.
ముందుగా మహాభారతం నాటి కథను చెప్పుకుందాం ఓసారి… లక్ష పుస్తకాలు చదివిన కేసీయార్‌కు కూడా బాగా తెలుసు… తన కడుపున పుట్టి, ఎదురుతిరుగుతున్న బిడ్డకూ తెలుసనే అనుకుందాం…
అరణ్య, అజ్ఞాత వాసాలు అయిపోయాక పాండవులు తమ కౌరవ అర్ధరాజ్యం తమకు ఇవ్వాలని శ్రీకృష్ణుడితో రాయబారం పంపిస్తారు… కనీసం ఐదూళ్లు ఇచ్చినా సరే సర్దుబాటు చేసుకుంటామనీ చెబుతారు…
Ads
అదయ్యేది కాదని కృష్ణుడికీ తెలుసు… అదేదో లాంఛనప్రాయ రాయబారం అని దుర్యోధనుడికీ తెలుసు… కానీ రాయబారం తప్పదు కాబట్టి ఆ బేరం… సరే, చివరకు యుద్ధం… కానీ ఇది కలియుగం…
పోలవరం ముంపు పేరిట కొన్ని మండలాల్నే ఏపీలో కలిపేస్తూ మోడీ అధికార ప్రథమంలో పార్లమెంటులో మొదటి బిల్లు… అప్పుడంతా వెంకయ్యనాయుడి హవా కదా, మోడీకి ఏమీ తెలియదు… సరే, కలిపేశారు… మరి ది గ్రేట్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీయార్ ఏం చేశాడు..? ఏమీ లేదు… తప్పదు కాబట్టి, ఓ రోజు నామ్‌కేవాస్తే బంద్… అంతే…
తొమ్మిదిన్నరేళ్ల తన పాలనలో మళ్లీ ఆ ఊసు ఎత్తింది లేదు… పోరాడింది లేదు… ఎందుకు..? అదయ్యే పని కాదని… ఆ మండలాల్ని తిరిగి తెలంగాణలో కలపరు కాబట్టి.., మరిప్పుడు హఠాత్తుగా ఆయన బిడ్డ అయిదూళ్ల కథ ఎందుకు ఎత్తుకున్నట్టు..? తెలియకా, తెలిసీ… ఏదో ఒక ఇష్యూ కావాలి కాబట్టి..?!
ఫాఫం, అస్వస్థతకు గురైన హరీశ్ రావు పరామర్శకు వెళ్లకపోయినా సరే గానీ… ఈ అయిదూళ్ల కథేమిటి అని ఫోన్‌లో అడిగినా చెప్పేవాడు పాపం… అయ్యో, అయ్యో, పోలవరం స్పిల్ వేను 50 లక్షల క్యూసెక్కులను పెంచుతున్నారు, భద్రాచలం మునుగుతుంది, ఆ అయిదూళ్లూ మునుగుతాయి అని ఆందోళన… ఆమెకు కూడా తొమ్మిదిన్నరేళ్లు యాదికి రాలేదు...
ఏదో సమస్య, ఏదో డిమాండ్… తొమ్మిదిన్నరేళ్లు డాడీకి చేతకాలేదు గానీ… ఇప్పుడు రేవంత్ రెడ్డి కేంద్రంతో పోరాడాలట…
అడిగేవాడికి వినేవాడు లోకువ...
1) స్పిల్ వేను 50 లక్షల క్యూసెక్కులను తట్టుకునేలా కట్టడం అనేది దాని రక్షణ కోసం… కానీ పోలవరం రెండు దశలుగా విభజించారు… ప్రతిపాదిత 45.72 మీటర్ల ఎత్తు రెండో దశ… కానీ 41.15 మీటర్ల ఎత్తు రెండో దశ… ఎందుకలా..?
2) ప్రస్తుత చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ (పునరావాసం, పునర్నిర్మాణం) మోయలేని భారం కాబట్టి, అంత ఖర్చు భరించే సీన్ లేక రెండు దశలు చేశారు, అంటేనే అర్థమైంది కదా… జస్ట్, మొదటి దశ చేస్తారు, గ్రావిటీతో నీళ్లిస్తారు… కథ ఖతం… అయ్యో, అయ్యో, అంత పెద్ద ప్రాజెక్టును ఓ బరాజ్ స్థాయికి కుదించారు కదాని పార్టీలు తిట్టుకున్నాయి… అది వేరే కథ…
3) ముంపు సమస్యపై ఈరోజుకూ ఒడిశా, చత్తీస్‌గఢ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి, కొట్లాడుతున్నాయి… కానీ తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి కేసీయార్ మాత్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 90 (3) ప్రకారం, ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు అన్ని విధాలుగా ఆమోదం తెలిపాడు.., కాగా ఇప్పుడు అయిదూళ్లు అయిదూళ్లు అనే మాట ఏమిటి…? గోదావరి జలాలకు సంబంధించి కేసీయార్ పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నడుచుకున్నాడు… తెలంగాణ ఉద్యమకారుడు కదా ఫాఫం…!!
3) పట్టిసీమ, పురుషోత్తమపట్నం, తాడిపూడి, పుష్కరం వంటి చాలా లిఫ్టులను ఏపీ ప్రభుత్వం కట్టేసుకుని, గోదావరి నీటిని ఆల్రెడీ ఎత్తిపోసుకుంటూనే ఉంది… పోలవరం మొదటి దశ పూర్తయితే కుడికాలువ ద్వారా కృష్ణా బేసిన్‌కు కలుపుకుంటుంది… అంతే…
4) సో, ఆర్అండ్ఆర్ భారం నేపథ్యంలో రెండో దశ కష్టం… సో, ఆ అయిదూళ్లకూ వచ్చిన ఢోకా ఏమీ లేదు… ఒకవేళ మునుగుతే ఎలా అంటారా..? మునుగుతాయి అనే కదా ఏపీలో కలిపింది..? మరిక తేడా ఏముంటుంది..? రేవంత్ చేసేదేముంది..? భద్రాచలం ముంపు అంటారా..? ఆలంపూర్‌లాగే ఓ ప్రొటెక్షన్ వాల్ అవసరం… ఐనా కేసీయార్‌కు యాదాద్రి తప్ప భద్రాద్రి పట్టిందెప్పుడు..? ఏమైనా అంటే అన్నామంటారు..!!
Share this Article