కరోనా కాలంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది ఎవరో తెలుసా…? ది గ్రేట్ పొలిటిషియన్స్…. వీళ్లు మారరు, సమాజానికి నిజమైన శాపం వీళ్లే…. కరోనా వైరస్‌కు అసలైన మిత్రులు వీళ్లే…. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఏపీ పాలిటిక్స్…. ఒక్కడు, ఒక్కడంటే ఒక్కడు కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించిందీ లేదు… తమ పార్టీల తరఫునో, తమ వ్యక్తిగతంగానో ఒక్క రోగికీ సాయపడ్డదీ లేదు… దిక్కుమాలిన రాజకీయాలే ఈరోజుకూ వాళ్లకు అవసరం… శ్మశనాల్లో పడుకోబెట్టినా సరే, రాజకీయాలే మాట్లాడే కేరక్టర్లు… మోడీ బేకార్, వోకే… ఎంతసేపూ కరోనా పాలసీల్లోనూ బ్లండర్స్, రాష్ట్రాలపై తోసేసి చేతులు దులుపుకునే రకం… వోకే… కేసీయార్ చేసేదేమీ లేదు, ఎంతసేపూ ఈటల, పుట్ట మధు, కక్షసాధింపు, కేటీయార్ కోసం పార్టీలోని తిరుగుబాటుదారుల్ని ఏరేసే కష్టంలో బిజీ… వోకే… ఢిల్లీని తిట్టడం తప్ప మరేదీ చేతకాని మమత, వోకే… దరిద్రపు పాలనకు ప్రతీక కేజ్రీవాల్… ప్రపంచంలోకెల్లా ప్రమాదకరంగా కరోనా విస్తరిస్తున్నా సోయి లేకుండా బీజేపీని తిట్టే శివసేన… మోడీ సీఎంల సమావేశాన్ని తిట్టిపోసే జార్ఖండ్ సోరెన్…. అందరూ అందరే… ఒకడు తక్కువ కాదు, ఒకడు ఎక్కువ కాదు… కోవిడ్‌ను మించిన వైరసులు….
హెలో… రాజకీయ నాయకులను మించి పత్రికలు, మీడియా…. ఇవి కరోనాకు అదనపు బలం… ఉదాహరణకు సాక్షి చూడండి, ఇంకా దిగజారలేను సుమా అన్నట్టుగా ఆపసోపాలు పడుతూ ఫస్ట్ లీడ్ రాసుకుంది…. ఏమోయ్, చంద్రబాబూ, కరోనా వేక్సిన్పై మా జగనన్నకు తిట్టడం కాదు, ఆ భారత్ బయోటెక్ వాడు నీ బంధువే కదా, వేక్సిన్ ఇప్పించు అని నిర్లజ్జగా రాసుకుంది… అంటే మాకు చేతకాదులే, నువ్వు వేక్సిన్ ఇప్పించు అని వ్యంగ్యంగా చెబుతున్నట్టుంది… (రేపో మాపో,… ఈనాడో, ఆంధ్రజ్యోతి ఫస్ట్ లీడ్స్ అచ్చేస్తాయా..? అదేదో అపర సంజీవని టూడీజీని డాక్టర్ రెడ్డీస్ వాడు డెవలప్ చేశాడట, నీ బంధువే అవుతాడేమో, ఫస్ట్ కోటా మొత్తం ఏపీ వాళ్లకే ఇప్పించు జగన్ అంటూ…!!) భారత్ బయోటెక్ వాడు రామోజీరావుకు చుట్టమే, చంద్రబాబుకు బంధువు ఎలా అయ్యాడు..? అయితే అయ్యాడు, చంద్రబాబు చెప్పగానే తన విపరీత లాభపేక్షను, దోపిడీ స్వభావాన్ని వదులుకుని వేక్సిన్ ఇచ్చేస్తాడా..? వాడు వేక్సిన్ ఇవ్వకపోతే చంద్రబాబు ద్రోహి అవుతాడా..? ఒరేయ్, మన కమ్మోళ్లు కాదు, రెడ్లు పాలిస్తున్నారు, నువ్వు వేక్సిన్ ఇవ్వకు అని చంద్రబాబు చెప్పాడా ఎల్ల కృష్ణకు..? మరీ రోజురోజుకూ పాతాళం వైపు ఇలా ప్రయాణించాలా సాక్షి..? భారత్ బయోటెక్ వాడు వ్యాపారి… టైం దొరికింది కదాని సగటు కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో, డ్రగ్ మాఫియా స్థాయిలో దోచుకుంటున్నాడు… దానికీ చంద్రబాబుకూ లంకె ఏమిటసలు..?
Ads
అధికార పార్టీ సరే…. ప్రతిపక్షం ఏమైనా సరిగ్గా ఏడ్చిందా..? అది మరీ దరిద్రం… ఒక్క ప్రతిపక్ష నాయకులూ ఒక్క రోగికీ సాయపడింది లేదు, విపత్తువేళ రాజకీయాలు మానాలనే సోయి లేదు… అఫ్ కోర్స్, జగన్ కక్షగట్టి అమరరాజా, జువారీ, సంగం డెయిరీల మీద పడటం లేదా..? తనకైమైనా సోయి ఉందా అనే విమర్శ కాసేపు పక్కనపెడదాం… అదీ ప్రస్తావనార్హమే… (తెలంగాణ రాజకీయాలు భిన్నంగా ఉన్నాయని కాదు అర్థం…)… అచ్చెన్నాయుడు అనే ఓ కేరక్టర్ ఉంది, తనకేం తెలుసో, తనేం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాదు… ఈ పాత్రను పక్కనపెడితే ది గ్రేట్ చంద్రబాబు అండ్ కంపెనీ ప్రజాక్షేత్రంలో ఉన్న ఓ రాజకీయ పార్టీగా… ఇన్నేళ్లు అధికారాన్ని, సంపాదనను, పెత్తనాన్ని కుమ్మేసుకున్న పార్టీ, కుటుంబం ఈ మహా విపత్తు వేళ నిర్మాణాత్మకంగా పేదలకు సాయపడుతున్నదేమిటి..? జగన్‌పై విరుచుకుపడు, ప్రతిఘటించు, తప్పు లేదు… కానీ నువ్వు చేస్తున్నదేమిటి..? తెల్లారిలేస్తే నా ప్రజలు అని కలవరించడమే తప్ప నిజంగా అవసరమున్న వేళల్లో జనానికి చేస్తున్నదేమిటి..?
తులసిరెడ్డి అనే సోకాల్డ్ కాంగ్రెస్ లీడర్, రామకృష్ణ అనబడే సోెకాల్డ్ టీడీపీ-బీ టీం లీడర్ గురించి చెప్పుకోవడం అనవసరం… వాళ్లు జగన్‌ను తిడుతున్నారు కాబట్టి ఈనాడు వాడికీ, ఆంధ్రజ్యోతి వాడికీ ఖుషీ… అందుకే వాళ్ల వార్తలొస్తుంటాయి… వాళ్ల వోట్లెన్ని, ఇప్పుడు ఏపీలో వాళ్ల ఉనికి ఎంత..? అసలు ఆ పార్టీలు ఉన్నాయా..? పోనీ, వాళ్లేమైనా జనానికి మంచి చేసే ప్రయత్నాలు చేస్తున్నారా..? పత్రిక ప్రకటనలు తప్ప క్షేత్రంలో ఒక్క రోగికైనా ఉపయోగపడ్డారా..? సీపీఎం మధు కూడా అలాగే తయారయ్యాడు… కేంద్రంతో పోరాడాలట..? ఎంతసేపూ క్షుద్రమైన రాజకీయాలు తప్ప నిర్మాణాత్మక సలహా ఒక్కటైనా చేతనైందా సీపీఎంకు..? ఇలా బోలెడు… తెలంగాణలో భిన్నంగా ఉందని ఏమీ అనుకోవద్దు… ఇక్కడా సేమ్, సేమ్… మరి జాతీయ స్థాయిలో ఏముంది అంటారా..? అది మరీ దరిద్రం… ఓ గడ్డం రవీంద్రనాథ్ మోడీ దేశ ఆరోగ్యాన్నే కుప్పకుప్ప చేసేశాడు… అది వేరే చెప్పుకుందాం… ఎందుకంటే అది మరీ ఎక్కువ రేంజ్ దరిద్రం కాబట్టి…!!
Share this Article