కొన్ని ట్వీట్లు కనుబొమలు ముడిపడేస్తయ్… ఆశ్చర్యంలో పడేస్తయ్… ఇదీ అలాగే అనిపించింది… ఈ ట్వీట్ ఎవరిదీ అంటే కోవాగ్జిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ జేఎండీది… కంపెనీ వాళ్లదే… మంచినీళ్ల సీసా ధరకు కరోనా వేక్సిన్ అందించే ఈ కంపెనీ బాస్ నుంచి ట్వీట్ అంటే అందరికీ ఇంట్రస్టు ఉంటుంది కదా… ఎందుకంటే..? వేక్సిన్ సొంత పరిశోధనతో తయారు చేసిన దేశీయ కంపెనీ ఇదొక్కటే… ఆ వేక్సిన్ అడ్డగోలు ధరపై, ప్రభుత్వ పాలసీ వైఫల్యాలు, సప్లయ్స్పై బోలెడు వివాదాలు… ఏపీలోనైతే చంద్రబాబుతో ముడిపెట్టిన పాలిటిక్స్… ఉత్పత్తి సామర్థ్యం తక్కువ… ఇన్ని కోట్ల మందికి మరి వేక్సిన్ ఎలా..? ఈ టెక్నాలజీ ఇతర కంపెనీలతో షేర్ చేసుకోవాలనీ, అవసరమైతే రాయల్టీ తీసుకోవాలని తాజా డిమాండ్లు… మహారాష్ట్రలో ఓ ప్లాంటును తీసుకోవాలని అనుకుంటే అడ్డుపడిన శివసేన సర్కారు, కోర్టు జోక్యం… 18 ఏళ్లలోపు పిల్లలకు వేక్సిన్, బూస్టర్ డోసుల ట్రయల్స్‌కు మోడీ సర్కారు అనుమతి… ఒకసారి డీజీసీఏ వాటికీ ‘అత్యవసర వాడకం’ పేరిట గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిందంటే, అవి కూడా నీళ్లసీసా ధరలతో మార్కెట్లోక వెళ్లిపోవడమే… ఇదుగో ఇన్నిరకాలుగా రోజూ వార్తల్లో ఉంటున్నది భారత్ బయోటెక్… చివరకు ఈ కంపెనీ గానీ, సీరం గానీ సరిపడా వేక్సిన్ ఇచ్చే సీన్ లేదని గమనించి… ఏపీ, తెలంగాణ ఇతర వేక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్తున్నాయి… మన గడ్డ మీదున్న కంపెనీ, మనకు వేక్సిన్ ఇవ్వలేదు… అదీ కథ…
సరే, ఈ ట్వీట్ విషయానికొద్దాం… ఎల్లా సుచిత్ర పేరిట ట్వీట్… ఇది వెరిఫైడ్ ఖాతాలాగా అనిపించలేదు… వెరిఫైడ్, అప్రూవ్డ్ , అఫిషియల్ అయితే పేరు పక్కన ఓ బ్లూకలర్ టిక్ కనిపించేది… కోవాగ్జిన్ పేరుతో ఓ ప్రకటన కూడా జతచేసి ఉంది కాబట్టి, సబ్జెక్టు కూడా వాళ్లదే కాబట్టి ఈ ఖాతా కూడా ఆమెదే అనుకుందాం ఓసారి… ‘‘18 రాష్ట్రాలు కవర్ చేశాం, మా ఉద్దేశాలపై కొన్ని రాష్ట్రాలు ఫిర్యాదు చేస్తున్న తీరు మమ్మల్ని గాయపరుస్తోంది… మా 50 మంది ఎంప్లాయీస్ కోవిడ్ బారిన పడినా సరే, 24 గంటలూ వేక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాం’’ అని ఆమె బాధపడింది… నిజమే… గిరాకీకి సరిపడా ఉత్పత్తి కోసం ఉద్యోగులు రెండు షిఫ్టుల్లోనూ పనిచేస్తున్నారు… కానీ ట్వీట్లో ఓచోట 50 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు అని ఉంది… అంటే మీ వేక్సిన్ మీ ఉద్యోగుల మీద పనిచేయలేదా..? ఇది మీ కంపెనీకి నెగెటివ్ కాదా..? జనంలోకి ఎలా వెళ్తుంది..? పోనీ, ఆ యాభై మందిలో కొందరు ప్రస్తుతం వేక్సిన్ పరిధిలో లేని 18-45 ఏజ్ గ్రూపు అనుకుందాం… కొందరైనా 45 దాటినవాళ్లు ఉంటారుగా… ఆ క్లారిటీ లేకపోతే ట్వీట్ జనంలోకి తప్పుగా వెళ్లడం లేదా..? మే ఒకటి నుంచి 18 ఏళ్ల పైవాళ్లకు కూడా వేక్సిన్ వేయడానికి కేంద్రం వోకే చెప్పింది కదా… మరి వేక్సిన్ సొంత కంపెనీ ఉద్యోగులకే కరోనా సోకింది అని చెప్పుకోవడం అవసరమా..? వేక్సినేషన్ తరువాత కరోనా సోకదని ఏమీ లేదు… కానీ ఈ ట్వీట్లో ఈ విషయం ప్రస్తావం ఓ బ్లండర్… ఒక కంపెనీ ఓనర్ నుంచి ఇలాంటి ట్వీట్ ఏమిటి అసలు..? అందుకే ట్వీట్ మీద డౌటొచ్చింది… చదివాక నవ్వొచ్చింది… ఈమాత్రం చూసుకోలేని కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగాన్ని తలుచుకుంటే జాలేసింది… అంతే…! ఇంతకీ ఇది ఆమె ఒరిజినల్ ఖాతాయేనా..?!
Ads
Share this Article