.
ప్రస్తుతం ఓ మోస్తరు స్కూళ్ల ఫీజులు కూడా ఠారెత్తిస్తున్నాయి… ఇంటర్నేషనల్ స్కూల్ అని పేరు పెట్టుకుని 3 నుంచి 5, 6 లక్షల దాకా వసూలు చేస్తున్నారు… తీరా క్వాలిటీ, బోధన నాసిరకం… ఏదో నడిపిస్తున్నారు… పేరెంట్స్ పర్సులు ఖాళీ చేస్తూ…
నిన్న ఓ వార్త చదివినట్టు గుర్తు, ఓ ఇంజనీరింగ్ కాలేజీ 2.5 లక్షలు ఆల్రెడీ వసూలు చేస్తూ ఇప్పుడు 3.5 లక్షల ఫీజు కోసం ఫీజుల కమిటీకి దరఖాస్తు చేసుకుందట… చైతన్యలు, నారాయణల సంగతి తెలిసిందే… ఆ ఆత్మహత్యలు, ఒత్తిళ్ల వంటి విషాదాలూ వింటున్నవే…
Ads
ఇక రెసిడెన్షియల్ క్యాంపసులు అయితే నరకానికి నకళ్లు… కార్పొరేట్ కాలేజీలు విసిరే బిచ్చపు యాడ్స్ కోసం ఏ మీడియా వాళ్ల మీద నెగెటివ్ స్టోరీలు రాయదు… కనీసం ఇన్నాళ్లకు ఒక్క సినిమా… అదీ అలాంటి యాడ్స్ తీసుకుని రాజీపడే ఈనాడు క్యాంపస్ నుంచి, అంటే ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్ కంటెంటు కోసం విద్యా వ్యవస్థ వైఫల్యాల మీద ఓ సినిమా రావడం మెచ్చుకోవాలి…
మంచి సబ్జెక్టు… అసలు మన బోధన పద్ధతులు ఎలా ఉండాలనే డిబేట్ తీసుకోవడం మంచిదే… కానీ కథను రక్తికట్టేలా ప్రజెంట్ చేయకపోవడంతో సినిమా మొత్తం ఫ్లాటుగా, అనాసక్తంగా సా-గు-తుం-ది… అదొక్కటే సినిమాలో లోపం…
తారే జమీన్ పర్, త్రీ ఇడియట్స్ చూస్తుంటే మన విద్యా వ్యవస్థల మీద మనకే అసహ్యం పుడుతుంది… ఆ కథల ప్రజెంటేషన్ వాల్యూ అది… ఈ అనగనగా సినిమా కూడా సిమిలర్ లైనే… కానీ రొటీన్ చర్చలా ఉంటుంది… జనం బుర్రల్లోకి ఎక్కాలంటే డ్రామా కావాలి…
ఇక్కడ సుమంత్ గురించి చెప్పాలి… అక్కినేని ఫ్యామిలీలో తనది పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ… కీర్తిరెడ్డితో పెళ్లి ఫెయిల్ దగ్గర నుంచి 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా, అంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా… ఈరోజుకూ ఇది నా సినిమా అని కాలరెగరేసే సినిమా లేదు… చాన్నాళ్లుగా అసలు ఏ సినిమా లేదు… ఇప్పుడు ఈ మంచి సబ్జెక్టు తీసుకున్నా, పేలవమైన ప్రజెంటేషన్‌తో దక్కాల్సిన క్రెడిట్ దక్కకుండా పోయింది…
పైగా ఇది స్ట్రెయిట్ థియేటర్ సినిమా కాదు… ఓటీటీ సినిమా… ఇంకాస్త మంచి కసరత్తు సాగించి ఉంటే ఓటీటీ కంటెంట్ అయినా సరే సుమంత్‌కు కాస్త ప్రొఫెషనల్ శాటిస్‌ఫాక్షన్ దొరికి ఉండేది… ఈ కథ కూడా తనకు పెద్ద పరీక్ష పెట్టేదేమీ కాదు, అలవోకగా అలా అలా నటించేశాడు… కాస్త జెర్సీ పోలికలు కూడా ఉన్నాయి సినిమాలో…
హీరోయిన్ కాజల్ చౌదరి మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ తక్కువ… సినిమాలాగే ఫ్లాట్… సుమంత్ కొడుకుగా నటించిన పిల్లాడి పేరేమో గానీ బాగా చేశాడు… (అయ్యా, అనిల్ రావిపూడీ, బుల్లిరాజు వంటి వెగటు కేరక్టర్లు కదా పిల్లలతో చేయించాల్సింది… ఈ సినిమా ఓసారి చూడు బ్రదర్…)
అసలే ఓటీటీ, ఆపై లోబడ్జెట్, సో, దానికి తగినట్టే నిర్మాణ విలువలు కూడా సో సో… కానీ మళ్లీ చెబుతున్నా… ఇలాంటి సబ్జెక్టులు సమాజానికి అవసరం… ఎటొచ్చీ ప్రేక్షకుల బుర్రల్లోకి ఎక్కించేలా తీయబడితేనే సుమా..!!
Share this Article