ఏ1 ఎక్స్‌ప్రెస్ నాతో కూడా చూడబడింది… సగటు సౌతిండియన్ సినిమాలకుండే కొన్ని విశిష్ట అవలక్షణాలు ఏమీ మిస్ కాలేదు… పైగా తమిళ డైరెక్టర్.., తమిళ కథ, తమిళ ఒరిజినల్ సినిమా, అవే తమిళ ట్యూన్లతో అక్కడక్కడా తమిళ వాసన కొట్టినా సరే… ఏదో హాకీ మీద ఇన్స్పిరేషనల్ స్టోరీ కావచ్చులే అనుకుంటే మొత్తం ఇర్రేషనల్ కథతో చావగొట్టాడు… హాకీ స్టిక్‌తో కొట్టినట్టే… అయోధ్య సుందరి లావణ్య త్రిపాఠీ ప్లస్ సందీప్ కిషన్ ఇద్దరూ హాకీ స్టిక్స్ పట్టుకున్న పోస్టర్లు చూసి… ఇదేదో ఆమెను ప్లస్ ఇండియన్ హాకీని ఉద్దరించిన ఏదో కథే అయి ఉంటుందని భ్రమపడితే… అసలు కథ ఎక్కెడక్కడికో వెళ్లిపోయి, ఆమెను కూడా తెరమరుగైపోయి… ఓ స్టేడియం రక్షణ ఎపిసోడ్‌లోకి వెళ్లిపోయింది… బాషా టైపులో అన్నీ వదిలేసుకుని… వీలు చూసుకుని యానాం ద్వారా ఫ్రాన్స్ వెళ్లి సెటిల్ కావాలని ప్రయత్నించే హీరో… సినిమా కదా… మళ్లీ హాకీ స్టిక్ పట్టుకుని, కథతో సెకండాఫ్ కబడ్డీ ఆడేసి, స్టేడియాన్ని రక్షిస్తాడు… అవునూ, యానాం వెళ్తే మంచి ప్రాన్స్ దొరుకుతాయని తెలుసు గానీ, ఫ్రాన్స్‌కు రూట్ కూడా దొరుకుతుందా..?
ఒక స్టేడియాన్ని మింగేయాలనే రాజకీయ నాయకులు, వ్యాపారులు ఉండవచ్చు గాక… దేశం నిండా అలాంటోళ్లే తగలడ్డారు… కానీ స్టేడియాన్ని తెగనమ్మే సర్కారు, ఓ ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ ఉన్న టీం ఓ ఆట గెలిస్తే చాలు ఇక దాని జోలికి పోదా..? దానికి ప్రొటెక్షన్ లభిస్తుందా..? ఎలాగబ్బా..? సినిమా కథలకు పెద్దగా లాజిక్కులు ఉండవు సరే గానీ, మరీ ఇలాగా..?! ప్రేక్షకులంటే మరీ అంత తేలికభావం మంచిది కాదోయ్ సందీపూ… నువ్వు కూడా దీనికి నిర్మాతవు కాబట్టి నీకే చెప్పాలి ఇది… మధ్యమధ్యలో కథకు అడ్డుతగిలి తెగ విసిగించిన ఆ పాటలకన్నా ఈ స్టేడియం రక్షణ పర్వమే నవ్వు తెప్పించింది… మిత్రుడు Bharadwaja Rangavajhala…. వాల్ మీద కనిపించిన ఓ సెటైర్ ఈ కథపై, ఈ స్పోర్ట్స్ కథల ట్రెండుపై పర్ఫెక్ట్ గోల్ షాట్…
Ads
Share this Article