Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…

June 8, 2025 by M S R

.

మీరెవరూ కమలహాసన్‌కు గానీ… రాజేంద్ర ప్రసాద్‌కు గానీ… దయచేసి ఈ వార్తను చూపించొద్దు… ప్లీజ్… ఎందుకో ఎండింగులో చెబుతాను…

ఒకసారి ఘంటసాల గార్ని ఒకళ్ళు అడిగారట… “ఏ కళాకారులైనా తమ కళని గుర్తించాలని చూస్తారు కదా.. ఒక గాయకుడిగా మీ జీవితంలో మీకు చాలా బాగా నచ్చిన పొగడ్త చెప్పండి…” అని
.
అప్పుడు ఆయన (ఆ రోజుల్లో టీవిలూ అవీ లేవు కనక ఆయన రూపం జనానికి తెలిసే అవకాశం లేదు)… ఆయన చెబుతున్నాడు ఇలా…

Ads



“ఒకసారి నేను ఒక టీ కొట్టు పక్కన టీ తాగుతున్నాను. ‘మహాకవి కాళిదాసు’ సినిమాలోని “మాణిక్యవీణా… అని నా పాట రేడియోలో వస్తోంది. ఆ పాటను.. అక్కడున్న ఒక రిక్షాతను ఎంతగానో లీనమైపోతూ గొంతుకలిపి పాడుతూ, వింటూ పాడుతూ… ఇక ఒక చోటుకొచ్చేసరికి అతను ఆగిపోయి… ఇహ పాడలేక…

“అబ్బబ్బబ్బ ఏం పాడాడ్రా.. ఏం పాడాడ్రా… ఘంటసాల.!
‘నంజకొడుకు’ సంపేసినాడ్రా… సంపేసినాడ్రా నంజకొడుకు నంజకొడుకు… సంపేసినాడ్రా” అంటూ అరిచేశాడట…”



ఆ మాటలు ఆ పక్కనే కూర్చున ఘంటసాల గారు విని నవ్వుతూ ఆయన వంక చూశారట… ఘంటసాల గారు ఈ మాటలు చెప్పగానే అక్కడున్న ఆయన అభిమానులు షాకైపోయి కాసేపాగి తేరుకుని చాలా ఆశ్చర్యంగా…

“అదేమిటీ మాస్టారు, మిమ్మల్ని అన్ని తిట్లు తిడితే మీ అమ్మగారిని కూడా అలా తిట్టేస్తుంటే మీకు కోపం రాలేదా బాధ అనిపించలేదా” అని అడిగారుట.

ghantasala

దానికి ఆయన “హృదయంలోంచి వచ్చే నిజమైన భావావేశం ఏ వస్త్రం ఏ ఆచ్చాదనా లేకుండా చాలా సహజంగా .. నగ్నంగా వుంటుంది. అదే నిజమైన పొగడ్త.. ఆ ఆవేశంలో అక్కడ సంస్కారం ప్రవేశించినప్పుడు అది కొంత కృతకంగా ఆర్టిఫిషియల్ గా తయారౌతుంది.

అతను అసలేమీ ఆలోచించకుండా ఏమీ అనుకోకుండా తన భావావేశాన్ని వ్యక్తం చేశాడు. ఒక కళాకారుడిగా దాన్ని నేను కూడా అర్థం చేసుకోలేకపోతే ఎలా” అన్నారట… అదీ ఘంటసాల గారి రసవంతమైన మనసు…
.
ఈ మాటలు ఒకసారి ఘంటసాల శ్యామల గారు నాతో చెప్తుంటే నా మనసులో ఘంటసాల గారి మీద గౌరవం ఇంకా ఇంకా ఎంతో పెరిగిపోయింది అన్నాట్ట ఎస్పీ బాలు…

ఎదుటివారి ఆవేశాన్ని అర్థం చేసుకుని, మాటల్లోని పైపైన వచ్చే అర్థాన్ని పట్టించుకోకుండా, అంతే సహజంగా మనసునులోని భావాన్ని చూడడం, చూడడం అర్థం చేసుకోవడం ఎంత మందికి వీలౌతుంది.!!

సరే, విషయానికి వద్దాం… ఈ సంగతి రాజేంద్ర ప్రసాద్‌కు చెబితే ఈమధ్య తను కూస్తున్న పిచ్చి కూతలకు భలే సపోర్టింగ్ పాయింట్ దొరికింది అనుకుని మరింత రెచ్చిపోతాడు… తను ఇలా అనే ప్రమాదం కూడా ఉంది…

ఘంటసాల

“హృదయంలోంచి వచ్చే నిజమైన భావావేశం ఏ వస్త్రం ఏ ఆచ్చాదనా లేకుండా చాలా సహజంగా .. నగ్నంగా వుంటుంది. అదే నిజమైన పొగడ్త… ఎస్వీ కృష్ణారెడ్డి, ఆలీ, రోజా, రవళి, డేవిడ్ వార్నర్, మురళీమోహన్… ఎవరైనా సరే, నాకిష్టులు కాబట్టి ఏ అచ్చాదన లేకుండా, బరిబాతల మనసులో నుంచి వచ్చిన మాటల్నే వినిపించాను… ప్రేమ…’’

అవును… కమలహాసన్ కూడా కన్నడ భాష మీద ఇలాంటి సమర్థ వ్యాఖ్యలకు పూనుకోగలడు… సో, ప్లీజ్, ఎవరూ వాళ్లిద్దరికీ ఈ కథనాన్ని చూపించొద్దు… చూపించినవాడిని కూడా ప్రేమతో తిట్టేయగలరు… అవును, ప్రేమతో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
  • పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…
  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions