Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవినాష్ హౌజు వదిలి వెళ్లింది నిజమే… కానీ మళ్లీ వచ్చేశాడు…

October 28, 2024 by M S R

ఏదో అయిపోతోంది… కాదు, అయిపోయింది… అవినాష్‌కు తీవ్ర అస్వస్థత… హౌజుకు అందుబాటులోకి ఉండే డాక్టర్లకూ చికిత్స వల్లకాలేదు… దాంతో బయటికి పంపించేశారు…

నేను పోతున్నా, మళ్లీ రాకపోవచ్చు… అందరూ సేఫ్‌గా ఉండండి, బై బై అని అవినాష్ బాగా ఎమోషనల్‌గా చివరి వాక్యాలు చెప్పి ఇక ఎలిమినేట్ అయిపోయాడు…… ఇవీ నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో తెగ విహారం చేసిన వార్తలు…

నిజమేనా..? పొద్దున్నే లైవ్ స్టార్ట్ చేస్తే… అందరితోపాటు గెంతులు వేస్తూ కనిపించాడు… సాయంత్రం తీవ్ర కడుపునొప్పితో విలవిల్లాడిపోయి, నేరుగా ఎవిక్ట్ అయిపోయి హాస్పిటల్‌కు వెళ్లినవాడు పొద్దున్నే ఈ గెంతులేమిటీ అంటారా..?

Ads

సింపుల్… తనకు కడుపు నొప్పి… వీకెండ్ షోల షూటింగ్ అయిపోగానే స్టార్టయింది… తగ్గలేదు… దాంతో పరీక్షలు చేయిద్దామని బయటికి తీసుకెళ్లింది బిగ్‌బాస్ టీం… తీరా డాక్టర్లు ఇది అజీర్ణం తప్ప మరో ప్రాబ్లం లేదు అని తేల్చేసి, మందులిచ్చి మళ్లీ హౌజులోకి వెళ్లండి అన్నారు… అలా వచ్చి బెడ్ మీద పడ్డాడు… తెల్లారి లేచేసరికి నో నొప్పి, నో ప్రాబ్లం… గాయబ్… అదీ సంగతి…

నిన్న మెయిన్ గేటు తీసుకుని వెళ్తుంటే, కంటెస్టెంట్లు ఎమోషనల్ అయిపోయి, కొందరు కన్నీళ్లు పెట్టుకుని కొంతసేపు అదిక భారమైన సీన్ కనిపించింది… వైద్యపరీక్షలకు వెళ్తున్నవాడు ఇక నేను రాను, సెలవు అని చివరి మాటలెందుకో మరి… అంతే కదా, అవినాష్ అంటేనే ఓవరాక్షన్ కదా…

గంగవ్వతో దెయ్యం పట్టినట్టు ప్రాంక్ చేయించాడు కదా… ఇప్పుడూ అలాగే బయటికి వెళ్లిపోతున్నట్టుగా మరో ప్రాంక్ చేస్తున్నాడని రాసిన సైట్లు, చానెళ్లు కూడా ఉన్నాయి… గంగవ్వ ఎపిసోడ్ సమయంలో ఇదంతా ప్రాంక్ అని ఇట్టే గమనించి ఏమీ పట్టించుకోక ఎంచక్కా నిద్రపోయారు కదా పృథ్వి, నిఖిల్… ఇప్పుడూ అంతే…

నిజానికి అవినాష్ వచ్చాకే హౌజులో సందడి పెరిగింది… తోడుగా రోహిణి ఉండనే ఉంది… ఇద్దరూ హౌజు నిస్సారమైన వాతావరణంలో కాస్త జోష్, కాస్త ఫన్ నింపే ప్రయత్నం చేస్తున్నారు… ఎటొచ్చీ హరితేజ నిరాశపరుస్తోంది…

నిన్న ఒకటి ఇంట్రస్టింగు… యష్మి గౌతమ్‌తో నేరుగా చెప్పింది, నీమీద నాకెలాంటి ఫీలింగ్సూ లేవు అని… బ్రేకప్… కాదు, గౌతమే భ్రమపడ్డాడు, పొరబడ్డాడు, యష్మితో రిలేషన్ కోరుకున్నాడు… ఆమె అసలే యష్మి… నిఖిల్‌తో జతకట్టే ప్రయత్నం… తను కూడా బయట కావ్యను వదిలేశాడు కదా… యష్మికి ఏదో ఆశ… హౌజు కోసం ఆటో, నాటకమో, నిజంగానే ప్రేమో తెలియదు గానీ…

నిఖిల్ మహా ముదురు, టైమ్ బీయింగ్ నటన, ప్లాన్ తన సొంతం… సో, యష్మితో లవ్ స్టోరీని ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి… మరోవైపు పృథ్వి, విష్ణుప్రియ ప్రణయగాథ నడుస్తూనే ఉంది… కష్టమ్మీద 8 వారాల తరువాత గానీ రెండు లవ్ స్టోరీలను మొదలుపెట్టించలేకపోయాడు బిగ్‌బాస్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions