ప్రభుత్వాన్ని ఏదేని కీలకాంశంలో సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, అది ఆయా పత్రికల ఇష్టం… జనం కోణం అనేది మృగ్యమై, యాజమాన్య కోణం ప్రధానమైందో ఇక అంతే… ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై వివాదం… ప్రతిపక్షాలు వద్దంటున్నయ్… హైకోర్టు కూడా పునరాలోచించండీ అంటోంది… కానీ జగన్ సర్కారు ససేమిరా అంటోంది… అంతేకాదు, పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులకు నష్టం అని వాదిస్తున్నది… ఆయా పత్రికలు తమ పొలిటికల్ లైన్లకు అనుగుణంగా రాసుకుంటున్నయ్… ఇక్కడ రెండు అంశాలు… తమ కుటుంబంలో ఎవరైనా ఇలా పరీక్ష రాయాల్సిన పిల్లలు ఉంటే ఆ పేరెంట్స్ ఫీలింగ్స్ ఏమిటి..? రోజుకు 17-19 వేలకుపైగా కేసులు నమోదవుతున్న వేళ సెకండ్ వేవ్ సునామీ పిల్లలకు ఎలా సురక్షితం అనేది ఓ కీలకప్రశ్న… అలాగే నిజంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రాయకపోతే విద్యార్థులు నష్టపోతారా అనేది మరో ప్రశ్న… ఈ పత్రిక ఓ కథనం కుమ్మేసింది… మూకుమ్మడిగా ప్రమోట్ చేస్తే అది ఉత్తీర్ణత కిందకు రాదట… అందుకని పరీక్షలు పెట్టకపోతే విద్యార్థుల భవిష్యత్తుకే గొడ్డలిపెట్టు అట… సర్కారుకు ఫుల్ సపోర్ట్ వ్యాసాలు రాయొచ్చు గానీ కాస్త క్రెడిబుల్ అనిపించేలా, క్వాలిటేటివ్ రాతలకు పూనుకోవచ్చు కదా… అబద్ధాలు రాసినా జనం నమ్మేలా ఉండాలి… రాజకీయాల్లో ఐనా, పాత్రికేయంలో ఐనా…
- ఇంటర్లో అడ్మిషన్లకు టెన్త్ మార్కులను ఎవరూ ప్రామాణికంగా తీసుకోవడం లేదు… ప్రైవేటు, కార్పొరేటు కాలేజీల్లో డబ్బులు, ఫీజులు మాత్రమే ప్రామాణికం… టెన్త్ పాసయితే చాలు… ఇక సర్కారు జూనియర్ కాలేజీల్లో సీటు దొరక్కపోవడం అనేదే లేదు… టెన్త్ మార్కులు ఆయా పిల్లల ప్రతిభకు కొలమానాలే తప్ప, అవి భవిష్యత్ చదువులకు అడ్డంకులు కావు…
- ఇంటర్ తరువాత కోర్సులకు కూడా దాదాపు అన్నీ ప్రవేశపరీక్షలే…
- ప్రమోటెడ్ అంటే ఉత్తీర్ణత లేకపోవడం అసలే కాదు… అది రాబోయే చదువులకు ప్రతిబంధకమూ కాదు… ప్రమోటెడ్ సర్టిఫికెట్‌ను పాస్ సర్టిఫికెట్‌గా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు గుర్తించవు అనేది ప్రశ్నార్థకమే…
- ఇప్పటికిప్పుడు పిల్లల ఉన్నత చదువులకు ఇది అడ్డంకి కాకపోయినా సరే, ఏ పదేళ్లకో కొలువుల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, జాతీయ- అంతర్జాతీయ సంస్థలు టెన్త్ మార్కుల్ని బట్టి పిల్లల ఫౌండేషన్ అంచనా వేస్తారు, సో, ఇప్పుడు పరీక్షలు పెడితేనే నయం అంటున్నది ఈ కథనం… ఎప్పుడూ టెన్త్ పరీక్షల మార్కుల్ని ఏ కొలువుకూ పరిగణనలోకి తీసుకోరు… ప్రైవేటు కొలువుల్లోనయితే అసలు టెన్త్ మెమోను కేవలం డేట్ ఆఫ్ బర్త్ కోసం తప్ప ఇంకెందుకూ పరిశీలించరు…
- ఈ పరీక్షల అంశంలో ప్రభుత్వం భేషజాలకో, ప్రతిష్టకో పోవాల్సిన అవసరం లేదు… పరీక్షలు పెట్టకపోతే అదేమీ ప్రభుత్వ వైఫల్యం కూడా కాదు… ఇదొక విపత్తు కాలం… దీన్నుంచి వీలైనంతవరకూ ఎలా కాపాడుకోవాలనేదే ముఖ్యం… నిజానికి అధికార పార్టీలోనే చాలామందికి ఈ పరీక్షల్ని నిర్వహించడం దేనికి అనే భావన ఉంది… జగన్ ఫరమ్గా ఉన్నాడు… ఆయనకు విద్యాసంబంధ సలహాదారులు ఏం చెబుతున్నారో అనూహ్యం… హైకోర్టు ఏమంటుందో చూడాలిక…!!
Share this Article
Ads