ఓ ట్వీట్… షాకింగ్… మన భావిభారత పాత్రికేయ భాగ్యవిధాతల పరిజ్ఞానం చూసి, అబ్బురపడి, ఆందోళనపడి, ఇక విరక్తిపడే ట్వీట్… inshorts అనబడే ఓ న్యూస్ పోర్టల్ కోసం జర్నలిస్టులు కావాలని కోరుకున్నారు… చాలామంది దరఖాస్తు చేసుకున్నారు… అది బ్రీఫుగా వార్తల్ని అందించే ఓ డిజిటల్ యీప్ ప్లాట్ఫారం… రాబోయే రోజులు ఈ డిజిటల్ జర్నలిస్టులవే కదా… జనానికి లంబాచోడా వార్తల్ని చదివే ఓపిక లేదు… స్ట్రెయిటుగా, సింపుల్‌గా, విషయం ఏమిటో చెప్పాలి… నెటిజనం అదే కోరుకుంటున్నారు… దీర్ఘ విశ్లేషణలకు, లోతైన ఆర్టికల్స్‌కు రాబోయే రోజుల్లో ఆదరణ తక్కువ కాబోతోంది… అది రియాలిటీ… విషయం ఏమిటంటే… మన జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా సరే మన భావితరానికి వర్తమాన వ్యవహారాల మీద ఆసక్తి, అవగాహన, అధ్యయనం చాలా ఘోరంగా ఉంది…
మన యూట్యూబ్ పైత్యాల్నే జర్నలిజం అనీ…. మన తెలుగు న్యూస్ చానెళ్ల బాపతు జర్నలిజాన్నే ఘొప్ఫగా పైకి పరిగణిస్తూ… లోలోపల కుమిలిపోతున్నాం కదా… ఇక రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో చెప్పే ట్వీట్ ఇది… విషయం ఏమిటంటే..? ఇంటర్న్ షిప్ కోసం అయిదుగురు ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను ఇంటర్వ్యూ చేశారట.,. అదెలా ఉందంటే..?
- సాధారణంగా మీరు న్యూస్ ఎలా తెలుసుకుంటారు..? అనడిగితే ఒకరేమో ఇన్స్టాగ్రాం ద్వారా అని చెప్పగా, మరొకతను తెలివిగా మీ యాప్ ద్వారా అని బదులిచ్చాడు. మీ యాప్‌లో టెక్నికల్ ఆర్టికల్స్ బాగా ఉంటయ్ అన్నాడు మరొకతను… దేవుడా….
- మన దేశ వైద్య ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వారిలో ఒకరు మాత్రమే చెప్పగలిగారు
- తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఒడిశా ముఖ్యమంత్రుల పేర్లు ఎవరూ చెప్పలేకపోయారు
- తెలంగాణ సీఎం అంబటి రాయుడు కదా ఎదురు ప్రశ్న వేసింది ఒకామె… బీహార్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అని ఒకరు చెప్పారు…
- ఇండియాలో వేక్సిన్ కొరతకు కారణం సీరం ఇన్స్టిట్యూట్ బాస్ మాల్యాలాగే లండన్ పారిపోవడం వల్ల అని అందరూ ఏకాభిప్రాయంతో చెప్పారు..,
- ఒకతను పుదుచ్చేరిలో ఎన్నికల జరిగాయని చెప్పాడు కానీ తమిళనాడు, కేరళలో కూడా జరిగాయని గమనించలేకపోయాడట… ఇంకా నయం, ఎఐఎడిఎంకే ఫుల్ ఫాం అడగలేదు…
- జస్ట్, అన్ని రాష్ట్రాల పేర్లు, రాజధానులు, ముఖ్యమంత్రుల పేర్లు రాయమని అడిగితే… ఎవరూ పాస్ కాలేదు…
- ఏదో ఇతర ఉద్యోగాల ఇంటర్వ్యూలకు ఇవన్నీ తెలిసినా, తెలియకపోయినా పెద్ద ఫరక్ పడకపోవచ్చు… కానీ జర్నలిస్టు కెరీర్ కావాలని కోరుకునేవారికి ఈ బేసిక్, చిన్న అంశాలపైనా నాలెడ్జి లేకపోవడం, తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవడం క్షమార్హమే అంటారా..?!
Share this Article