.
బంగ్లాదేశ్ విషయంలో మోడీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా?
చాలామంది దృష్టిలో ఉదాసీనంగానే కనిపిస్తున్నా వైరి పక్షం వలలో పడకూడదు అనే దూర దృష్టి ఉంది!
భారత్ చుట్టూ ఉన్న దేశాలతో పోలిస్తే జియో పోలిటకల్ స్ట్రాటజీ విషయంలో మన దేశ విదేశాంగ శాఖ ప్రపంచంలోనే అత్యుత్తమ విధానం అమలుపరుస్తున్నది!
Ads
అదెలాగో తెలుకునే ముందు జో బిడెన్ యంత్రాంగం బంగ్లాదేశ్ ద్వారా భారత్ లో ఎలాంటి విధ్వంసం సృష్టించాలనుకుంటుందో తెలుసుకోవడం ముఖ్యం! అయితే విధ్వంసం వ్యూహ రచన ఎలా ఉందో ఇప్పటికే కొంత స్పష్టత వచ్చినా క్రిస్టల్ క్లియర్ పిక్చర్ ఏమిటో తెలియదు, కానీ విధ్వంసమే ధ్యేయంగా పావులు కదుపుతున్నది!
1.గత నెల రోజులుగా బంగ్లాదేశ్ లో భారత్ కి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు కలవరపెడుతున్నాయి అన్నది నిజం!
2.CIA నేరుగా పాకిస్థాన్ తో చేతులు కలపకుండా జార్జ్ సోరోస్ ద్వారా ఫండింగ్ చేయిస్తున్నది. నిజంగా అవి జార్జ్ సోరోస్ డబ్బులా లేక CIA తన ప్రభుత్వానికి లెక్క చెప్పనవసరం లేని అకౌంట్ లో నుండి ఫండింగ్ చేస్తున్నదా అనేది తెలియదు.
3.పాకిస్థాన్ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కానీ ISI ద్వారా పాకిస్థాన్ సైన్యానికి కావలిసినంత డబ్బు అందుతున్నది. ISI బంగ్లాదేశ్ లోని రాడికల్ గ్రూపులకి కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తున్నది.
4.ISI ద్వారా జార్జ్ సోరోస్ తన పని చేసుకుంటూ వస్తున్నాడు. ఇది ఇప్పటికే ఇరాక్, లిబియా, ఉక్రెయిన్, సిరియా దేశాలలో ఏదైతో పధక రచన చేసి విజయం సాధించారో అదే విధంగా మన దేశం మీద అమలు చేస్తున్నారు.
ప్లాన్ ఏమిటి?
5.ముందు బంగ్లాదేశ్ నుండి షేక్ హసీనాని బహిష్కరించడమో లేక నకిలీ అభియోగాలు మోపి ఉరి తీయడమో చేయాలి. షేక్ హసీనా నియంత అని రాడికల్స్ ద్వారా ప్రచారం చేయించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఉన్న షేక్ హసీనా స్వయంగా వెల్లడించిన దాని ప్రకారం తన మీద కుట్ర అనేది 2023 లోనే మొదలయ్యింది అని! సరిగ్గా అదే సమయంలో సిరియా టార్గెట్ గా పధక రచన చేశారు. దృష్టి మరల్చడానికి హమాస్, హెజ్బొల్లాలని వాడుకున్నారు.
6.ఇరాక్, లిబియాలలాగానే బంగ్లాదేశ్‌లో కూడా బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్ విగ్రహాలని, గుర్తులని చెరిపివేశారు రాడికల్స్.
7.గత మూడు నెలలుగా ముజీబుర్ రెహ్మాన్ మనకి స్వాతంత్య్రం తేలేదని, భారత్ మనల్ని పాకిస్థాన్ నుండి విడగొట్టింది అనే ప్రచారం జోరుగా సాగుతున్నది. 2023 లోనే ఇలాంటి ప్రచారం మొదలైనా అది వాట్సాప్ లకే పరిమితం అయ్యింది. ఇప్పుడు బహిరఁగంగానే షేక్ ముజీబుర్ రెహ్మాన్ ని, షేక్ హసీనా ని దేశ ద్రోహులుగా యువతరం మనస్సులో ముద్ర వేసేశారు.
