హిందూ దేవుళ్లను ఎవరైనా తూలనాడొచ్చు… అవమానించొచ్చు… కోట్లాది మంది హిందువుల మనోభావాలను కూడా గాయపరచొచ్చు… ఏమీ కాదు……. ఇదేనా ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం..? వరుసగా గుళ్లపై దాడులు జరుగుతుంటే, విగ్రహాలు ధ్వంసం అవుతుంటేనే ఎవరికీ పట్టదు అంటారా..? కాదు, ఏదో మార్పు కనిపిస్తోంది… కనీసం కొన్ని కేసుల్లోనైనా హిందూ సంస్థల నుంచి ప్రతిఘటన వార్తలు చదువుతున్నాం… కోపం, నిరసన, అసంతృప్తి వ్యక్తీకరణ గోచరిస్తోంది… అమెజాన్ ప్రైమ్ అంటే ప్రపంచంలోకెల్లా ఫేమస్, నంబర్ వన్ ఓటీటీ వేదిక కదా… ఫేస్బుక్, గూగుల్ వంటి సంస్థల్లాగే తాము ఇండియన్ చట్టాలను, స్థానిక మనోభావాలను పట్టించుకోవాల్సిన అవసరమేమీ లేదనీ, తమను ఎవరూ ఏమీ చేయలేరనే భ్రమల్లో ఉండే సంస్థే కదా… కోట్లకుకోట్ల డబ్బు వెదజల్లి, టాప్ లాయర్లను పెట్టి వాదించగలదు కదా… కానీ తాండవ్ అనే వెబ్ సీరిస్ విషయంలో ఆ భ్రమలన్నీ పటాపంచలయ్యాయి… ఇండియాలో ఒక వెబ్ సీరిస్‌కు సంబంధించి తొలిసారిగా ఓ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పుకుంది… అభ్యంతరకరమైన సీన్లను ఎడిట్ చేసింది…
‘‘మేం స్థానిక మనోభావాల్ని గౌరవిస్తాం, ఎవరి విశ్వాసాల్నీ హర్ట్ చేయబోం, ఏవైనా అభ్యంతరాలు వస్తే సరిదిద్దుకుంటాం’’ అని ఏవో కథలు చెబుతోంది అమెజాన్ ప్రైమ్… కానీ అంత తేలికగా దిగిరాలేదు అది… ఈ భారతీయ చట్టాలు, ఈ అభ్యంతరాలు మమ్మల్నేం చేయగలవు అనే భ్రమల్లోనే ఉంది మొదట్లో… ఈ వెబ్ సీరిస్‌లోని కొన్ని సీన్లు హిందువుల మనోభావాలు హర్టయ్యేలా ఉన్నాయనేది వివాదం… మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి… దాంతో జనవరిలోనే ఈ సీరిస్ నిర్మాతలు క్షమాపణలు చెప్పుకున్నారు… కానీ లక్నోలో ఒకే కేసు ఏకంగా అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్‌తోపాటు, డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్, నిర్మాత హిమాంశు కృష్ణ మెహ్రా, రైటర్ గౌరవ్ సోలంకిలపై నమోదైంది… అరెస్టు చేయకుండా ఇన్టరమ్ ప్రొటెక్షన్ ఇవ్వాలని సుప్రీంకు వెళ్తే చుక్కెదురైంది… కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అమెజాన్ నుంచి వివరణ కోరింది… సో, ఇక తప్పలేదు… అందుకని ఇప్పుడు ఓ వీడియోలో క్షమాపణలు కోరి, ఆ సీన్లను ఎడిట్ చేసింది… అంతేతప్ప, అది చెబుతున్న నీతులేమీ దాన్ని దారికి తీసుకురాలేదు… అయితే ఇలాంటి వివాదాలు క్రియేటివ్ ఫ్రీడంకు సంకెళ్లు వేసినట్టు కాదా..? మనోభావాల కత్తులు వేలాడుతూ ఉంటే థాట్స్ ఎక్స్ప్రెషన్ స్వేచ్ఛగా ఎలా సాధ్యం..? అనే ప్రశ్నలు చర్చకొస్తాయి… అయితే ఈ స్వేచ్ఛకు పరిమితులు ఏవి..? ఇదే అసలు ప్రశ్న… చర్చ సాగనీ…!!
Ads
Share this Article