.
ఇవే మరి పిచ్చి కూతలు అంటే…? మరీ గల్లీ లెవల్ ఆకు లీడర్‌లా మాట్లాడితే ఎలాగయ్యా స్టాలినూ…
ఇప్పటికిప్పుడు అర్జెంటుగా తమిళ ప్రజలు పిల్లల్ని కనేసి, జనాభాను పెంచేయాలట, లేకపోతే ఎంపీ సీట్లు తగ్గిపోయి ఘోరంగా నష్టపోతారట తమిళ జనం… పెళ్లి కాగానే పిల్లల్ని కనేయడం స్టార్ట్ చేయాలట, లేటు చేస్తే కుదరదట…
Ads
ఈ ఎక్కువ ఎంపీ సీట్లతో ఒరిగేదేమీ ఉండదు… జనం మీద పడి బతకడం తప్ప… ఇప్పుడున్న సంఖ్య అలాగే ఉంచేస్తే ఎవడికీ ఏమీ నష్టం ఉండదు… సరే, మోడీకి కూడా నార్త్ సీట్లు పెరగడమే కావాలి కదా, సౌత్‌లో తన ఆటలు కుదరవు కదా, అందుకని ఎంపీ సీట్లు పెంచాలి, అదీ నార్త్‌లో పెరగాలని అనుకుంటున్నాడనే అనుకుందాం కాసేపు…
కానీ ఎంపీ సీట్ల కోసం పిల్లల్ని కనడం ఏమిటో… స్టాలిన్‌కే తెలియాలి… పుట్టిన పిల్లలకు అందమైన తమిళ పేర్లు పెట్టుకొండి అనే సూచన బాగుంది కానీ… ఇప్పటి ట్రెండ్ DINK… అనగా ఇద్దరి సంపాదన, పిల్లలు వద్దు అనే సూత్రం… అది మరిచిపోయినట్టున్నావ్ స్టాలినూ…
పిల్లల్ని కంటారు సరే, ఎవరు పోషించాలి..? నీ ప్రభుత్వమా..? అంత సీనుందా..? అసలు DINK ట్రెండ్ వచ్చిందే దుర్భరమైన జీవన ప్రమాణాల నుంచి రక్షణ కోసం… ఒక్క పిల్లాడినో, ఒక్క పిల్లనో పోషించడమే తలప్రాణం తోకకు వస్తుంది చాలామందికి… అందుకే పెళ్లిళ్లే వద్దు, చేసుకున్నా పిల్లలు వద్దు అనే ధోరణి…
ఎస్, జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచొద్దు అని డిమాండ్ చెయ్, రీజనబుల్… సౌత్ మొత్తం మద్దతిస్తుంది… లేదా… అన్నింటికన్నా మంచి డిమాండ్ ఏమిటంటే..? హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ప్రమాణాల్ని తీసుకుని, ఈమేరకు సీట్లను ఖరారు చేయాలని చెప్పు… అంటే, జనాభా నియంత్రణ, అక్షరాస్యత, వైద్య సదుపాయాలు, సోషల్ అవేర్‌నెస్, శిశుమరణాలు, ప్రసూతి మరణాలు, రక్తహీనత, పౌష్టిక స్థాయి వంటి చాలా అంశాల్లో ఈ ఇండెక్స్ రూపొందించి, దాని ఆధారంగా సీట్లను ఖరారు చేయాలని చెప్పు…
దాని వల్ల ఏ రాష్ట్రంలో జీవననాణ్యత ప్రమాణాలు బాగుంటే ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం పెరుగుతుంది… అదొక ప్రోత్సాహం కూడా… దీనివల్ల బీమారు రాష్ట్రాలను మీరూ మారండి, లేకపోతే నష్టపోతారు అని హెచ్చరించినట్టూ అవుతుంది… నిజానికి ఎంపీ సీట్లకూ జనాభాకూ ఓ పిచ్చి నిర్హేతుక, అశాస్త్రీయ లంకె…
ఉదాహరణకు… మన మల్కాజిగిరి వోటర్లు 29.5 లక్షలు, ఘజియాబాద్ (యూపీ) 22.6 లక్షలు, బెంగుళూరు నార్త్ 22.3 లక్షలు, ఉన్నావో (యూపీ) 21 లక్షలు, ఢిల్లీ నార్త్ 21 లక్షలు… ఇక కంట్రాస్టు చూద్దాం… లక్షద్వీప్ వోటర్లు జస్ట్ 48 వేలు… 30 లక్షల వోటర్లకు ఒకడే ఎంపీ, 48 వేల వోటర్లకూ ఒకడే ఎంపీ… డామన్ డయ్యూ లక్ష వోట్లు, లడఖ్ 1.6 లక్షలు, దాద్రా నగర్ హవేలి 1.89 లక్షలు, అండమాన్ నికోబార్ 2.58 లక్షలు…
మరి ఇదేం లెక్క..? నిజానికి కావల్సింది హేతుబద్ధమైన డీలిమిటేషన్… అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి, అంటే, అన్ని ప్రాంతాలకూ… కానీ ఓ సరైన, శాస్త్రీయమైన పద్ధతితో… దానికి సరైన ప్రతిపాదనల్ని ముందు పెట్టాలి తప్ప… అర్జెంటుగా పిల్లల్ని కనండి, జనాభా పెంచండి అనే దిక్కుమాలిన మాటలు ఏల స్టాలినూ..?!
ఏ జపాన్ వాడో, ఏ రష్యా వాడో అర్జెంటుగా పిల్లల్ని కనండి మొర్రో అని తమ ప్రజలకు చెప్పుకుంటోంది అంటే, దానికి ఆయా దేశాల జాతుల మనుగడలే ప్రమాదంలో పడుతున్నాయి కాబట్టి, వర్కింగ్ ఫోర్స్ పడిపోతోంది కాబట్టి, చాలా ఇష్యూస్ చుట్టుముడుతున్నాయి కాబట్టి… ఈ ఎంపీ సీట్ల వంటి పిచ్చి లెక్కలు కాదు..! కనీసం మ్యాన్ పవరే వర్తమానంలో అసలైన సంపద అనే కోణంలో మాట్లాడినా కాస్త హేతుబద్ధంగా ఉండేదేమో…
అన్నట్టు…. చివరగా ఓ సూచన… అర్జెంటుగా స్టాలిన్ అనబడే ఆ విదేశీ పేరు మార్చుకుని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చెయి… ఏదైనా అందమైన తమిళ పేరు పెట్టుకుంటే అందరికీ ఆదర్శంగా ఉంటుంది కదా…
Share this Article