8.బంగ్లాదేశ్ ని ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారుస్తారు అని అక్కడే ఆగిపోతే పొరపాటు! బంగ్లాదేశ్ కి భారత్ మొదటి శత్రువు అని నూరిపోస్తున్నారు.
9.ISI ఇప్పటికే అవసరం అయితే సైనిక సాయం చేస్తాము అని మాట ఇచ్చింది, దానిని రాడికల్స్ బలంగా నమ్ముతున్నారు!
10.టర్కీ నుండి పాకిస్తాన్ బైరాక్టర్ కామీకాజ్ డ్రోన్లు కొన్నది. బంగ్లాదేశ్ కి నమ్మకం కుదరడానికి కొన్ని బైరాక్టర్ డ్రోన్లు ఇచ్చింది ఉచితంగా!
11.రెండు రోజుల క్రితం బాంగ్లాదేశ్ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఒకడు మోడీని, భారత్ సైన్యాన్ని ఉద్దేశిస్తూ నాలుగు గంటల్లో అస్సాం, కలకత్తాలని స్వాధీనం చేసుకుంటాం అని అనడం వెనుక ISI ప్రచారం ఉంది. మోడీ పేరుని చెప్పడం వెనుక వ్యూహం ఉంది.నాలుగు గంటలు కాదు కదా వాళ్ళ బోర్డర్ దాటి నాలుగు అడుగులు ముందుకు రావడానికి నాలుగు రోజులు పడుతుంది.. అంటే యుద్ధ ఖైదీలుగా అన్నమాట!
12.మాతా మానసదేవి ఆలయం పునర్నిర్మాణ పనులని బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ సైనికులు అడ్డుకున్నారు. ఈ ఆలయం భారత బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అస్సాం రాష్ట్రంలోని శ్రీ భూమి జిల్లాలో ఉంది.
13.భారత బంగ్లాదేశ్ లని విడదీస్తూ ఖుషియారా అనే నది ప్రవహిస్తున్నది. నదికి ఇవతల ఒడ్డున ఉన్న గ్రామంలో నది ఒడ్డున మాతా మానసా దేవి ఆలయం ఉంది. గుడికి అవతలి వైపు నది ఒడ్డున్న బంగ్లాదేశ్ జకి అవుట్ పోస్ట్ ఉంది. ఆ అవుట్ పోస్టులో ఉన్న బంగ్లాదేశ్ సైనికులు నది దాటి భారత్ లోకి వచ్చి గుడి పనులని ఆపాలని బెదిరించారు. మా దేశంలోని గుడిని మేము బాగుచేసుకుంటే మీకెందుకు అభ్యంతరం అని గ్రామస్థులు ఎదురు తిరిగారు. మా మత విశ్వాసాలకి విరుద్ధం మీ గుడి అంటూ బంగ్లాదేశ్ సైనికులు వాదించారు!
14.విషయం తెలిసి BSF జవాన్లు అక్కడికి చేరుకొని బంగ్లాదేశ్ సైనికులని వెనక్కి పంపించేశారు.
15. 70 ఏళ్ళ నాటి మాతా మానసా దేవి ఆలయం మరమ్మత్తుల కోసం అస్సామ్ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ మూడు లక్షలు కేటాయించారు. గ్రామస్తులు స్వయంగా పనులు చేస్తున్నారు. BSF జవాన్లు కాపలాగా అక్కడే ఉన్నారు!
16.అస్సామ్ లోని శ్రీభూమి జిల్లాకి 60 KM పొడవునా ఖుషియారా నది ప్రవహిస్తున్నది. అందులో 4 KM వరకూ బంగ్లాదేశ్ తో కంచె కూడా లేదు.
17.బంగాదేశ్ ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలని మార్చివేసి పాకిస్థాన్ నుండి వచ్చే ప్రయాణీకులకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా వీసా ఇస్తున్నది. 2019 లో అప్పటి ప్రధాని షేక్ హసీనా పాకిస్థాన్ పౌరులు బంగ్లాదేశ్ కి రావాలంటే ముందు సెక్యూరిటీ సర్వీసెస్ డివిజన్ (SSD ) నుండి నో అబ్జెక్షన్ సెర్టిఫికెట్ ఇస్తేనే వీసాకి అనుమతి ఇచ్చే విధంగా నిబంధన విధించింది. గత నెలలో ఈ నిబంధనని రద్దు చేసింది ప్రస్తుత ప్రభుత్వం.
18.కరాచీ రేవు నుండి DHAKA పోర్టుకి ఏదన్నా మార్చంట్ షిప్ రావాలన్నా ముందస్తు తనిఖీలు చేసిన తరువాత పోర్టులోకి అనుమతించేవారు. ఇప్పుడు ఎలాంటి తనిఖీలు లేకుండా DHAKA పోర్టుకి రావొచ్చు.
*********
CIA ద్వారా ISI కి అందే నిధులు ఆయుధాల రూపంలో బంగ్లాదేశ్ కి చేరుతున్నాయి. ఇవి ఇప్పటికిప్పుడు జరుగుతున్నవి కావు. కనీసం సంవత్సరం నుండి పకడ్బందీగా జరిగాయి. అంతా సిద్ధం చేసుకుని షేక్ హసీనాని ప్రధాని పీఠం నుండి దించారు. తరువాత ఒక దాని వెనుక జరిగిపోతూ వస్తున్నాయి.
ఆఫ్ఘానిస్తాన్ లో కూడా ముజాహిదీన్లని సృష్టించి CIA నిధులు ఇస్తూ పోయింది ISI కి. 50% నిధులు మాత్రమే ISI ముజాహిదిన్లకి ఇచ్చేది, ఈ విషయం CIA కి తెలుసు కానీ వాళ్ళ లక్ష్యం ఆఫ్గనిస్థాన్ నుండి సోవియట్ సైన్యంని వెనక్కి పంపించడం కాబట్టి ఊరుకున్నారు!
ఇప్పుడు బంగ్లాదేశ్ రూపంలో డాలర్లు, 1971 లో బంగ్లాదేశ్ విమోచనకి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నది పాకిస్థాన్.
బంగ్లాదేశ్ నుండి నేరుగా మోడీ, భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు రావడం వెనుక ఒక వ్యూహం ఉంది.
పాకిస్తాన్ నుండి మిసైల్స్, ఉగ్రవాదులు ఇప్పటికే బంగ్లాదేశ్ కి చేరుకొని ఉండవచ్చు. ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్న బంగ్లాదేశ్ లో ఉన్న ఉగ్రవాదులు గెరిల్లా దాడులకి పాల్పడవచ్చు.
********
మోడీ ముందు దౌత్యపరంగా ఎంత చేయవచ్చో అంతా చేస్తున్నారు! అఫ్కోర్స్! అవేవి పనిచేయకపోవచ్చు!
AIRTEL బంగ్లాదేశ్ లోని సమ్మిత్ కమ్యూనికేషన్స్, ఫైబర్ at హోమ్ ( Summit Communications, Fibre at the Home ) అనే సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈశాన్య రాష్ట్రాలలో ఇంటర్నెట్ సేవలని అందిస్తున్నది.
బంగ్లాదేశ్ లోని అఖోరా బోర్డర్ ద్వారా కేబుల్స్ ఈశాన్య రాష్ట్రాలలోకి వెళ్తున్నాయి.
