Iam mega chief… I am mega chief… వీటిల్లో ఏది కరెక్టు… ఇంగ్లిషు తెలిసినవాళ్లకు I am mega chief అనే వాక్యమే కరెక్టు అని తెలుస్తుంది… I లెటర్ తరువాత am ఉంటుంది… కానీ ఇంగ్లిషు మీద గ్రిప్ లేనివాళ్లకు రెండూ ఒకలాగే అనిపిస్తాయి… ఎలా రాసినా సరే, అర్థమేమీ మారదు, భిన్నమైన అర్థం కూడా రాదు… I కేపిటల్ లెటర్…
అలాగే చాలామంది chief పదం స్పెల్లింగు కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు, cheif అని రాసేస్తుంటారు… ఇదంతా ఎందుకంటే..? బిగ్‌బాస్‌లో ఓ టాస్క్… హౌజుకు పెబ్బను (లీడర్) సెలెక్ట్ చేయడానికి ఇద్దరి నడుమ పోటీ… అక్కడక్కడా ఉండే ఈ పదాల బాక్సులను తీసుకొచ్చి, ఎవరైతే వేగంగా ఓ అర్థమొచ్చే ఫార్మాట్‌లో అమరుస్తారో వాళ్లు గెలిచినట్టు…
Ads
పృథ్వి అనే కంటెస్టెంట్ నబీల్ అనే కంటెస్టెంట్‌కన్నా వేగంగా ఆ బాక్సుల్ని పట్టుకొచ్చి పై నుంచి కిందకు వరుసగా Iam mega chief అని అమర్చాడు… I తరువాత స్పేస్ లేదు… తనను సపోర్ట్ చేసేవాళ్లు కూడా అలా స్పేస్ లేకపోవడం తప్పు అని తనకు చెప్పలేదు, వాళ్లకూ తెలియదు… చాలా లేటుగా నబీల్ వాటిని తీసుకొచ్చి I am mega chief అని అమర్చాడు… జడ్జిగా వ్యవహరించిన ఓ అమ్మాయి పృథ్వి వేగాన్ని కౌంట్ చేయకుండా, నబీల్‌ను హౌజ్ మెగా చీఫ్‌గా ప్రకటించింది…
అవునూ, ఇది ఇంగ్లిషు గ్రామర్‌కు పరీక్షా..? కంటెస్టెంట్ వేగానికి పరీక్షా..? ఆ అమ్మాయికి గ్రామర్ తెలుసు కాబట్టి పృథ్వి చేసింది తప్పు అనేసింది… మరి అదే ప్లేసులో మిడిమిడి ఆంగ్లం తెలిసినవాళ్లు ఉండి ఉంటే, ఖచ్చితంగా పృథ్వి స్పీడ్‌కే విలువ ఇచ్చి, తనను విజేతగా ప్రకటించేవాళ్లు… బిగ్‌బాస్ కూడా ఆ అమ్మాయి తీర్పునే యాక్సెప్ట్ చేశాడు, రేపు వీకెండ్‌లో నాగార్జున వచ్చి చప్పట్లు కొడతాడు… ఆ సమయంలో జడ్జిగా వ్యవహరించే వ్యక్తుల విచక్షణే ఫైనల్…
సరే, హౌజు నుంచి ఆదిత్య ఓం వెళ్లిపోయాడు… మిడ్ వీక్ ఎలిమినేషన్ అని ముందే ప్రకటించారు కదా… వోటింగులో అందరికన్నా దిగువన ఉన్నందున తనను పంపించేశాడు… కానీ స్ట్రెయిట్‌గా చెప్పేసి, పంపిస్తే సరిపోయేది కదా… ముగ్గురిని నిలబెట్టి, గేటు వైపు అడుగులు వేయిస్తూ, ఎవరు వెళ్లిపోతారే, ఎందుకు వెళ్లిపోతారో చెప్పాలని ఇతర హౌజ్ మేట్లను ఆదేశించాడు… పుల్లలు పెట్టడం, ఎగదోయడం…
నిజానికి ఆదిత్య ఓం కూల్… బ్యాలెన్స్‌డ్… మిగతా కంటెస్టెంట్లకన్నా ఏజ్ ఎక్కువ… ఐనా టాస్కుల్లో బాగానే ఉండేవాడు… ఐనా అలాంటోళ్లు బిగ్‌బాస్ హౌజుకు అక్కరకు రారు కదా…! పిచ్చి చేష్టలు, తిక్క మాటల వ్యక్తులకే వాల్యూ ఎక్కువ అక్కడ… వాళ్లనే పదే పదే తెరపై చూపిస్తాడు… అలా ఆదిత్య ఓంకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరకలేదు… ఫలితంగా జనానికి ఎక్కలేదు… అదీ కారణం…
ఇక వీకెండ్‌లో నైనిక అనే కంటెస్టెంటుకు శుభం కార్డు చూపిస్తారు… దాంతో 8 మంది మిగులుతారు, ఇక కొత్తగా వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌజ్ కిటకిట… వాళ్లందరూ కొత్తగా వచ్చే పాతవాళ్లు… ఇప్పుడున్న వాళ్లు ఈ సీజన్‌కు పాతవాళ్లు… అంటే ఒకరకంగా పాతవాళ్లు వర్సెస్ పాతవాళ్లు… ఇదో తమాషా పోటీ… ప్చ్, సోనియాకు రీఎంట్రీ… శోభాశెట్టికి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరికితే ఆట మరింత రక్తికడుతుంది… ఆలోచించు బిగ్‌బాస్…!
Share this Article