Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శివ శివా… ఏం సినిమారా ఇది దేవుడా… రుచీపచీ లేని కిచిడీ…

August 2, 2024 by M S R

హనుమాన్, కాంతారా, కార్తికేయ… ఇంకేమైనా హిట్ సినిమాలుంటే… అన్నీ మిక్సీలో వేసి, తరువాత కిచిడీ చేసి… ఓ కథ వండి… ఓహ్ సూపర్ స్టోరీ లైన్ దొరికింది సుమీ అనుకున్నాడేమో దర్శకుడు… అదేనండీ శివం భజే సినిమా కథ గురించే…

ఇప్పుడు ట్రెండ్ అదే కదా… దేవుడు, ఫాంటసీ కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు ఓ కథ రాసుకున్నాడు… హిడింబ అని ఆమధ్య ఏదో ఇదే తరహా డిఫరెంటు సినిమాలో చేశాడు కదా, అదే అశ్విన్ బాబు హీరోగా తీసుకున్నాడు… కానీ ఎంత ఫాంటసీ అయినా, ఏ పురాణం ఫ్లేవర్ కలిపినా… జనాన్ని కన్విన్స్ చేసేలా ఉండాలి కదా…

అసలు ఫస్టాఫ్ అంతా లోన్ రికవరీ ఏజెంటుగా హీరో ఇంట్రడక్షన్, తన ప్రొఫెషన్… తెలుగు సినిమా అన్నాక హీరోయిన్ ఉండాలి కదా… దిగాంగన అనే సదరు హీరోయిన్‌తో లవ్వు ట్రాకు… తరువాత హీరో కళ్లు పోతే వేరే కళ్లు పెడతారు… తీరా చూస్తే అవి కుక్క కళ్లు అట… అవి పెట్టాక ఏవేవో పాత సంగతులన్నీ గుర్తొస్తాయి… ఆ కళ్లకే కనిపిస్తూ ఉంటాయి…

Ads

ఇక అక్కడి నుంచి కథలో దేవుడు, దేశ సరిహద్దులు, యుద్ధాలు, వ్యూహాలు, మాయలు, భ్రమలు… మన్నూమశానం… తీసేవాడికి చూసేవాడు లోకువ… అన్నింటికీ మించి వెగటు కామెడీ… హైపర్ ఆది అంటేనే ఆ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోల తాలూకు వెగటు పంచులు గుర్తొస్తాయి… కుక్కతో హీరోకు సంబంధాన్ని అంటగట్టే డైలాగులు ఏం అభిరుచి..?

సినిమాల్లోనైనా ఆ ఇమేజీ నుంచి బయటపడాలనుకోవాలి కదా… నో, దర్శకుడు కూడా ఆది అంటే అదే తరహా పంచులు, జోకులు మస్ట్ అనుకున్నట్టున్నాడు… ఫాఫం ఆది… మరీ ఓచోట హీరోతో యూరిన్ పోయించే సీన్ మరీ ఏవగింపు కలిగేలా ఉంది… హైపర్ ఆది ఇదే తన మార్క్ అనుకుని, ఇలాగే కొనసాగితే… ఇక అంతే సంగతులు… పైగా దాన్ని పాతాళగంగతో పోల్చడం, షకలక శంకరుడి దవడ డైలాగ్ మరో నీచం…

ఇదీ దర్శకుడి టేస్టు… కథకు మస్తు మసాలాలు ఉండాలనుకుని… ఇలాంటి కామెడీ, అంతర్జాతీయ టెర్రరిజం, దేవుడు, జీన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, మెడికల్ సైన్స్, డివైనిటీ, యాక్షన్… పోనీ, ఆ డిఫరెంట్ కథకు డిఫరెంట్ క్లైమాక్స్ ఏమైనా ఉందా..? సోది క్లైమాక్స్… ఒక కాంతారా, ఒక హనుమాన్, ఒక కార్తికేయ తీయాలనే సంకల్పం మంచిదే గానీ… వెగటు కామిడీని రంగరించి, బోలెడంత మసాలా వేస్తే… ఇదుగో ఇలాంటి రుచీపచీ లేని కిచిడీ తయారవుతుంది… ఫాఫం అశ్విన్ బాబు…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘కల్వర్టు కిందకు లాక్కెళ్లి, దుస్తులు విప్పి… అత్యాచారయత్నమే కాదంటే…?’’
  • ఈ శృతి కథ మీ కథేనా … చదవండి, ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంది…
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజంగా సిగ్గుపడాల్సిన ఓ వైఫల్యం..!!
  • ‘బలుపు కా బాప్’… నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేశావురా హార్దిక్…
  • తెలంగాణ రాజకీయాల్లో ఓ సైలెంట్ మార్పు..! బీసీ, వుమెన్ చైతన్యం..!
  • హోర్ముజ్ జలసంధిపై కుదరని సంధి… మళ్లీ ఉద్రిక్తతలు…
  • స్వరరచనలో లబ్ధి ప్రతిష్ఠుడే… లిటిగెంటుగా పే-ద్ద లుబ్ధ ప్రతిష్ఠుడే…
  • ఏపీ రాజకీయాల్లో కోవా – నెయ్యి – పెరుగు – ప్రతిదీ గాయిగత్తరే…
  • కరీంనగర్ ఇషాన్ కిషన్… బండి సంజయ్… ఓ ఉత్కంఠభరిత మ్యాచ్..!!
  • మేడం సార్, మేడం, అంతే… వయస్సు మీద పడినా భానుమతి లెవల్ అదే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions