.
ఈమె ప్రతి అడుగూ విస్మయమే… తెలంగాణను ఉద్దరించే రాజకీయాన్ని హఠాత్తుగా గంగలో కలిపేసి ఏపీని ఉద్దరించే రాజకీయాల్లోకి అడుగుపెట్టీపెట్టగానే… అతిరథ మహారథుల్ని విస్మరించి ఈమెకు ఎందుకు పట్టం కట్టారో రాహుల్ గాంధీ కూడా ఓ విస్మయమే…
జీరో స్థాయిలో ఉన్న ఏపీ కాంగ్రెస్‌కు ఈమె సారథ్యంలో ఒరిగిందేమిటో కూడా సదరు గాంధీకే తెలియాలి… ఈమె ప్రతి మాటా, ప్రతి అడుగూ ఆశ్చర్యమే…
Ads
ఇప్పుడు నరేంద్ర మోడీకి మట్టిని బహుమతిగా పంపిస్తున్నదట… అదేమిటమ్మా అంటే, పాత హామీలు గుర్తుకురావాలి, నువ్వు అమరావతి ప్రారంభవేళ ఇచ్చిన మట్టే ఇది, అందుకే ఇదే పంపిస్తున్నామంటోంది… దాన్ని బహుమతి అంటారా..? హేమిటో… చిత్రమైన వ్యక్తి…
ఆమె డిమాండ్, మోడీకి లేఖ ఏమిటో తెలుసా..?
ప్రధాని నరేంద్ర మోడీ గారు
@narendramodi
ఈసారైనా అమరావతి కట్టేనా ? లేక మళ్ళీ మట్టేనా ? 10 ఏళ్ల క్రితం మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారు. మన ఆశల మీద నీళ్ళు చల్లి వెళ్ళారు.
ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపనకు వస్తున్న మోడీ గారికి ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నాం. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తు రావాలి. 10 ఏళ్లుగా చేసిన మోసంపై ఆత్మ విమర్శ చేసుకోవాలి.
మోడీ గారు ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి అమరావతిలో అడుగు పెట్టాలి. మరోసారి ఇలాంటి మోసం చేయనని ప్రమాణం చేయాలి. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత. ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తా అని రాసి సంతకం పెట్టాలి. మాకు అప్పులు వద్దు. మా భావితరాల మీద ఆ భారం వద్దు.
రాజధాని నిర్మాణం కోసం బేషరతుగా రూ.1.50 లక్షల కోట్లను 3 ఏళ్లలో కేంద్రం ఇవ్వాలి. ఈ ప్రకటన మోడీ గారు చేయాలి. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలి. అలాగే 10 ఏళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం…
మోడీ మట్టి సాక్షిగా ప్రమాణం చేస్తే తప్ప అమరావతిలో అడుగుపెట్టకూడదట… మళ్లీ మోసం చేయబోనని ప్రమాణం చేయాలట… సంతకాలు చేయాలట… హహహ…
ఏమయ్యా, నువ్వు అమరావతి రాజధానిని ఎందుకు బొందపెట్టావు అని అడగాల్సింది నీ సోదరుడిని కదా… పునఃప్రారంభం అంటూ మళ్లీ వేల ఎకరాల పూలింగ్ చేస్తానంటున్న చంద్రబాబును కదా అడగాలి… తాత్కాలిక కట్టడాలు అయిపోయాయట, ఇక ఇప్పుడు శాశ్వత సచివాలయం, శాశ్వత అసెంబ్లీ అట…
రైల్వే స్టేషన్‌కు, ఎయిర్ పోర్టుకు వేలకువేల ఎకరాలట… పోర్టు సరే, రైల్వే స్టేషన్‌కు కూడా వేల ఎకరాలట… ఇవి అడగాల్సింది ఎవరిని..? మోడీ సంతకం చేయాల్సిన బాండ్ పేపర్ కూడా కాంగ్రెస్ పార్టీయే సమకూర్చి, ఆ పునఃప్రారంభ వేదిక వద్దకు షర్మిలే తీసుకొస్తుందా… ఇంతకీ ప్రమాణం ఎవరు చేయించాలి..?
మూడేళ్లలో లక్షన్నర కోట్లు సరిపోతాయా..? ముందు మీ రాజధాని ఏదో తేల్చుకొండి ఖరారుగా… త్రిరాజధాని ప్రహసనం పూర్తయినట్టేనా..? మీ అన్నగారు మళ్లీ కుర్చీ ఎక్కితే… మళ్లీ రెడ్డొచ్చె మొదలాడు అనే సామెతేనా..?
Share this Article