.
వావ్… జగన్ కూడా మాట్లాడుతున్నాడు… పోలవరం ఎత్తు పెంచితే తప్ప గోదావరి జలాల్ని తరలించలేమట… అప్పటిదాకా బనకచర్ల వేస్ట్ అట…
అసలు దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాల్ని ఎత్తుకుపోదామని కేసీయార్‌తో కలిసి కుట్ర పన్నిందే తను… మరో కాళేశ్వరం ఏటీఎం తలపెట్టిందీ తనే… తెలంగాణకు కేసీయార్ ద్రోహచింతనతో చేసిన ఆలోచనలు అన్నీ ఇన్నీ కావు…
Ads
ఓ వీర తెలంగాణవాది, మరో వీర సమైక్యవాది… విభజన తరువాత… ఏకమై… ఒకరికొకరు అలుముకుని, అన్ని విషయాల్లో సహకరించుకుని… తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జగన్‌తో మిలాఖతై దస్కతులు చేసిందే కేసీయార్…
ఇప్పుడు బనకచర్ల మీద హరీశ్ రావు గగ్గోలు పెడుతున్నాడు… పారడాక్స్… సరే, జగన్ దగ్గరకు వద్దాం, ఎలాగూ తెలంగాణ జాతిపిత తెలంగాణకు ఎంతగా నష్టం చేకూర్చాడనేది చెబితే ఒడవదు, రాస్తే తెగదు… చివరకు రోజా అనే సినిమా నటి దావత్ ఇస్తే కూడా తెలంగాణ వ్యతిరేక హామీలు ఇచ్చి వచ్చిన బాపతు మహానేత…
సరే, జగన్ దగ్గరకు వద్దాం…
45.72 మీటర్ల ఎత్తులో పోలవరం నిర్మిస్తేనే గోదావరి జలాల్ని మళ్లించడం సాధ్యం, కానీ చంద్రబాబు అప్పట్లో 41.15 మీటర్ల కుదింపుకు అంగీకరించాడు… ఎందుకంటే పోలవరం ముంపు పరిహారాల భారం తగ్గించడానికి అని జగన్ ఆరోపణ… సూపర్… చంద్రబాబు అంటే అంతే… అందరికీ తెలుసు, ఐనా అందరూ వోటేస్తారు, కుర్చీ మీద కూర్చోబెడతారు…
కారణం కూడా సింపుల్… సరైన ప్రత్యామ్నాయం లేక… ఎవడూ తెలివైన జనాకర్షక లీడర్ దిక్కులేక… జగన్‌కు చేతగాక… ఎందుకీ మాట అంటే… వోకే, చంద్రబాబు పోలవరం ఎత్తు కుదింపుకు ద్రోహం చేశాడు, తను కేంద్రం దగ్గర బేరాలు చేసుకోలేకపోయాడు సరే, మరి నువ్వేం చేశావు జగన్..?
రివర్స్ టెండర్ల పేరిట ఆ కమ్మ నవయుగ వాడిని తరిమేసి, ఇంకెవరెవరినో తెచ్చుకుని… చివరకు సాధించిందేమిటి..? గుండు సున్నా… పోనీ, కేంద్రం దగ్గర నువ్వేమైనా లాబీయింగు చేయగలిగావా..? చివరకు బాబు వర్సెస్ మోడీ పీరియడ్‌లో కూడా ఏపీ ప్రయోజన వరాలు సాధించిన ఒక్క దాఖలా ఉందా..? ఫ్లాప్..!
కేంద్రం గనుక ఎక్కువ ముంపు, ఎక్కువ పరిహారం అంగీకరించకపోతే రాష్ట్రమే ఓ 15 వేల కోట్లు సమీకరించాలని ఓ సూచన… అది నీకెందుకు చేతకాలేదు అనేది ప్రశ్న… చంద్రబాబు తలపెట్టింది పెద్ద కుట్ర ప్రాజెక్టు… తెలంగాణను దెబ్బతీసి, కాళేశ్వరం ఏటీఎం వంటి ఓ భారీ ప్రాజెక్టు తలపెట్టాడు… కేసీయార్‌లాగే మూడు నాలుగేళ్లలో ఎడాపెడా లిఫ్టులు పెట్టేసి, ఫుల్ కమాయించి బయటపడటం…
అందుకే ఇంత తాపత్రయం… అటు అమరావతి అదనపు ల్యాండ్ పూలింగు, ఇటు పోలవరం బనకచర్ల యవ్వారం… తనకు పిచ్చ క్లారిటీ ఉంది… చంద్రబాబు అంటే అంతే… తనకు పిచ్చ క్లారిటీ ఉంది… తనకేం కావాలో కూడా… అందుకే వరదజలాలు, వృథాజలాలు అని ఏవో పాట ఎత్తుకుంటాడు…
తన దయ మీద, తన ఔదార్యం మీద, తన కరుణ మీద సదరు మోడీ ఆధారపడి బిక్కుబిక్కుమంటున్నాడు కదా… చంద్రబాబు ఇలాగే ఒత్తిడి చేస్తాడు, కేంద్రంతో భేటీ ఏర్పాటు చేయిస్తాడు, ఏమైనా చేస్తాడు..!!
పోలవరం అయ్యేది కాదు, పొయ్యేది కాదు అని రకరకాల లిఫ్టులు పెట్టారు జగన్, చంద్రబాబు… పట్టిసీమ మీద అదొక ప్రపంచ అద్భుతం అన్నట్టు ప్రచారం చేసుకుని, వేల కోట్లు సమర్పించుకున్నాడు… ఆ అనేకానేక లిఫ్టులు కట్టుకున్నాక, ఇక ఎత్తు పెంపు ఎందుకు జగన్..? చంద్రబాబు ప్లాన్ అది కాదు, బోలెడు లిఫ్టులు పెట్టేసి ఆ ఏటీఎం ప్రాజెక్టును తరువాత వదిలేయడం…? అర్థం చేసుకోవూ..!! అర్థమయ్యేలా చెప్పేవాడూ నీ చుట్టూ లేడు… పారిపోయారు… ఇంకెవరినీ రానివ్వవు..!!
Share this Article