అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలోకెల్లా కుబేరుడు… రెండేళ్ల క్రితం భార్య మాకెంజీకి విడాకులు ఇచ్చాడు… వాళ్లిద్దరికీ నలుగురు పిల్లలు… 1992లో పెళ్లయితే 2019లో విడిపోయారు… కొన్ని దేశాల్లో వివాహానికి ముందే ఒక అగ్రిమెంట్ ఉంటుంది… ఒకవేళ పెళ్లి పెటాకుల దాకా వస్తే ఎవరికేమిటో రాసుకుంటారు… prenuptial agreement లేదా ప్రెనప్ ఒప్పందం… 3800 కోట్ల డాలర్లు… అంటే 2.8 లక్షల కోట్ల రూపాయల్ని బెజోస్ ఇచ్చాడు… ప్రపంచంలో ఇప్పటికి ఇవే అత్యంత ఖరీదైన విడాకులు… ఆ డబ్బుతో ఆమె ప్రపంచంలోకెల్లా మూడో అత్యంత ధనిక మహిళ అయిపోయింది…
మచ్చుకు ఈ ఉదాహరణల్ని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… మొన్న బిల్ గేట్స్, మిలిందా గేట్స్ విడాకుల కోసం అప్లయ్ చేశారు కదా… తిరిగి చక్కబడేందుకు ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి అని కూడా కోర్టుకు చెప్పుకున్నారు… కాస్త లేటయినా సరే అధికారికంగా ఇక విడాకులు తప్పవు… మరి ప్రపంచంలోకెల్లా టాప్ ఫైవ్ అత్యంత ధనికుల్లో గేట్స్ కూడా ఉన్నాడు కదా… మరి తను మిలిందాకు ఎంత ఇస్తున్నాడు..? ఇది సహజంగానే అందరికీ ఓ ఇంట్రస్టింగు ప్రశ్న… ఈ ప్రశ్నకు సమాధానం… ఏమీ లేదు…!!
Ads
నిజంగానే బిల్ గేట్స్ ఏమీ ఇవ్వబోవడం లేదట… అమెరికన్ పత్రికలు కొన్ని వాళ్లు కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ కాపీల ఆధారంగా రాసిన వార్తల ప్రకారం… వాళ్లకు వివాహపూర్వ ఒప్పందం ఏమీ లేదు… నాకు భర్త నుంచి ఏ సపోర్టూ అవసరం లేదని మిలిందా చెప్పిందట… ఆశ్చర్యమే… సాధారణంగా హైప్రొఫైల్ పెళ్లిళ్లలో ఈ ప్రెనప్ ఒప్పందాలు చాలా సహజం… హవాయి దీవుల్లో అత్యంత వైభవోపేతంగా పెళ్లి చేసుకున్న ఈ దంపతులు అలాంటి ఒప్పందమేదీ లేదని చెప్పడం విశేషమే… తమ కుటుంబానికి ఉన్న ఆస్తుల్ని పంచుకుంటారట… అదే సెటిల్మెంట్… గేట్స్ ఫౌండేషన్ను మాత్రం యధావిధిగా నడిపిస్తారట… సో, ఇలా ఆస్తులు పంచుకుంటే మిలిందాకు ఎంత వస్తుందనే విషయంలో మాత్రం పత్రికలు రకరకాల లెక్కల్ని వినిపిస్తున్నాయి… ఆస్తుల పంపకమే నిజానికి మిలిందాకు మేలు… ఈ పద్ధతిలో ఆమెకు దాదాపు 5 లక్షల కోట్ల వరకూ ఆస్తి రావచ్చునని ఓ అంచనా… అలాగైతే ప్రపంచంలోకెల్లా అత్యంత భారీ విడాకుల కేసుగా ఇది రికార్డు అవుతుంది…
Share this Article