ఓ స్టోరీ చదవండి… ఇజ్రాయిల్ ఏ రేంజులో తన శతృవుల మీదకు పంజాలు విసురుతుందో అర్థమవుతుంది… మిత్రుడు పొట్లూరి పార్థసారథి కథనం …
చిక్కుముడి వీడింది!
ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ May 19,2024 న అజర్ బైజాన్ సరిహద్దులో హెలికాప్టర్ కూలిపోవడం వలన చనిపోవడం తెలిసిందే!
అయితే హెలికాప్టర్ ప్రమాదం మీద ఇప్పటి దాకా మిస్టరీగా ఉండేది!
కానీ ఇబ్రహీం రైసీ కూడా పేజర్ వాడేవాడు!
ఆరోజు హెలికాప్టర్ ప్రమాదం జరిగిన రోజు కూడా కూలిన శిధిలాలలో కాలిపోయిన పేజర్ కూడా దొరికింది కానీ అది హెలికాప్టర్ కూలడం వలన చెలరేగిన మంటలలో కాలిపోయి ఉండవచ్చు అని అనుకున్నారు!
అయితే ఇప్పుడు చిక్కుముడి వీడింది!
Ads
ఇబ్రహీం రైసీ వ్యక్తిగత బాడీ గార్డు అజర్ బైజాన్ వెళ్ళేటప్పుడు ఒకే హెలీకాప్టర్ లో ప్రయాణించారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం రైసీ బాడీగార్డు వేరే హెలికాప్టర్ లో ఎక్కాడు. అంటే రైసీ హెలికాప్టర్ కూలిపోతుంది అని బాడీగార్డ్ కి ముందే తెలుసు.
ఇబ్రహీం రైసీ వాడుతున్న పేజర్ లో ట్రోజాన్ హార్స్ వుండి ఉంటుంది. ఆ పేజర్ పేలిపోవడం వలన పైలట్ హెలికాప్టర్ ని కంట్రోల్ చేయలేక పోవడంతో కూలిపోయింది!
కింది ఫొటోలో అజర్ బైజాన్ కి వెళ్లేముందు అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం రైసీది. ఎదురుగా టేబుల్ మీద పేజర్ వుంది చూడండి
*******************
ఇరాన్ సుప్రీం లీడర్ తన ముఖ్య అనుచరులతో ఒక రహస్య ప్ర దేశానికి వెళ్ళిపోయాడు భయంతో!
మరో వైపు ఇజ్రాయేల్ ప్రధాని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తూ నేరుగా ఆయుతోల్లా అలీ ఖోమెనీకి తీవ్ర హేచ్చరిక చేశాడు!
తరువాత ఏమిటి?
నేరుగా ఇరాన్ లోని అణు రియాక్టర్ల మీద దాడి చేయవచ్చు!
IRGC (Iran Revolutionary Gaurd Corps ) కి ఆదేశాలు ఎవరు ఇవ్వాలి?
అంతా అయోమయంగా వుంది ఇరాన్ లో!
హెఙబొల్లా కొత్త చీఫ్ హాసన్ ఖలీల్ యాసిన్ కూడా చంపబడ్డాడు!
హెజ్బొల్లా చీఫ్ నజరల్లాహ్ మరణించిన వెంటనే హసన్ ఖలీల్ యాసిన్ ( Hasan Khalil Yassin ) ని హెజ్బొల్లాకి కొత్త చీఫ్ గా నియమించారు!
కానీ కొద్ది గంటలలోనే హాసన్ ఖలీల్ యాసిన్ ని కూడా చంపేసింది IDF!
హెజ్బొల్లా చరిత్రలో అతి తక్కువ కాలం అంటే 7 గంటలు మాత్రమే ఈ టెర్రర్ గ్రూపుకి చీఫ్ కమాండర్ గా ఉన్నాడు!
ఎలా చంపబడ్డాడో వివరాలు ఇంకా తెలియదు!
అత్యంత సుశిక్షిత సాయుధ ఉగ్రవాద బలగాలున్న సంస్థగా హెజ్‌బుల్లాకు పేరుంది… వాకీటాకీలు, పేజర్లు, ఫోన్లలో బాంబులు పెట్టి మరీ దాని వెన్నువిరిచిన ఇజ్రాయిల్ దాని చీఫ్‌లను కూడా ఎలా పర్‌ఫెక్ట్ ఆపరేషన్‌తో ఖతం చేసిందో చదివాం… ఇరాన్ మాజీ అధ్యక్షుడినీ హతం చేసింది… ఒకసారి ఇజ్రాయిల్ హిట్ లిస్టులో పేరెక్కితే ఇక ఆ పేరును ఎప్పుడోసారి కొట్టేయాల్సిందే…
మొస్సాద్, ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్, మరేదో సంస్థ… ఏదైతేనేం..? ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయిల్‌ది మామూలు టెంపర్‌మెంట్ కాదు… ఆ ఉగ్రవాద సంస్థలన్నింటికీ యూదులే కాదు, హిందూ జాతి కూడా టార్గెటే… కానీ ఇజ్రాయిల్ సాగిస్తున్న పోరాటంతో పోలిస్తే మనమెక్కడున్నాం..? జాతిని రక్షించుకునే ఓరకమైన కసి ఉందా మనలో..?
మొన్న హెజ్‌బొల్లా అధినేత మరణానికి సంతాపంగా ముఫ్తి మెహబూబా ఓరోజు ప్రచారాన్ని మానేసింది… ఇదుగో ఇలాంటోళ్లను మన దేశం మోస్తోంది… ఇదే బీజేపీ ఆమెతో పొత్తు పెట్టుకుని పెత్తనాలు చేసింది… మనం పార్టీల కోణంలోనే చూస్తాం అన్నీ… దిక్కుమాలినతనంతో మన జాతికి మనమే సమాధులు కట్టుకుంటున్నాం…
https://x.com/ANI/status/1840276709423104211?t=FURL8uGBU8BQEKYlUbBrfw&s=08
హర్యానా కాంగ్రెస్ మీటింగుల్లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు వినిపిస్తున్నాయి… కాంగ్రెస్ కిక్కుమనదు, అంటే సరేనని ఆమోదిస్తున్నదా..? హెబ్‌బుల్లా చీఫ్ హత్యకు నిరసనగా కాశ్మీర్‌లో ఊరేగింపులు సాగుతున్నాయి… ఇంకోవైపు అమిత్ షా ఉగ్రవాదం ఖతమైపోయిందని ప్రచారసభల్లో గొప్పలు చెప్పుకుంటున్నాడు…
ఆర్టికల్ 370 ఎత్తివేత వంటి ఒకటీ అరా నిర్ణయాలతో బీజేపీ కాస్త బెటర్… కాంగ్రెస్ దాన్ని పునరుద్ధరిస్తుందట… ఉగ్రవాదానికి ఇందిరను, రాజీవ్‌ను పోగొట్టుకున్నా సరే, రాహుల్ మారడు, కాంగ్రెస్ మారదు… రోహింగ్యాలు, వలస బంగ్లాదేశీయులకు రెడ్ కార్పెట్ పరిచే మమత మరో డేంజర్ మన జాతికి… అవును, మన జాతికి ఉగ్రవాదం కాదు… అసలు సిసలు ముప్పు మన రాజకీయ పార్టీల భావజాలాలు… ఉగ్రవాదాలకు దాస్యం చేసే సైద్ధాంతిక దివాలాకోరుతనం…
(ఈ కథనానికి ముఖచిత్రంగా వాడిన ఫోటో చూశారు కదా… హెజ్‌బుల్లా అధినేతను చంపినప్పుడు తను దాక్కున్న పాతాళభవనాన్ని ఇజ్రాయిల్ ఎలా బాంబులతో నేలమట్టం చేసిందో చూడొచ్చు…)
Share this Article