ఇప్పుడు ఆ అగ్రిమెంట్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలలో హై స్పీడ్ కేబుల్ ఇంటర్నెట్ సేవలకి అంతరాయం కలుగుతుంది.
అయితే ISI ఆలోచనతోనే బంగ్లాదేశ్ అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలనే నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలలో హై స్పీడ్ ఇంటర్నెట్ లేకపోతే గెరిల్లా దాడులు చేయడానికి వీలుగా ఉంటుంది.
********
మొహమ్మద్ యూనస్ చేతిలో ఏమీ లేదు!
మన్మోహన్ సింగ్, జో బిడెన్, మొహమ్మద్ యూనస్ కేవలం తోలు బొమ్మలు డీప్ స్టేట్ చేతిలో!
బంగ్లాదేశ్ లో పాలన నడుస్తున్నది CIA ప్లాన్ ని ISI ద్వారా !
డిసెంబర్ 9 న భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ dhaka వెళ్లి మొహమ్మద్ యూనస్ ని కలిసి బంగ్లాదేశ్ లో మైనారిటిల మీద జరిగిన దాడుల వివరాల లిస్ట్ అందచేశారు!
తరువాత రోజు మొత్తం 78 మందిని అరెస్ట్ చేసి 80 కేసులు రిజిస్టర్ చేశారు.
జస్ట్ ఇది eye వాష్!
*******
కేవలం సైనిక చర్యతో అన్నీ సాధించలేం!
శ్రీలంక, నేపాల్, భూటాన్, పాకిస్థాన్, కెనడా, నెల కిందట చైనాల సంగతి ఏమైందో చూశాం కదా!
అన్ని దేశాలూ దారిలోకి వచ్చేసాయి. కెనడా అయితే తమ దేశంలో జరిగిన హత్యలకి భారత్ తో ఎలాంటి సంబంధం లేదని డష్టిన్ ట్రూడో విలేఖరుల ముందు ప్రకటించాడు!
ఇక మాల్దీవుల అధ్యక్షుడు అయితే భారత్ లో తమ దేశ టూరిజం గురుంచి అడ్వర్టైజ్ మెంట్ చేసుకోవడానికి అనుమతి కోసం ఢిల్లీ వచ్చి అనుమతి తీసుకొని వెళ్ళాడు.
ఇటీవలే టూరిజం వల్ల ఆదాయం సరిపోవట్లేదని మాల్దీవులుకి వచ్చిన యాత్రికుల మీద ఎగ్జిట్ టాక్స్ కింద 250 డాలర్లు చెల్లించాలని నిబంధన విధించింది. అంటే మాల్దీవులు వచ్చిన టూరిస్ట్ వీసా ఫీజుతో పాటు ఆ దేశం నుండి వెళ్ళిపోవాలి అంటే 250 డాలర్లు కట్టాలి!
ఇక టర్కీ కూడా దారిలోకి వచ్చేసింది. బ్రిక్స్ లో సభ్యత్వం కోసం అప్లై చేస్తే మనదేశం వీటో చేసింది. దాంతో పాకిస్థాన్ ని పక్కన పెట్టేసి కాశ్మీర్ వివాదం భారత్ పాకిస్తాన్ ల మధ్య ఉన్నది, దాని మీద టర్కీకి ఎలాంటి అభిప్రాయం లేదని ఎర్డోగాన్ మాట మార్చాడు!
వాట్ నెక్స్ట్?
జస్ట్ బంగ్లాదేశ్! రోజులు గడిచే కొద్దీ ఆర్ధిక ఇబ్బందులు, విద్యుత్ కోతలు, ఆహార సంక్షోభం, బాంకుల దివాలాలు చాలు తోక ముడిచి అడుక్కోవడానికి! ఇవన్నీ ట్రంప్ అధికారంలో లేకపోయినా జరిగినవే! జస్ట్! వెయిట్ అండ్ సి!………. ( రచయిత :: పొట్లూరి పార్థసారథి )
Share this Article