Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాఘవేంద్రరావు సినిమా అంటేనే మసాలాలూ, ఫలపుష్పాలూ..!!

December 28, 2024 by M S R

.

.    ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) ..        …. రాఘవేంద్రరావు మార్క్ మసాలా సినిమా ఇది… ఘరానా దొంగ… రాఘవేంద్రరావు సినిమా అంటే పాటలు , డాన్సులు , ఫలాలు , పుష్పాలు పుష్కలంగా ఉంటాయి కదా ! అవన్నీ ఉన్నాయి .

కృష్ణ-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 8+1 సినిమాలలో ఒకటి తప్ప అన్నీ హిట్లే . కొన్ని సూపర్ హిట్లు . ఇక్కడ 8+1 లో ఆ ఒకటి కృష్ణ అతిధి పాత్రలో కనిపించే మహేష్ బాబు సినిమా . 1980 మార్చి 29 న విడుదల అయిన ఈ ఘరానాదొంగ సినిమాలో కృష్ణ చలాకీగా , హుషారుగా , ఎనర్జిటిక్ గా నటించారు .

Ads

ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ అవటానికి కారణం అయింది . మించి అతిలోకసుందరి ఉండనే ఉంది . సినిమా రివెంజ్ కధే అయినా రొటీనుగా ఉండదు . కధలో కాస్త కొత్తదనం ఉంది . టార్జాన్ సినిమాల్లోలాగా హీరోకి ఓ గుర్రం ఉంది .

కొన్ని సాహసాలు ఆ గుర్రం కూడా చేస్తుంటుంది . చోర వృత్తిలో ఉన్న హీరో మంచివాడయి , బేంకు లాకర్లకు సేఫ్ గా ఉండే తాళం ప్లానుని తయారు చేస్తాడు . విలన్లు దానిని దొంగలించే ప్లాన్ని భంగం చేసి , తన తల్లి శీలం మీద పడ్డ మచ్చను తొలగించి , హీరోయిన్ అతిలోకసుందరిని పెళ్లి చేసుకోవటంతో సినిమా ముగుస్తుంది . టూకీగా ఇదీ స్టోరీ .

స్టోరీలన్నీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి . వాటిని చెప్పే తీరు , మాటలు, పాటలు, డాన్సులు కధను బోర్ కొట్టించకుండా నడిపించటం , చక్కగా చిత్రీకరించటం ముఖ్యం . సత్యానంద్- జంధ్యాల జంట కధను నేస్తే , డైలాగులను జంధ్యాల ఒక్కరే వ్రాసారు పదునుగా .

చక్రవర్తి కాసేపు కనిపించే ఓ చిన్న పాత్రలో నటించటమే కాకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగించే పాటల్ని కూడా అందించారు . అందులో వేటూరి వారి పాటలు . ఓ వాన పాట కూడా ఉందండోయ్ . వాన విడిచిన వేళ , రొట్టె విరిగి నేతిలో పడ్డాక , పంపరపనస పండురో , ఓ ముద్దు కృష్ణా , ధిమికిట ధిమికిట , చిటికెల మెటికల మేళాలంట పాటలు హుషారుగా , శ్రావ్యంగా ఉడటమే కాకుండా హిట్టయ్యాయి కూడా .

రావు గోపాలరావు , మోహన్ బాబు , గుమ్మడి , అల్లు రామలింగయ్య , గీత , లక్ష్మీకాంత్ , ముక్కామల , హేమసుందర్ , పుష్పలత , మమత , సారధి , మాడా ప్రభృతులు నటించారు . ఓ బెంగాలీ సినిమాకు రీమేక్ అయిన ఈ ఘరానాదొంగ సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి .

కృష్ణ , అతిలోకసుందరి అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే చూడవచ్చు . An entertaining , musical , feel good movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భేష్ నూకరాజు- వర్ష… ఆ స్కిట్‌తో కంటతడి పెట్టించారు…
  • ఎవరి సినిమాల్ని వాళ్లే చూసుకుంటున్నారు… ఒకటీఅరా మినహా…
  • రాఖీ- రక్తబంధం పట్ల తిరస్కృతి…! కేటీయార్, కేసీయార్‌‌కు బాగా మైనస్..!!
  • ఒరేయ్ మణీ… పెన్నులో శాయి ఐపాయె, నాలుగు చుక్కలు పోయరా…
  • మాస్ మసాలా దట్టించి వదిలారు… దెబ్బకు బాలయ్య సూపర్ బ్లాక్ బస్టర్…
  • ఏదో ప్రైవేటు సినిమా దందాకు… ప్రజలకెందుకు అవస్థలు నాయకా..?!
  • చంద్రబాబు పీ-4 అబ్రకదబ్ర పథకం బట్టలిప్పేసిన ఆంధ్రజ్యోతి…!!
  • మాతృ భాషపై తమిళుల తాదాత్మ్యం ముందు మనం నిలువలేము
  • ఛేంజ్… ఛేంజ్… ప్రపంచం మారిపోతోంది… పట్టలేనంత వేగంగా…
  • మేల్ సావిత్రి..! అప్పటి హీరోయిన్ల కలల ప్రేమికుడు… చివరకు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions