.
పేరుకు ముందు హిజ్ ఎక్సలెన్సీ అని రాసుకునే వీకే నరేష్ అనగా విజయకృష్ణా నరేష్ అనగా సీనియర్ నరేష్ మాటలు అప్పుడప్పుడూ ‘చాలా అతి’ అనిపిస్తాయి, చిరాకెత్తిస్తాయి గానీ…
ఒక ఆర్టిస్టుగా తను కొన్నేళ్లుగా బాగానే మెప్పిస్తున్నాడు… భిన్నమైన వేషాల్లోకి దూరిపోతున్నాడు… ప్రస్తుతం చేతిలో 9 సినిమాలు ఉన్నాయట, అందులో రెండు మెయిన్ లీడ్స్ అట… గుడ్…
Ads
ఇప్పుడు సోషల్ మీడియాలో కుంభమేళా పూసలమ్మాయే కాదు, నరేష్ సహచరి పవిత్రాలోకేష్ ఎక్కడో చేసిన ఓ వ్యాఖ్య కూడా బాగా చర్చనీయాంశం… ఈమె కన్నడ నటి… నరేష్ మూడోభార్యతో గొడవలు ఇంకా కొలిక్కి రానట్టున్నాయి, ఈమె నాలుగో సహచరి… ఆమెకు సెకండ్ కావచ్చు బహుశా…
నిన్నో మొన్నో ఓచోట ఆమె మాట్లాడుతూ… ‘పది మందితో సమానమైన ఎనర్జీ ఆయనది, ఎవరూ తట్టుకోలేరు, రాత్రయ్యాక ఇక నావల్ల కాదు అనేస్తాను’ అని చెప్పుకొచ్చింది… ఇంకేముంది..?
ఆమె ప్రసంగంలో వెనకా ముందూ కట్ చేసిపారేసి, ఈ వాక్యాలనే ఫుల్ వైరల్ చేసేశారు… కామెంట్లలో కూడా ఒక్కొక్కరూ రెచ్చిపోయారు… నరేష్ సంభోగసామర్థ్యానికి ఆ మాటల్ని ముడిపెట్టి రచ్చ రచ్చ… వెకిలి కామెంట్స్…
మన సినిమాల్లోకి, మన టీవీ సీరియళ్లలోకి, మన టీవీ షోలలోకి కన్నడ నటీనటులు దూసుకొస్తున్నారు… తప్పులేదు, వాళ్లకు ఆ మెరిట్ ఉంది, కష్టపడుతున్నారు, మనవాళ్లూ ఆదరిస్తున్నారు… ప్రత్యేకించి టీవీల్లో కన్నడ ఆర్టిస్టుల ముద్ర మరీ ఎక్కువ…
వారిలో చాలామంది తెలుగు స్ట్రెయిట్ ఆర్టిస్టుల్లాగే మాట్లాడతారు… తేడా తెలియనంతగా భాష నేర్చేసుకుని పర్‌ఫామ్ చేస్తున్నారు… కాకపోతే కొందరు ఇంకా తడబడుతుంటారు, తెలుగులో మాట్లాడటానికి షోలలో కూడా ట్రై చేస్తూ ప్రయాసపడుతుంటారు… ఉచ్చారణతో మాటలు అటూఇటూ మారిపోతే వాటిల్లో బూతులు వెతుక్కుని సోషల్ మీడియా ఆనందపడుతుంది…
సౌమ్య అనే టీవీ యాంకర్‌ను ఇలాగే వచ్చీరాని తెలుగు మాట్లాడుతుంటే… టీవీ షోలలోనే ఆమెను వెక్కిరిస్తూ, ఆమె మాటల్లో బూతులు వెతుకుతూ… చివరకు ఈటీవీ వంటివి కూడా దరిద్రపు ప్రసారాలు చేసింది… హైపర్ ఆది వంటి ఆర్టిస్టులు కూడా…! (చాన్నాళ్లుగా ఈటీవీ యాంకర్ రష్మి కూడా ఈ వెక్కిరింపులు బాధితురాలే…)
పవిత్రా లోకేష్ మాటలు కూడా అలాంటివే… నరేష్ చాలా కష్టపడతాడు, పది మందితో సమానమైన ఎనర్జీ తనది… తనతో సమానంగా పనిచేయాలంటే మనం తట్టుకోలేం, నేను కూడా రాత్రయ్యేసరికి పనిచేయలేక ఇక మీరే చేసుకొండి అనేస్తాను అనేది పవిత్ర చెప్పదలుచుకున్నది, ఆ వీడియో చూస్తే మనకు అర్థమయ్యేది… ఐనా ఆమె అలాంటి వ్యాఖ్యల్ని పది మంది ఎదుటా ఎందుకు చేస్తుంది..?!
కానీ వ్యాఖ్యలు..? ఆ ఎనర్జీతోనే నాలుగు పెళ్లిళ్లు, ఇంకెన్నో… వయాగ్రాకు బ్రాండ్ అంబాసిడర్… సూపర్ మ్యాన్… అంత పోటుగాడా… 65 ఏళ్ల ముసలోడే గానీ మగానుభవావుడు… ఇలాంటి అనేక కామెంట్లు… అసలే నరేష్ మూడో పెళ్లాం చేసిన రచ్చ సమయంలో వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయారు… కొన్నాళ్లు సద్దుమణిగింది… ఇదుగో మళ్లీ దొరికారు..!
Share this Article