.
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి మనస్తత్వం, రీసెంటుగా తను వైసీపీని ఉద్దేశించి వెటకారంగా… లైలా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడిన మాటలు, ప్రతిగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ పెద్ద ఎత్తున ఆ సినిమాకు వ్యతిరేక ప్రచారం చేపట్టిన వివాదం తెలిసిందే కదా… 150 మేకలు చివరకు 11 మిగిలాయి అనే తన వ్యాఖ్య ఖచ్చితంగా వైసీపీ ఓటమిపై సెటైర్…
పైగా తను కావాలనే, ఉద్దేశపూర్వకంగానే ఆ కామెంట్స్ చేశాడు, తను ఇప్పుడు జనసేనలో ఉన్నాడేమో బహుశా… వైసీపీ మీద మండిపోతున్నాడు… అసలే… సరే… తన వ్యాఖ్యలతో మండిపోతున్న వైసీపీ బ్యాచ్ కాస్త తమ ప్రతాపం చూపించాలని డిసైడ్ అయిపోయారు… #BoycottLaila పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు…
Ads
ఓర్నాయనో, ఆ కూత పృథ్విది ఏం పోయింది..? పోయి పోయి ఇదంతా నా సినిమా కొంప ముంచేట్టుగా ఉందనుకుని వెంటనే ఆ సినిమా హీరో విష్వక్సేన్ సారీ చెప్పాడు… ఆ మాటలతో నాకు సంబంధం లేకపోయినా సరే, సారీ చెబుతున్నాను, దయచేసి నా సినిమాను చంపకండి అని మొరపెట్టుకున్నాడు… సేమ్, ఆ సినిమా నిర్మాత కూడా… తప్పదు కదా… ఆ సమయంలో మేం అక్కడ లేం, లేకపోతే మైక్ లాక్కునేవాళ్లం అంటున్నారు వాళ్లిద్దరూ…
వాళ్లిద్దరికీ సంబంధం లేకపోయినా సారీ చెబుతున్నారు అంటే… ఆ సమయానికి అక్కడే ఉంటే మైక్ లాక్కునేవాళ్లం అంటున్నారు అంటే… పృథ్వి మాటలు తప్పు అని అంగీకరిస్తున్నట్టే కదా… ఈ దశలో అందరూ ఏమనుకున్నారు అంటే… అదే పృథ్వితో సారీ చెప్పిస్తారు అని… కానీ, అలా చేస్తే తన పేరు పృథ్వి ఎందుకు అవుతుంది..?
మంటల్లో మరింత పెట్రోల్ పోశాడు ఇప్పుడు… వైసీపీ బ్యాచ్‌ను ఏం పీక్కుంటారో పీక్కొండి అని సవాల్ విసిరాడు పరోక్షంగా… తన ఆడియో స్పందన ఏమిటంటే..?
‘‘వైసీపీ వాళ్లను టార్గెట్ చేస్తూ ఏమీ మాట్లాడలేదు… అసలు ఆ అవసరమే లేదు… అది వేదిక కూడా కాదు, పొలిటికల్ వేదికలుంటాయి, వాటిపై మాట్లాడతాం…ఐనా ఆరోజు ఆ వేదిక మీద నేనెవరి పేర్లూ తీసుకోలేదు కదా… మీకెందుకు నొప్పి..? సినిమాను సినిమాగా, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి… ఈమాత్రం దానికి సినిమాను నిషేధిస్తామనడం తప్పు…’’
అంతేకాదు, వాట్సప్ గ్రూపుల్లో మరో వార్త కనిపించింది… ఇలా… ‘‘సినీనటుడు పృథ్విరాజ్‌కు హైబీపీ. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పృథ్విరాజ్‌కు చికిత్స. 2 రోజుల క్రిందట ‘లైలా’ ఫంక్షన్‌లో పృథ్విరాజ్ పొలిటికల్ కామెంట్స్. పొలిటికల్ కామెంట్స్‌తో ట్రోల్ అవుతున్న పృథ్విరాజ్…’’
అంటే… లైలా అనే సినిమా ఏమైపోయినా పర్లేదు, ఈ వైసీపీ వాళ్లకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు, అసలు తన ఆరోగ్యమే బాగా లేదు ప్రస్తుతానికి అని చెప్పడం పృథ్వి చేష్టల సారాంశం… మౌత్ టాక్ బాగుంటే, సినిమా బాగుంటే ఎవరూ దాని విజయాన్ని ఆపలేరనేది కరెక్టే…
కానీ సదరు నిర్మాతల అసలు భయం… హెచ్‌డీ ప్రింట్లు నెట్‌లో ప్రత్యక్షమవుతాయని… పైరసీతో సినిమాల్ని దెబ్బతీయడం రీసెంట్ డేస్‌లో ట్రెండ్ కదా… అవునూ, వైసీపీ బ్యాచ్ ఏం చేయబోతోంది..?!
https://www.facebook.com/share/v/12DxT9cCtTP/?mibextid=oFDknk
Share this Article