.
నాని ఉన్నంతలో కాస్త పద్దతిగా ఉంటాడు అనే పేరుంది కదా… మొత్తం చెడగొట్టుకుంటున్నాడు… నిన్న ప్యారడైజ్ అనే సినిమా తాలూకు గ్లింప్స్ అట రిలీజ్ చేశారు కదా… పరమ చెత్త… అంతేకాదు, ఇంకా అభ్యంతరకర అంశాలూ ఉన్నయ్…
రా లాంగ్వేజ్ అంటూ తెలంగాణ యాసతో డైలాగులు… తెలంగాణ యాస, భాష రా (ముడి) లాంగ్వేజ్, అంటే పచ్చి భాష ఎలా అయ్యిందిరా..? ఎవడురా ఆ కూత కూసింది..? తెలంగాణ యాస రా లాంగ్వేజ్, మీ ఆంధ్రా భాష పాలిష్డ్ లాంగ్వేజా..? శాని, నాజూకు, అత్యాధునిక భాషా..?
Ads
ముందే డిస్‌క్లెయిమర్ అని రాసేస్తే ఇక లంజాకొడుకు కథ వంటి చెత్తా పదాల్ని వాడితే పర్లేదా..? తల్లిని తిట్టడమేందిరా..? ఇది కడుపు మండిన కాకుల కథ, జమానా జమానాలకెళ్లి నడిచే శవాల కథ, అమ్మ రొమ్ములో పాలులేక, రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ అంటూ ఏదేదో చెబుతున్నారు… కాకులు తల్వార్లు పట్టినయ్ అట, నా కొడుకు నాయకుడైన కథ అట…
సరే, అవేం కాకులో, ఆ తల్వార్లు ఏమిటో తరువాత సినిమాలో చూడొచ్చు గానీ… ‘నా కొడుకు’ అనే పదాల్ని ఎప్పుడు, ఎలా వాడతారో తెలియదా..? పైగా శవాలు బదులుగా అదే భాషలో పీనుగలు అని రాయొచ్చు కదా… వోకే, అవి అప్రస్తుతం, వాడి క్రియేటివిటీ వాడిష్టం… కానీ..?
లంజాకొడుకు కథ అని చేతి మీద టాటూ పరమ వెగటుగా ఉంది, చీప్ టేస్ట్… పైగా బ్యాక్ గ్రౌండ్‌లో ఓ లంజాకొడుకు కథ అనిపించడం..! ఇంకా ఈ నిర్వాకానికి తోడు ఈ సినిమాకు దర్శకుడట, శ్రీకాంత్ ఓదెల ఓ ట్వీట్ కొట్టాడు… అదేమిటంటే సంగీత దర్శకుడిని ఉద్దేశించి… ఇలా…
‘‘మా బక్కోడు కూడా రెడీ’’ అట… సరే, ఆ బక్క అనిరుధ్ సంగతి సరే… కానీ బాంచెత్ అనే పదం ఎందుకు వాడినట్టు..? నువ్వు ఓ దర్శకుడివి..? బాంచెత్ అనే పదానికి అర్థం తెలుసా అసలు నీకు..? దీన్ని నాని ఎలా అంగీకరించాడు..? అందుకే అంటున్నా… రేయ్, ఎవుర్రా మీరంతా..?!
అసలు ఈ లంజాకొడుకులు, బాంచెత్ భాష ఏమిటి..? పరమ దరిద్రంగా ఉంది ఈ పోకడ… అసలు చూడబోతే యానిమల్, కేజీఎఫ్, సలార్, పుష్ప అన్నీ కలిపి మిక్సీ చేసి, దంచి ఈ మాస్ పోకడా..? బూతులే మాస్ అనుకోవాలా..? నిజంగా శ్రీకాంత్ ఓదెల తీస్తున్నాడా..? నానియే హఠాత్తుగా యష్, బన్నీ, ప్రభాస్ రేంజుకు పెరిగిపోవాలనీ తనే ఈ ఊరమాస్ వెగటు పోకడతో మెగాఫోన్ పట్టుకున్నాడా..?
ఈ బాంచెత్ అనే పదం ఆ ట్వీట్లో చూడగానే ఓ పాత సంగతి యాదికొచ్చింది… దసరా అని ఓ సినిమా తీశారు కదా… ఈ దర్శకుడే… తాగుడే తెలంగాణ కల్చర్ అన్నట్టుగా ఓ దరిద్రపు ధోరణిని చూపించారు… (నిజానికి ఆ సినిమాలో కీర్తిసురేష్ నటన టాప్ లెవల్… దక్కాల్సినంత పేరు రానట్టు అనిపించింది…)
ఇప్పుడు అదే నాని, అదే శ్రీకాంత్ కలిసి ఈ ప్యారడైజ్ తీస్తున్నారు… గ్లింప్స్ తెలంగాణ యాసలో ఉండి, దసరాలాగే ఇదీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ కావచ్చునేమో… దసరా సినిమాలో ధూంధాం దోస్తాన్ అని ఓ పాట… అందులో ఐదారుసార్లు ఈ బాంచెత్ అనే పదం వినిపిస్తుంది… (రచయిత కాసర్ల శ్యామ్ పాటల్లో బూతులు ఉండవు, బహుశా సంగీత దర్శకుడి పైత్యం అయి ఉంటుంది…)
అదో గొప్ప పదం అనుకుంటున్నాడేమో నాని… ఆమధ్య ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్‌కు గెస్టుగా పోయినప్పుడు… ఎవరో కంటెస్టెంట్ (సాయి వల్లభ..?) ఈ పాట పాడితే మెచ్చుకోవడానికి అక్కడ కూడా నాని ఈ బాంచెత్ అనే పదం వాడాడు… అదేదో అభినందనను చెప్పే పదం అన్నట్టు… చివరకు నానీ, (అజ్ఞానీ అనడం లేదు…) నువ్వు కూడా..! ఛఛ…!!
హిట్-3 అనే సినిమా ఒకటి వస్తుంది కదా తనది… ఆ టీజర్ చూస్తేనే మార్కోస్ తరహాలో విపరీతమైన హింసకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అనిపించింది… బూతులు…
ఫాఫం, నానీ ఏమైంది నీకు..? సరే, ఈ ప్యారడైజ్ సినిమాలో ఎవరో సోనాలి కులకర్ణి అనే సీనియర్ నటి ఉందట, హీరోయిన్ ఉండదట, పాత సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ అట… అన్నీ సరే, కానీ ఎటొచ్చీ ఈ బూతులే సినిమా మీద వ్యతిరేక భావాన్ని కలిగిస్తున్నాయి…!!
Share this Article