్చుకుంటాడు… కోతలు కోటలు దాటుతాయి… ఓ పిల్ల, తను ఒక రోలర్ కాస్టర్ ఎక్కుతారు… బ్రహ్మీ అందరినీ వెక్కిరిస్తూ ఉంటాడు… ఇదో లెక్కా..? పెద్దపెద్దవే చూశాను అని చెబుతుంటాడు… తీరా అది స్టార్టయి వేగం పుంజుకున్నాక మనవాడి ధైర్యసాహసాలు నిలువునా జారిపోతయ్… కళ్లు మూసుకుని, ఆపండ్రోయ్, మీకు దండం పెడతాను కాపాడండ్రోయ్… అని కేకలు వేస్తుంటాడు… ఆ చిన్నపిల్లకు ఉన్నపాటి ధైర్యం కూడా ఉండదు…
సేమ్… బిగ్‌బాస్‌లో ఈరోజు ఎపిసోడ్ అలాగే దద్దరిల్లిపోయింది… నిజం చెప్పాలంటే ఈ సీజన్ మొత్తానికి హైలైట్ అయ్యేలా రక్తికట్టించిన ఎపిసోడ్… విషయం ఏమిటంటే..? హౌస్‌లో రెండు తోపులున్నాయి తెలుసు కదా… అఖిల్, సొహెయిల్… ఒకరినొకరు విడిచిపెట్టి ఉండరు… మాట్లాడితే మహా పేకుతా ఉంటారు… ఈ ఎపిసోడ్లో టాస్క్ ఏమిటంటే ఒక్కొక్కరు లేదా ఇద్దరేసి కన్ఫెషన్ రూంలోకి వెళ్లాలి… అంతా చీకటి… కింద గంపలు, చెత్తా, గడ్డీగాదం, సౌండ్, లైట్ ఎఫెక్టులు… మధ్యమధ్య దెయ్యం డీజే లెవల్ అరుపులు…
Ads
అందులోకి వెళ్లి, ఎక్కడో దాచిపెట్టబడిన ఓ స్పూన్ పట్టుకురావాలి… అదీ టాస్క్… అరియానా మహా పిరికిది కాబట్టి, అవినాష్‌తో కలిసి వెళ్లి, భయపడుతూ, వణుకుతూ ఎలాగోలా స్పూన్ దొరికించుకుని బతుకుజీవుడా అని వాపస్ వచ్చేస్తారు… ఆ కాసేపు అరియానా భయం, కేకలు చూసి సొహెయిల్, అఖిల్ విపరీతంగా వెక్కిరిస్తారు… ఎగతాళి చేస్తూ డాన్సులు చేస్తారు సొహెయిల్, హారిక… మోనాల్ మాత్రం ఒక్కతే వెళ్లి, ధైర్యంగా స్పూన్ వెతికి తెచ్చుకుంటుంది… తరువాత సొహెయిల్, అఖిల్ వెళ్లాల్సి వచ్చింది…
ఇదీ అసలు కథ… కథ వేరే ఉంటది, మాతోనే తమాషాలా, రా, నీ తాటతీస్తం అంటూ కేకలు పెడుతూ లోపలకు వెళ్తారు… తీరా అక్కడి సౌండ్ ఎఫెక్టులు, అరుపులు వింటూ, ఆ చీకట్లో చుచ్చు పోసుకున్నంత పనవుతుంది… వణికిపోతారు… ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు… ఈ భయం గట్రా నిజమో, అబద్ధమో, నాటకమో గానీ… బాగా రక్తికట్టింది… అచ్చం ఆ వెంకటేష్ సినిమాలో బ్రహ్మానందం తరహాలోనే ఆపండ్రోయ్ అని వణికిపోతారు…
కానీ బయటికి వచ్చి మళ్లీ ఏవో గొప్పలు పేకాలి కదా… మొహాల మీద లేని గాంభీర్యం, ధైర్యం తెచ్చుకుని, బయటికి వచ్చి… బిగ్‌బాస్ కెమెరా ముందు మళ్లీ బోరుమంటారు… బాబ్బాబు, అసలే తోపులం అని చెప్పుకుంటిమి, పొరపాటున కూడా ఈ వీడియోలు ప్రసారం చేయకు ప్లీజ్ అని బతిమిలాడతారు… ఓ అరగంటసేపు సాగిన ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది… మొదటిసారి బిగ్‌బాస్ టీం కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేసినట్టు అనిపించింది… ప్రేక్షకులకు కూడా నచ్చింది… నిన్న గార్డెన్ ఏరియా గ్రేవ్ యార్డ్ సెట్ సరిగ్గా యూజ్ చేసుకోలేక పోయినా ఈరోజు కన్ఫెషన్స్ రూం సెట్ బాగా వాడుకున్నారు… అయితే ఈ ఎపిసోడ్ అయిపోయిందా..? ఇంకా హారిక, అభిజిత్ ఉన్నారు… అరియానాను హారిక కూడా వెక్కిరించింది బాగానే… ఇక అభిజిత్ ఎలా టాకిల్ చేస్తాడనేది ఇంట్రస్టింగే… వెల్డన్ బిగ్‌బాస్…
Share this Article