Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం జగన్… ఈ రఫారఫా నరుకుడు భాషేమిటో, ఈ సమర్థనేమిటో…

June 19, 2025 by M S R

.

ఎవరైనా సరే, అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి… భాష, బాడీ లాంగ్వేజీ, అడుగులు, ఆచరణ హుందాగా… జనం మెచ్చేలా ఉండాలి… కానీ తను జగన్ కదా.,. పూర్తి భిన్నం… అరాచకం, అయోమయం…

ఎవరేమనుకుంటారు అనే సోయి లేదు… అని చెప్పడానికి తెనాలి రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర తాజా ఉదాహరణ… కాగా మరో పర్‌ఫెక్ట్ ఉదాహరణ నిన్న… మస్తు జనం వచ్చారు గుడ్, తనకు ఇప్పటికీ జనంలో ఆదరణ ఉంది, తనపై నమ్మకం ఉంది… కానీ తనే చెడగొట్టుకుంటున్నాడు చేజేతులా…

Ads

అందుకెేనేమో చంద్రబాబు అండ్ కో పదే పదే పులివెందుల బ్యాచ్ రాజకీయాలు అంటూ వెక్కిరిస్తుంటారు, సరే, పులివెందుల అనగానే రౌడీలు అనే అర్థమొచ్చేలా మాట్లాడటం చంద్రబాబు కూటమికి కరెక్టు కాదు, అదీ అమరావతి వేశ్యలు అనే మాటలాగే నీచం…

ఐతే… జగన్ ఏమైనా మారుతున్నాడా..? లేదా..? ఓ ఫ్రస్ట్రేషన్… 11 సీట్ల తాలూకు పరాభవం, పరాజయం మనిషిని నిలువెల్లా ఉడికించేస్తోంది… లేకపోతే అదేమి వ్యాఖ్య… ఎవడో కార్యకర్త రప్పారప్పా నరుకుతాం అని ప్లకార్డు ప్రదర్శిస్తే పోలీసులు కేసు పెట్టారు… సరే, దాన్నెందుకు జగన్ సమర్థించడం, ఏమిటా భాష..? ఏమిటా ధోరణి..? ఇంకా ఆ ధోరణిని రెచ్చగొట్టడమా..? చంద్రబాబుకు అంతకుమించి ఏమీ చేతకాదు అని వెక్కిరించడమేనా..?

jagan

వైసీపీ అధికారంలోకి మళ్లీ వస్తుందా లేదానేది వేరే సంగతి… కానీ వచ్చాక మాత్రం జనసేన, బీజేపీ, టీడీపీ వాళ్లను ఒక్కొక్కడినీ రప్పా రప్పా నరుకుతాం అనే కార్యకర్తల ధోరణిని సమర్థించడం ఎలా సబబు..? ఎలా సమర్థనీయం..? మళ్లీ పైకి అమాయకంగా పుష్ప డైలాగ్ రాసుకొస్తే కేసులు పెడతారా అని… జగన్ అబ్సల్యూట్ బాధ్యతారాహిత్యం ఇది…

ఇదే కాదు… ఇదుగో ఇలా అణిచివేస్తే నక్సలైట్లు పుట్టుకొస్తారు అనే మరో వ్యాఖ్య… ఫక్కున నవ్వొచ్చేది… ఫాఫం, ప్రస్తుతం తనకు ఎవరు రాసిస్తున్నారో ఈ ఫంచ్ డవిలాగులు గానీ… జగన్ నోటి వెంట నక్సలైట్లు పుట్టుకొచ్చే కారణాలు వినడం అనేది వింతగా, హాశ్చర్యంగా, హాస్యాస్పదంగా కూడా ఉంది…

ఓహో, ఈ రఫారఫా నరికే కార్యకర్తల మీద కేసులు పెడితే నక్సలైట్లు పుట్టుకొస్తారా..? జగన్‌ను చూస్తే ప్రస్తుతం జాలేస్తోంది… ఈ మాట అనడానికి సాహసిస్తున్నాను… చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల మీద నాకున్న లక్ష అభ్యంతరాలను దాటేసి..!!

నిజం చెప్పాలంటే… పుట్టెడు కష్టాల్లో ఏటికి ఎదురీదుతున్న ఈ రోజుల్లో నక్సలైట్లను చూసినా జాలేస్తోంది… మరీ జగన్ మార్క్ వ్యాఖ్యానాలు, నిర్వచనాలు, కారణాలు వింటుంటే…!!

జగన్



Mohammed Rafee ..........  మైండ్ సెట్ మార్చండి, మళ్ళీ మీరే ముఖ్యమంత్రి అవుతారు!

ఎవరు సార్, మీకు సలహాలు ఇస్తున్నది? మిమ్మల్ని రాంగ్ రూట్ లో నడిపిస్తున్నది? మీరు ఆలోచించరా? సెల్ఫ్ గోల్స్ రప్ప రప్పా వేసుకుంటున్నారు ఎందుకు?

పర్యటనలకు ఫుల్లుగా జనం వస్తున్నారు! మీ మీద అభిమానం ఉంటుంది! మీ చుట్టూ నేతలు ఉంటారు! మీరంటే చాలా మందికి ఇష్టం! డబ్బులు కసబిసా పంచేసారు! కృతజ్ఞత కూడా ఉంటుంది! ఆ వీధి వాళ్లే కాదు ఆ చుట్టు పక్కల జిల్లా వాళ్ళు వస్తున్నారు! అంతా బావుంది! కానీ, పర్యటన ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో ఆ అసలు పాయింట్ ఒక్కటే బావుండటం లేదు!

తెనాలి పర్యటనకు వచ్చారు! తీరా చూస్తే వాళ్ళు ముగ్గురు రౌడీ షీటర్లు అట! పోలీసులు అలా రోడ్డుపై శిక్ష వేయడం ముమ్మాటికీ తప్పు! మీరు ప్రశ్నించాల్సింది అలా శిక్ష వేయడాన్ని! మీరు తప్పు పట్టాల్సింది ఆ పోలీసుల దుశ్చర్యను! మీ ప్యాలెస్ లోనే ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తే బావుండేది! అంత దానికి వేలాదిమందిని వేసుకుని వారింటికి వెళ్లి పరామర్శించడానికి వారేమన్నా కడిగిన ముత్యాలా? పక్కా రౌడీ షీటర్లు!

పార్టీ కార్యకర్తలై ఉండొచ్చు కానీ, వెనకా ముందు అలోచించి అడుగులు వేయాలి! పోనీ పాపం, ఆ ముగ్గురి కుటుంబాలకు కనీసం ఒక్కొక్కరికి ఐదు లక్షలు అయినా ఇచ్చి ఉంటే ఓదార్పుకు అర్ధం ఉండేది!

నిన్నా అంతే! రెంటపాళ్ళ వెళ్లారు! వెళ్లేముందు అతని హిస్టరీ తెలుసుకోవాలిగా! మీరు గెలుస్తారని 30 కోట్లు బెట్టింగ్ పెట్టిన వీరాభిమాని! ఎన్నికల ఫలితాల మరుసటి రోజే ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుని, నాలుగు రోజుల తరువాత చనిపోయాడు! అంటే అప్పుడు ప్రభుత్వం మీ హయాంలోనే వుంది!

కూటమి ప్రభుత్వం 12న ప్రమాణ స్వీకారం చేసింది! వేధించింది ఎవరు? పోనీ, అప్పుడు పరామర్శ కు వెళ్ళలేదు! ఓకే, అతనికి విగ్రహం ఏర్పాటు ఏమిటో! అసలు విగ్రహాలకు అర్ధమే లేకుండా పోయింది! ఆ విగ్రహాన్ని మీరు ఆవిష్కరణ చేయడమేమిటో! మీరు వెళ్లే దారిలో పాపం ఇద్దరు చనిపోయారు! పోనీ, వారినైనా పరామర్శించి, ఆ కుటుంబాలకో చెరి ఐదు లక్షలు ఇచ్చి ఉంటే మీ ఇమేజ్ ఎక్కడికో పెరిగి పోయేది! కానీ, అది చేయలేదు!

మన పాలనను పూర్తిగా మీరే మరచిపోయారేమో అనిపిస్తోంది! అప్పుడు ఎందుకు పరామర్శలు లేవు! అప్పుడు ఎందుకు సమస్యలు గుర్తుకు రాలేదు! అప్పుడెందుకు పరదాలు కట్టుకున్నారు? ఇప్పుడు చేస్తున్న పర్యటనలు అధికారంలో వున్నప్పుడు చేసి ఉంటే పీఠం మళ్ళీ మీదే అయి ఉండేది! అధికారంలో వున్నప్పుడు అన్ని విషయాలు మరచిపోయారు! అందుకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు!



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇంకొన్నాళ్లు పోతే… రూట్ – కోహ్లీ ట్రోఫీగా పేరు మారుస్తారా..?
  • ‘‘బనకచర్ల ఏపీకి మరో కాళేశ్వరం అవుతుంది బహుపరాక్…’’
  • ఫాఫం జగన్… ఈ రఫారఫా నరుకుడు భాషేమిటో, ఈ సమర్థనేమిటో…
  • కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల సాహిత్య పురస్కారాలు వీళ్లకు…
  • వర్తమాన సినిమా ప్రపంచంలో నిజంగానే ఇది ‘అరుదైన సరుకు’…
  • అక్కినేని అలా… కాంతారావు ఇలా… కాంట్రాస్టు జీవితాలు… డెస్టినీ…!!
  • అసలే చిరంజీవి… ఆపై రాఘవేంద్రరావు… ఆవేశంతో శారద… ఇంకేం..?!
  • అన్నదాతకు సంకెళ్లు… ఖచ్చితంగా ప్రభుత్వానికి మరక, మచ్చ..!!
  • దేనికీ టైమ్ లేదా…? పరుగు తీస్తున్నావా..? టైమ్ మింగేస్తుంది జాగ్రత్త..!!
  • గోదావరి- బనకచర్ల ఇష్యూ రాజకీయంగా రేవంత్‌రెడ్డికి కలిసి వస్తోంది..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions