.
అనేకానేక భారీ తారాగణంతో… వంద కోట్లపైచిలుకు వ్యయంతో… అత్యంత భారీగా నిర్మిస్తున్న సూపర్ పాన్ ఇండియా సినిమా కన్పప్ప… పలు భాషల తారలు… రొమాంటిక్, డర్టీ డ్రెస్సుల డ్యూయెట్స్… అసలు ఇన్ని పాత్రలకు తగినట్టు ఏమైనా కురుక్షేత్రం సినిమా తీస్తున్నారా అనే విమర్శలు… ఏవో పాత్రలు, అసలు కథను దాటేసి ఎంతో దూరం వచ్చేశారు…
సరే, అవన్నీ వదిలేయండి… మోహన్‌బాబు సర్వజ్ఞుడు… మంచు విష్ణు అంతకు ఎక్కువే… రేయ్, పిలక, గిలక పాత్రలు ఏమిట్రా అని బ్రాహ్మణ సంఘాలు కస్సుమన్నా ఎవరూ వినరు… అంతకుముందు జిన్నా పేరుతోనే సినిమా తీసినవాళ్లు… మరేదో సినిమాకు సంబంధించి కూడా బ్రాహ్మణులు శాపనార్థాలు పెట్టారు…
Ads
నో, మంచు కుటుంబం అంటేనే క్రియేటివిటీకి ప్రాణం పెట్టే బాపతు… ఎవరికీ వెరచేది లేదు… ఎవడికీ వినేది కూడా లేదు… సరే, ఇవన్నీ వోకే… కన్నప్పులో శివుడిగా ప్రభాస్ అనుకున్నాను, కాదట కదా… అక్షయ కుమారుడట… హతవిధీ…
ఐనా, ఆ వేషం ఏమైనా సరిగ్గా కుదిరిందా అంటే… దట్టంగా నీలి రంగు పులిమి వదిలారు… శివుడు నీలిరంగులో ఉంటాడా..? అసలు తెలుగు, సౌత్ సినిమాల్లో, చివరకు బాపు సినిమాలో కూడా విష్ణువు, రాముడు, కృష్ణుడు అనగానే బ్లూకలర్ పులిమేస్తారు… ఇదేమిటయ్యా అంటే, నీలి మేఘా శ్యాముడు కదా అంటారు…
నీలి మేఘం అంటూ బ్లూ క్లౌడ్ కాదు కదా… అదొక డార్క్ షేడ్, అంతే… మనిషికైనా, దేవుడికైనా ఈ బ్లూకలర్ పులమడం ఏమిటి అసలు..? మన దర్శకుల మెగా క్రియేటివిటీ ఫ్రీడం అన్నమాట… ఏమో, అజ్ఞానం కూడా కావచ్చు… మనమెంత వాళ్లను అంచనా వేయడానికి..? సర్వజ్ఞులు…
ఏమో మరి… ఒక చాగంటి, ఒక గరికపాటి… కనీసం పొద్దున్నే టీవీ భక్తి ప్రోగ్రాముల్లోకి వచ్చే రంగురంగుల పూసల మహా ఆధ్యాత్మిక జ్ఞానసంపన్నులైనా చెప్పాలి… కానీ చెప్పరు… వాళ్లకు తెలిసి ఏడిస్తేగా.,. నాలుగు పడికట్టు పదాలతో యవ్వారం చక్కబెట్టుకునే బాపతు…
ఎస్, శివుడు నీలకంఠుడు… సాగరమథనంలో పుట్టిన హాలాహలాన్ని తను స్వీకరిస్తే అది గొంతు దాకా వెళ్లి అక్కడే ఆగింది కాబట్టి ఆ వేడికి కంఠం మాడిపోయినట్టు కనిపిస్తుంది కాబట్టి అలా వర్ణిస్తారు.,. అదీ డార్క్ షేడ్ తప్ప బ్లూ కలర్ కాదు సుమీ…
మరి కన్నప్పలో శివుడు మరీ విష్ణువులా నీలకళేబరుడిలా కనిపిస్తున్నాడేమిటి..? మన దిక్కుమాలిన క్రియేటివ్ ఫ్రీడమ్ ఏదైనా చేయగలదు, ఏదైనా చూపగలదు… ఆమధ్య వాడెవడో ఓం రౌత్ అని ఆదిపురుష్ సినిమా తీశాడు కదా… అందులో రాముడికి ఏ కలరూ లేదు, సగటు మనిషి కలర్ తప్ప… కనీసం శివుడిని అలా చూపినా బాగుండేది…
ఆ ముడేసిన జటాజూటం పైన చంద్రుడిని ఇరికించారు సరే… మరి గంగమ్మ ఏది..? గ్రాఫిక్స్‌లో ఫిక్స్ కాలేదా ఫాఫం… కొంపదీసి మంజునాథలో శివ చిరంజీవికి, మీనా గౌరికీ పెట్టినట్టు ఇందులో కూడా ఏ తలతిక్క స్టెప్పుల డ్యూయెట్టూ పెట్టలేదు కదా… దేవుడా… శివశివా… దేవదేవా…! పాహిమాం పాహిమాం… రక్షించు మమ్మల్ని, రక్షించుకో నిన్ను నువ్వు…!!
చివరగా update:: తీరా ఇప్పుడు ఇంకో పోస్టర్… దేవుడా, యాన్నుంచి వచ్చారు స్వామీ వీళ్ళు ..? ఇందులో నో బ్లూ, ఫెయిర్ స్వామి …!!
Share this Article