.
పతనం ప్రారంభమై… వేగం పుంజుకుని… పాతాళానికి రాకెట్ స్పీడులో కొట్టుకుపోయిన దర్శకుడు ఎవడయ్యా అంటే రామగోపాలవర్మ… సినిమా దర్శకుడిగా, వ్యక్తిగా…
చివరకు టీవీ సెలబ్రిటీ ఆషురెడ్డి కాలి వేళ్లను చీకుతూ కూడా వీడియోలు తీయించుకుని సోషల్ మీడియాలో పెట్టుకునేంత స్థాయికి దిగజారి… పైగా మొన్నెప్పుడో నేను మారతను, నేను పాత వర్మ అనిపించుకుంటాను అని సొల్లు కబుర్లు చెప్పాడు…
Ads
నో, తన అస్సలు మారలేడు… తనలో దర్శకుడు ఏనాడో చచ్చిపోయాడు… అబ్బే, ఈ శ్రమ, ఈ ప్రయాస కూడా ఎవడు పడతాడులే అనుకుని… అత్యంత చీప్ బడ్జెట్‌లో ఓ సినిమా ప్లాన్ చేశాడు… తన శిష్య పరమాణువుల్లో ఒకరికి మెగాఫోన్ అప్పగించాడు…
నిర్మాత తనే కదా… తన టేస్టును బట్టే ఉంటుంది సినిమా… అది ఎలాగూ అత్యంత దరిద్రమైన టేస్టు… ఆ శిష్యుడు కూడా గురువు టేస్టుకు అనుగుణంగానే తీశాడు.,.. ఎస్, ఆషురెడ్డి కాలివేళ్లను చీకినట్టుగానే ఉంది కొత్తగా రిలీజైన శారీ సినిమా.,.
ఎవరో ఆరాధ్య అట… మలయాళీ… ఈ వర్మ ఎక్కడో చూశాడు… మనసు పారేసుకున్నాడు… తీసుకొచ్చాడు… నువ్వే హీరోయిన్ అన్నాడు… రకరకాల చీరెలు కడుతూ… వాటిని చూపించే మిషతో అంగాంగాలను ఎక్స్‌పోజ్ చేసే నీచాభిరుచి… అవునులే, తన పదేళ్ల సినిమాలు అదే తరహా కదా… పొలిటికల్ డిజాస్టర్లు మినహా…
పోనీ, ఆమె ఏమైనా మంచి నటా..? కాదు, వర్మ శిష్యుడు చెప్పినట్టు ఎక్స్‌పోజ్ చేస్తూ పోయింది… చీరకట్టు రీల్స్ చేసేదట… సినిమాలోనూ అదే పాత్ర… నానారకాల చీరకట్లలో ఆమెను చూసి మనసు పారేసుకుని ఓ విలనుడు మాయోపాయంతో ఆమెను ట్రాపులోకి లాగుతాడు… వాడి కామం గమనించి ఆమె దూరం పెడితే ఇక తరువాత ఏమిటనేది కథ…
నాలుగైదు పాత్రలు, అటూఇటూ అక్కడే తిరుగుతూ ఉంటుంది కథ… చూసీ చూసీ ప్రేక్షకుడే అనుకోవాలి, ఈ దరిద్రం ఇక మారదా అని..! అంతే తప్ప వర్మ మారడు… ఇక జన్మలో మారడు… నా బుర్రే పెద్దది, నాకెవడు చెప్పేది అనుకునే భ్రమల్లో బతికేవాడెప్పుడూ మారడు… వాళ్లలో అగ్రగణ్యుడు వర్మ… తనెందుకు మారతాడు..?
విచిత్రంగా తన సినిమాలో పాటలు కూడా పెట్టాడు… అవి మరీ దరిద్రం… పొరపాటున థియేటర్‌కు వెళ్లి ఈ సినిమా చూసి పారిపోయి వచ్చేవాడికి ఒక్క వాక్యం, పల్లవి కూడా గుర్తుకురావు… భలే దొరుకుతారు వర్మకు… తన రేంజ్ నిపుణులు…
అసలు సోషల్ మీడియాతో జాగ్రత్త అనే సందేశం వర్మ ఇవ్వడమే ఓ వింత… అడ్డగోలుగా ఓ సెమీ బూతు చిత్రాన్ని తలపించేలా చిత్రాలు తీయడం, ప్రేక్షకులు బండబూతులు తిట్టుకోవడం అలవాటైంది కదా… ఇదీ ఆ కోవలోకే చీర కట్టుకుని వచ్చింది…!!
Share this Article