తెలుగు ఇండియన్ ఐడల్ షోను సదరు ఆహా ప్లాట్‌ఫామ్ క్రియేటివ్ టీం భ్రష్టుపట్టిస్తున్నా సరే… ఓ చెత్తా సగటు సినిమా సాంగ్స్ షోలాగా మార్చేసి, అల్లు అరవింద్‌కు పంగ నామాలు పెడుతున్నా సరే… కొంతలోకొంత థమన్ దానికి బలంగా, ఆసరాగా నిలబడుతున్నాడు… అదొక్కటే దానికి ఆక్సిజెన్…
ఎలిమినేషన్లు, గెస్టులు, జడ్జిమెంట్లు, పాటల ఎంపిక…. మొత్తం థమన్ చెప్పినట్టే..! గీతామాధురి, కార్తీక్… జస్ట్, ఉన్నారంటే ఉన్నారు… వోట్లు గీట్లు జాన్తా నై… గీత, కార్తీక్ అస్సలు జాన్తా నై… థమన్ ఏది చెబితే అది… పర్లేదు, తప్పుపట్టే పనే లేదు… అంతకుముందు నిత్యామేనన్ జడ్జి, మరి థమన్ ఎందుకు వద్దనుకున్నాడో తెలియదు, గీతా రెండు సీజన్లుగా ఎందుకు వోకే తెలియదు… మధ్యలో హేమచంద్ర హోస్ట్, తనూ బాగానే చేశాడు… కానీ ఆ ఫస్ట్ సీజన్ శ్రీరామచంద్రే మళ్లీ కావల్సి వచ్చాడు… ఎందుకో ఎవరూ అడగొద్దు…
సరే, ఇవన్నీ జుజుబీ… తన పరిచయాలు వినియోగిస్తాడు, మంచి పాపులర్ గెస్టులను తీసుకొస్తాడు… జోక్స్ వేస్తాడు, ఇన్వాల్వ్ అవుతాడు, షో రక్తి కట్టిస్తాడు… అవీ ఈ షోకు బలం… ఇప్పుడిక ఏకంగా వాళ్ల మదర్‌నే షోను తీసుకొచ్చాడు… ఇంటిపేరు ఘంటసాల అనుకుంటా… ఆమె పేరు సావిత్రో ఏదో ఉంది… చాలా సరదాగా పార్టిసిపేట్ చేసింది… గుడ్ అమ్మా…
Ads
చిన్నప్పుడు థమన్ తండ్రి చనిపోతే, తనే ఒడిలో పెట్టుకుని పిల్లల కోడిలా కాపాడుకుంది… థమన్ ఎప్పుడూ క్లాస్ రూం వెళ్లేవాడు కాడట, ఎప్పుడూ ప్లే గ్రౌండేనట… తోటి పిల్లల టిఫిన్ డబ్బాలు ఓపెన్ చేసి తినేసేవాడట, అల్లరివాడట… అవన్నీ చెబుతూ సాయి నాన్నా… సాయి కన్నయ్యా అంటూ మురిపాలు పోయింది… బాగుందమ్మా… మురిపెంగా, సరదాగా… గుడ్… అమ్మకు కొడుకు ఎంత ఎదిగినా అంతే కదమ్మా…
మిగిలింది షోలో ఆరుగురు… ఎలాగూ జడ్జిలందరూ నజీరుద్దీన్ మీద విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు… తనకు క్లాసికల్ టచ్ తక్కువ ఉన్నట్టుంది… కాకపోతే సాధన, పర్‌ఫామెన్స్, వాయిస్ బాగున్నాయి… ఈ ఆరుగురికి తోడుగా గతంలో ఇదే షోలో విజేతలు, ప్రస్తుతం ప్లే బ్యాక్ సింగర్లుగా ఉన్న మరో ఆరుగురినీ పిలిచి… కంటెస్టెంట్లతో జుగల్ బందీ చేయించారు… బాగుంది ప్రయోగం… దామిని, సౌజన్య ఎట్సెట్రా కనిపించారు… మిగతావాళ్లు ఎవరో ప్రోమోల్లో క్లారిటీ లేదు… అది ఆహా క్రియేటివ్ టీం దరిద్రం…
ఎవరో ఇద్దరు లౌడ్ పేస్‌లో లాగించిన శంభో శివ శంభో మరీ హైపిచ్… చివరకు థమన్ కూడా చెవుల్లో నుంచి రక్తం కారుతుంది అని ఎక్స్‌ప్రెస్ చేశాడు.,. గీతామాధురి ఓ దశలో చెవులు మూసుకుంది… విచిత్రం ఏమిటంటే… అది బొమ్మ బ్లాక్ బస్టర్ పర్‌ఫామెన్స్ అట… ఎవడు బాబూ, ఇది నిర్దేశిస్తున్నది…?!
కాకపోతే మళ్లీ అదే వికారం… పిక్చర్ గీసి పిచ్చెక్కిస్తా అంటూ కార్తీక్, గీతామాధురితో ఏవో పిచ్చి బొమ్మలు గీయించి, ఏదో ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది… కానీ సీరియస్ మ్యూజిక్ లవర్స్ ఈ వేషాలను అసహ్యించుకుంటారనే సోయి థమన్‌లో లోపించినట్టుంది… మళ్లీ మళ్లీ ఈటీవీ పాడుతా తీయగా షో వైపు మ్యూజిక్ లవ్ ప్రేక్షకులు మళ్లేలా… దాన్నే మెచ్చుకునేలా చేసేట్టుంది ఈ తెలుగు ఇండియన్ ఐడల్ షో క్రియేటివ్ టీం…!!
Share this Article