Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాన్సెన్స్ ట్రోలింగ్..! ఓ మోస్తరు పెళ్లి పట్టుచీరె ఖరీదు కాదు డ్రెస్సు..!!

July 7, 2024 by M S R

అక్షత మూర్తి… మాజీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య… ఎంపీ సుధామూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తిల బిడ్డ… విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు… ఎందుకు..? ఆమె ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని, 42 వేల రూపాయల విలువైన డ్రెస్ వేసుకుని, భర్త కుర్చీ దిగిపోయే ముందు ప్రసంగిస్తూ అక్కడ ఈ డ్రెస్ వేసుకుని నిలబడిందట… అంత ఖరీదైన డ్రెస్సా అంటూ విమర్శ…

నాన్సెన్స్… తను పదవి నుంచి దిగిపోయేటప్పుడు రిషి సునాక్ వినమ్రంగా పార్టీ ఓటమికి బాధ్యుడిని నేనే, నన్ను క్షమించండి అని ఓ ప్రకటన జారీ చేశాడు… మన దిక్కుమాలిన నేతలతో పోల్చుకొండి, అదెంత హుందాగా ఉందో… అవన్నీ పక్కకుపోయి, ఆమె డ్రెస్ మీద పడ్డారు, ప్రత్యేకించి సోషల్ మీడియా ట్రోలింగ్…

akshata

Ads

తల్లి సుధామూర్తి మొన్న ఓ మాట చెప్పింది… షాపింగును కాశిలో వదిలేశాను, 30 ఏళ్లుగా అసలు చీరె కొనలేదు… అక్కాచెల్లెళ్లు ఇచ్చినవే కట్టుకుంటాను తప్ప నేను కొనడం లేదు… నాకున్న చీరెలూ చాలా తక్కువ… ఇదీ ఆమె స్టేట్‌మెంట్… ఎస్, ఆమె నిరాడంబరంగా ఉంటుంది… ఇక తల్లి అలా ఉంటే, బిడ్డ ఇలా ఉండటమేమిటి అని సోషల్ విమర్శలు…

ఎవరి లైఫ్ స్టయిల్ వాళ్లది… అక్షత మూర్తి వేల కోట్ల ధనికురాలు… పైగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఫస్ట్ లేడీల లుక్స్, డ్రెస్ సెన్స్ కూడా ప్రజలు జడ్జ్ చేస్తుంటారు… ఏవో 1000 రూపాయల డ్రెస్ వేసుకుని అనామక మహిళల్లా కనిపిస్తే జనమే అంగీకరించరు… ఇక్కడ అక్షత కూడా ఏ మేకప్పు, హంగామాలు లేకుండా ఓ ఛెత్రీ పట్టుకుని అలా నిల్చుంది, అంతే… సరే, అంతెందుకు, మన మోడీ వస్త్రధారణ మీద కూడా బోలెడు ట్రోలింగ్… కానీ తను భారతీయ ప్రధాని, తను ఏ దేశం వెళ్లినా యోగిలాగా కాషాయం కట్టుకుని వెళ్లాలని కోరుకుంటున్నారా..?

saree

ఐనా 42 వేలు అనేది ఒక ప్రధాని భార్యకు అసలు ఓ ఖరీదేనా..? ఇండియాలో సెలబ్రిటీల పెళ్లిళ్లకు వచ్చే మహిళలు కట్టుకునే చీరెలు, డ్రెస్సుల ఖరీదుతో పోలిస్తే అది కౌంట్ లెస్… పైన ఓ చీరె ఉంది చూశారుగా… ధర్మవరం చేనేత కళాకారులు కొన్నాళ్ల క్రితం చేరిన ఈ చీర ఖరీదు అక్షరాలా 5 లక్షలు… ఓ మోస్తరు ధనికులు కూడా కొనే పెళ్లి పట్టుచీరెలు లక్ష దాకా పలుకుతున్నాయి…

isha

అంతెందుకు..? మొన్నామధ్య మెట్ గాలా ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఇషా అంబానీ డ్రెస్సు ఇది… వందల మంది, వందల గంటలు శ్రమించి రూపొందించిన డ్రెస్… ఎన్ని కోట్లో చెప్పలేం… సేమ్, ఆలియా భట్ డ్రెస్సు కూడా ఇలాగే వార్తల్లోకి ఎక్కింది… మన తెలుగు మేఘా సుధారెడ్డి ఆ ఈవెంట్‌లో పాల్గొంది కదా… జస్ట్, ఒక్క ఈవెంట్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్న సెలబ్రిటీలున్నారు… అలాంటిది 400 పౌండ్ల అక్షత మూర్తి డ్రెస్సు ఓ లెక్కా..? చివరగా ఈ ఫోటో చూడండి… ఇది ఫేక్ ఫోటో… AI Creation… కానీ ఇదుగో ఇలాంటి డ్రెస్సు వేసుకున్నది అక్షత మూర్తి అన్నంత బిల్డప్పు ఇచ్చి మరీ తిడుతున్నారు… అందుకే నాన్సెన్స అనేది…

ambani

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆల్ పార్టీ మీటింగు… నవ్వు పుట్టించే తెలంగాణ ప్రభుత్వ లేఖ…
  • Annamalai Breaks Free of His Shackles… Trouble Ahead for Palaniswami
  • నందూస్ వరల్డ్..! ఈ యూ-ట్యూబర్ చీటరా..? అసలేం జరుగుతోంది..?!
  • బంధనాలు తెంచుకున్న అన్నామలై… పళనిస్వామికి చుక్కలే…
  • రాత్రికిరాత్రి వైరల్ స్టార్… ఒక్క రాత్రికి నీ రేటెంత అనడిగేదాకా…
  • yudhvir ahlavath … హఠాత్తుగా సోషల్ మీడియాలో వైరల్… ఎందుకంటే…
  • రహేఁ నా రహేఁ హమ్…! ‘సుమనో’హర మధుర స్మృతి, ఒక మూగ వేదన..!
  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?
  • దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions