Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బంగ్లాలో అమెరికా పెట్టిన చిచ్చు ఇది… పెద్ద పెద్ద ఎత్తుగడలతోనే అమలు…

August 14, 2024 by M S R

అమెరికా ఒక మిలటరీ బేస్ ను బంగ్లాదేశ్ లో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది! ఈ నిర్ణయం అనేది నిన్నా మొన్నా తీసుకున్నది కాదు. మూడేళ్ల క్రితం నిర్ణయం అది. ఆలోచన మాత్రం ఒక దశాబ్ద కాలం నాటిది. ఆలోచన నిర్ణయరూపం తీసుకుంది మాత్రం మూడేళ్ళ క్రితమే!

*******
బంగ్లాదేశ్ లో మిలటరీ బేస్ తో పాటు ఒక నావీ బేస్ ను కూడా ఏర్పాటు చేయాలని తరువాత నిర్ణయం తీసుకున్నారు. మరి దీనికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు అని వాళ్ళకి తెలుసు. మరి అమెరికా తన ప్లాన్ ను ఎలా అమలు చేయగలదు?

*********
అమెరికా తన ప్లాన్ ను అమలు చేయాలంటే ఒక్కటే మార్గం! అది భారత్ – బర్మా – బంగ్లాదేశ్ లలో ఒక్కో భాగం విడగొట్టి కొత్త పేరుతో ఒక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలి! ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఒక్కో అడ్డంకిని నరుక్కుంటూ రావాలి!

Ads

మూడేళ్ల క్రితమే మణిపూర్ లో చిచ్చు పెట్టింది అమెరికా. మణిపూర్ ఇంకా మండుతూనే ఉంది!

మణిపూర్ లో హింస చెలరేగడానికి హైకోర్టు తీర్పు కారణం. బంగ్లాదేశ్ లో హైకోర్టు తీర్పు వల్ల హింస ప్రజ్వరిల్లింది. చివరికి సుప్రీం కోర్టు కోటా 30 శాతం నుండి 5 శాతానికి తగ్గించినా సరే! పై రెండింటిలో సారూప్యత ఉంది కదా?

జూన్ నెల మొదటి వారంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా మూడో దేశం తమ దేశ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది అంటూ అంతర్గత భద్రతా కమిటీ సమావేశంలో పాల్గొన్న బంగ్లాదేశ్ కి చెందిన స్క్వాడ్రన్ లీడర్ (Retd.) సద్రుల్ అహ్మద్ ఖాన్ (Sadrul Ahmed Khan) తో చెప్పినట్లు తెలుస్తోంది.

సద్రుల్ అహ్మద్ ఖాన్ బంగ్లాదేశ్ ఫైనాన్స్ మరియు ప్రణాళిక సంఘం సభ్యుడు, అవామీ లీగ్ పార్టీ సభ్యుడు.

జూన్ నెల మొదటి వారంలో The Sunday Guardian పత్రికా విలేఖరి సర్దుల్ అహ్మద్ ఖాన్ తో ఇంటర్వ్యూ తీసుకున్న సందర్భంలో సాద్రుల్ అహ్మద్ ఖాన్ షేక్ హసీనా తనతో ఏమి చెప్పారో వెల్లడించాడు.

సద్రుల్ అహ్మద్ ఖాన్ :: మయన్మార్ (బర్మా) లోని కుకీ చిన్ ప్రావిన్స్ ( Kuki Chin Province) , బంగ్లాదేశ్ లోని చత్తోగ్రామ్ పర్వత ప్రాంతాలు, భారత్ లోని మిజోరంలతో కలిపి ఒక చిన్న దేశం ఏర్పాటు చేయాలి అని కుట్ర జరుగుతున్నది. ఈ మూడు ప్రాంతాలలో క్రిస్టియన్ జనాభా మెజారిటీలో ఉంది.

బర్మాలో సైనిక నియంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుకీ చిన్ రెబెల్ గ్రూపు ఆయుధాలతో ఎదురు దాడులు చేస్తున్నారు. ఈ రెబెల్ గ్రూపు ఇతర నాన్ కుకీ చిన్ గ్రూపులతో కలిసి పోరాటం చేయదు. బర్మాలో చాలా రెబెల్ గ్రూపులు అక్కడి సైన్యంతో పోరాడుతున్నాయి కానీ కుకీ చిన్ రెబెల్ గ్రూపు మాత్రమే పోరాడుతున్నారు.

ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నది అంటే నాన్ కుకీ చిన్ గ్రూపులలో క్రిస్టియన్లు ఉన్నా వాళ్ళని కుకీ చిన్ రెబెల్ గ్రూపు దగ్గరికి రానివ్వదు. ఎందుకంటే కుకీ చిన్ రెబెల్ గ్రూపుకు గట్టి సూచనలు ఉన్నాయి ఇతర గ్రూపుల్లో క్రిస్టియన్లు ఉన్నా వాళ్ళని కలుపుకోని పోరాటం చేయవద్దు అని. అలా చేస్తే కుకీ చిన్ లకి ప్రత్యేక క్రిస్టియన్ దేశం ఏర్పడడానికి అడ్డుపడుతారు అని.

*****

బంగ్లాదేశ్ లోని చత్తోగ్రామ్ (Chattogram) పర్వత ప్రాంతాలలో ఉన్న గిరిజనులు కుకీ చిన్ గిరిజనiలతో సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే మిజోరంలోని కుకీ చిన్ లతో కూడ సంబంధాలు ఉన్నాయి. So! మూడు దేశాల సరిహద్దుల వెంట ఉన్న ప్రాంతాలతో కలిపి చిన్న క్రైస్తవ దేశం ఏర్పాటు చేస్తే తరువాత దానిని ఇజ్రాయేల్ లాగా అభివృద్ధి చేసి ఒక ఆట ఆడుకోవచ్చు!

********
జులై 1, 2024. వాషింగ్టన్ ! అమెరికన్ కాంగ్రెస్ ఒక బిల్లు ప్రవేశపెట్టింది! 8863 the బ్రేవ్ బర్మా యాక్ట్! The Brave Burma Act! ఈ బిల్లు బర్మాలో సైనిక నియంత ప్రభుత్వం ప్రజల మీద అణిచివేత దోరణి అమలు చేస్తున్నది కాబట్టి బర్మా సైన్యాధికారుల ఆస్థులు, వ్యాపారాలు, ఆయుధ దిగుమతులు డాలర్ల రూపంలో జరిగే ప్రతీ లావాదేవీలను స్థంభింప చేయడానికి అమెరికా అధ్యక్షుడికి అధికారాలను కట్టబెడుతున్నది! మానవతా దృక్పథంతో అమెరికా ఈ బిల్లు ప్రవేశపెట్టింది అని అనుకోవచ్చు కానీ ఈ బిల్లు వెనుక కుట్ర దాగి ఉంది!

జులై నెలకి ముందు కుకీ చిన్ రెబెల్ గ్రూపు సభ్యులు ఓ యాభై మంది బర్మా సరిహద్దులు దాటి భారత్ లోని మిజోరం రాష్ట్రంలోకి ప్రవేశించారు! బర్మా సైన్యం హెలికాప్టర్ గన్ షిప్స్ తో ఆకాశం నుండి కాల్పులు జరపడంతో కుకీ చిన్ రెబెల్ గ్రూపు సభ్యులు ప్రాణాలు కాపాడుకోవడానికి భారత్ లోకి వచ్చారు. సరిహద్దులు దాటి దాడి చేయడానికి బర్మా సైన్యం ముందుగా ఎలాంటి అనుమతి భారత్ నుండి తీసుకోనందున బర్మా హెలికాప్టర్లు భారత్ లోకి రాలేదు.

ఇక్కడే అసలైన మర్మం దాగి ఉంది! The Brave Burma Act అనేది బర్మా సైన్యాధికారులతో పాటు మొత్తం సైన్యంకి సహాయం అందకుండా బలహీనపరిచి కుకీ చిన్ రెబెల్ గ్రూపు పరోక్షంగా పై చేయి సాధించాడానికే! చివరికి సైన్యం దిగివచ్చి అడవులలో ఉన్న మీ ప్రాంతానికి అటానమస్ స్టేటస్ ఇస్తాము అని సైన్యం చేత అనిపిస్తారు! ఒకసారి అటానమస్ స్టేటస్ వచ్చాక కుకీ చిన్ రెబెల్ గ్రూపు మేము మిజోరం మరియు బంగ్లాదేశ్ లో ఉన్న చిత్తోగ్రామ్ తో కలిసి పోతాము అంటారు!

**********
దశాబ్దాలుగా మిజోరాం రాష్ట్ర ప్రజలు తమకి తాము యూరోపియన్ దేశాలతో పోల్చుకుంటూ వస్తున్నారు! మనలో చాలా మంది చూసి ఉన్నాం కదా!
ఓహ్! ఇది యూరోపియన్ దేశం కాదు మన దేశంలోనే ! No Honking ! No Overtaking! The Quiet city of Aizawl ! అనే ట్యాగ్ లైన్ తో మిజోరం రాజధాని ఐజ్వాల్ రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలు ఒక దాని వెనుక ఒకటి క్రమశిక్షణతో నిలిపి ఉంచడం, ఎదురుగా వచ్చే వాహనాలకు కుడివైపు రహదారిని ఖాళీగా ఉంచడం ఉన్న ఫోటోలు, వీడియో లు వైరల్ అవడం!

మిజోరం ప్రజలని, రాజకీయ నాయకులని చర్చి చాలా సులభంగా మానిపులేట్ చేయగలదు ప్రత్యేక క్రిస్టియన్ దేశం కోసం! త్వరలోనే మిజోరంలో కూడ హింస ప్రజ్వరిల్లుతుంది ఏదో ఒక చిన్న కారణం చేత! అఫ్కోర్స్! మిజోరం మీద ఛైనాకి కూడా పట్టు ఉంది దశాబ్దాలుగా!

********
మణిపూర్ లో హింస అనేది ఒక వేకప్ కాల్! మణిపూర్ తో పాటు మిగిలిన ఈశాన్య రాష్ట్రాలలో హింస మొదలవుతుంది మళ్ళీ అదుపు చేయలేనంతగా ! పైన పేర్కొన్న అంశాలు క్లుప్తంగా పేర్కొనడం జరిగింది!

********
ఇంతకీ భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలు, బర్మా, బంగ్లాదేశ్ లోకి ఆయుధాలు ఎక్కడినుండి వస్తున్నాయి? గోల్డెన్ ట్రాయాంగిల్ సౌత్ ఈస్ట్ ఆసియా ! Golden Triangle of Southeast Asia !

నార్త్ఈస్టర్న్ బర్మా, నార్త్ వెస్ట్రన్ థాయిలాండ్, లావోస్ దేశపు ఉత్తర భాగంల మధ్య ఉన్న పర్వతాలు, అడవులు ఉన్న ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాన్గిల్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా అని పిలుస్తారు. 2 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది! ఓపియం, హెరాయిన్ లకి కేంద్ర స్థానం గోల్డెన్ ట్రయాంగిల్! బర్మా సైన్యంకి ప్రధాన ఆదాయ వనరు డ్రగ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చే డాలర్లు!

గోల్డెన్ ట్రయాంగిల్ లో ఉన్న డ్రగ్ లార్డ్స్ ఆయుధాలు సరఫరా చేస్తూ ఉంటారు బర్మా, బంగ్లాదేశ్, భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకి. పాకిస్ధాన్ ISI, అమెరికన్ CIA కీ డ్రగ్ మాఫియాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి 1970 వ దశకం నుండి. ISI కి డ్రగ్స్ సరఫరా చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలి అన్నది నేర్పింది CIA నే!

*********
ఇక బంగ్లా ప్రధాని షేక్ హసీనాకి డ్రగ్ మాఫియాతో ఇబ్బందులు ఏర్పడకుండా గత పదేళ్ళలో RAW సహకరిస్తూ వచ్చింది. ఎప్పటికప్పుడు అజిత్ దోవల్ డ్రగ్ మాఫియా ఆయుధాల తరలింపు మీద ఇన్ఫుట్స్ ఇస్తూ రావడం వలన గత పదేళ్ళలో బంగ్లాదేశ్ లో కుకీ చిన్ గిరిజనులతో ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకుంది!

So! హసీనాను తప్పిస్తే కానీ పని జరగదు ఎందుకంటే అవామీ లీగ్ ప్రభుత్వం ఉన్నంతకాలం భారత ప్రభుత్వం విదేశీ కుట్రల గురించి సమాచారం ఇస్తుంది. అదే అవామీ లీగ్ పార్టీ కాకుండా వేరే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా భారత్ నుండి సమాచారం రాదు…. Contd…part 5… (విశ్లేషణ, సమాచార సేకరణ, అభిప్రాయం  :: పొట్లూరి పార్థసారథి)

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions