Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆపండీ… ఓ అరుపు…! ఆగుతుంది… పెళ్లి కాదు… చిరంజీవి ఉరి..!!

November 13, 2024 by M S R

.

హీరో పాత్ర పేరు సత్యం . అడేవన్నీ అబధ్ధాలే . ప్రతి అబధ్ధం దేవుడి మీద ప్రమాణం చేసి చెపుతాడు చాలామంది రాజకీయ నాయకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్లు . అసలీ సినిమాకు పెట్టవలసిన అసలుసిసలైన పేరు అబధ్ధాలకోరు లేదా అబధ్ధాలరాయుడు .

కానీ వంద రోజులు ఆడిన సక్సెస్ సినిమాకు ఆ కోతలరాయుడు పేరు సూటబుల్ కాదని ఎలా అంటాం . జనం ఏది రైటంటే అదే రైట్ . హీరోగా నిలదొక్కుకోవటానికి కష్టపడుతున్న రోజుల్లో వచ్చిన సినిమా . యూత్ కి చిరంజీవిని బాగా కనెక్ట్ చేసిన ఎర్లీ సినిమాలలో ఇదొకటి . డాన్సుల్ని ఇరగతీసాడు .

Ads

బయట జల్సాబాబు , ఇంట్లో అందరికీ గారాల బాబు , అందరికీ మాయమాటలు చెపుతూ పబ్బం గడుపుకుంటూ ఉంటాడు . ఆ క్రమంలో హీరోయిన్ని కూడా వంచించుతాడు . హీరోయిన్ గర్భవతి అవుతుంది . తండ్రి పరువు కోసం కావాలని చేయని హత్య కేసులో ఇరుక్కుని ఉరిశిక్ష వేయించుకుంటాడు .

ఆఖరి క్షణంలో స్టాప్ అనే సినిమా కేకతో ఉరిశిక్ష ఆగిపోయి జన జీవన స్రవంతిలోకి వస్తాడు . చిరంజీవి ఇలా ఆఖరి క్షణంలో ఉరికంబం నుండి స్టాప్ కేకతో రెండు సార్లు బయటపడ్డాడు . ఒకసారి ఈ సినిమాలో మరోసారి అభిలాష సినిమాలో .

తమ్మారెడ్డి నిర్మాతగా వచ్చిన ఈ సినిమాకు దర్శకుడు కె వాసు . డైలాగులను సత్యానంద్ వ్రాసారు . చక్రవర్తి మార్కు పాటలు పడలేదు . అయినా శ్రావ్యంగానే ఉంటాయి . ఎండా వానా పాట చిరంజీవి , మాధవి మీద బాగానే ఉంటుంది . జాలాది వ్రాస్తే బాలసుబ్రమణ్యం , యస్ పి శైలజలు పాడారు . పువ్వులోయ్ పువ్వులు అనే క్లబ్ సాంగ్ చిరంజీవి , మంజుభార్గవి మీద ఉంటుంది . బాలసుబ్రమణ్యం కేకలతో , చిరంజీవి డాన్సుతో కుర్రాళ్ళకి బాగా నచ్చింది . సి నారాయణరెడ్డి వ్రాసారు .

మంజుభార్గవి బాగా నలిగిపోయిన పాట గో గో గో మిస్టర్ గో . ఈ మంజుబార్గవినేనా కె విశ్వనాథ్ శంకరాభరణంలో మనకు చూపింది అని అనిపిస్తుంది . ఈ పాటను చక్రవర్తే వ్రాసారు . నాలుగో పాట కాస్త బయట కూడా హిట్టయింది ఒక నెలవంక చిరు గోరింక బర్త్ డే పాట . చిరంజీవి , బేబీ తులసి మీద బాగుంటుంది . జాలాదే ఈ పాటనూ వ్రాసారు . టైటిల్ సాంగ్ అయిదోది . కోతలరాయుడు అంటూ కేకలతో బాలసుబ్రమణ్యం , ఆయన బృందం పాడారు .

చిరంజీవి , మాధవి , హేమసుందర్ , నిర్మలమ్మ , మంజుభార్గవి , గిరిబాబు , కె విజయ , శైలజ (యస్ పి శైలజ కాదు) , సారధి , కె వి చలం ప్రభృతులు నటించారు . వంద రోజులు ఆడిన ఈ సినిమా చిరంజీవి జైత్రయాత్రలో ఓ మైలురాయి . 1979 సెప్టెంబరులో వచ్చిన ఈ సినిమా ఫుల్ చిరంజీవి సినిమా .

యూట్యూబులో ఉంది . చిరంజీవి అభిమానులు ఎవరయినా చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి . An entertaining movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …… (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Very Toxic – పక్కా విషస్వభావి – Not for Grown-Ups also !!
  • అరుదైన కేరక్టర్… అందరిలా జీవించలేదు… అందరిలా మరణించలేదు…
  • గవర్నర్‌పై ఐదు బుల్లెట్లు… ఆ 21 ఏళ్ల యువతి ఎవరు?
  • అసలే ఖర్చు తడిసిమోపెడు- పైగా ఇన్ని సుమోలు ఎందుకురా బుజ్జా..!
  • SLBC – ప్రకృతి కోపంతో దారిమూస్తే – మరో దారి తవ్వి గెలుస్తున్నాం !!
  • చిరంజీవి గ్లామర్ చీర నుంచి అన్నమయ్య చీర తత్వం దాకా..!
  • సర్.., మీరు ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారు ? స్పెర్మ్ బ్యాంకు !!
  • ఇరుముడి విషాదం! దిల్ రాజు ఎదుట సర్కారు సాగిలబడాలా?
  • ఈ తడారిన శ్వాసల తబలా చప్పుళ్లు ఓసారి వినండర్రా లీడర్లూ..!!
  • Irumudi – రవితేజ ‘ఇరుముడి’పై స్పష్టంగా ఓ మాలీవుడ్ ముద్ర !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions