Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జుబ్లీ ఇరకాటంలో కేటీయార్..! మాగంటి తల్లి పేల్చిన కొత్త బాంబులు..!!

November 7, 2025 by M S R

.

మాగంటి సునీత అభ్యర్థిత్వం సానుభూతి వోట్లను తెచ్చి పెడుతుందని బీఆర్ఎస్ చాలా ఆశలు పెట్టుకుంది గానీ సానుభూతి వోట్లు రావడం మాటేమిటో గానీ… కొత్త తలనొప్పులు క్రియేట్ చేస్తోంది… ఇప్పుడు తాజాగా కేటీయార్ ఫుల్ డిఫెన్స్‌లోకి పడిపోయాడు ఈ వ్యవహారంలో…

  • మొదటి నుంచీ చెప్పుకుందాం… మాగంటి గోపీనాథ్‌ మొదటి భార్య మాలినీ దేవి… ఆమెకు ఓ కొడుకు ప్రద్యుమ్మ… తరువాత గోపీనాథ్ వదిలేశాడు… వాళ్లు అమెరికాలో ఉంటున్నారు… తను సునీతను పెళ్లి చేసుకున్నాడు… ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు… ఇక్కడే అసలైన చిక్కు…

సునీతను పెళ్లి చేసుకోలేదనీ, కేవలం సహజీవనం చేశారని, అందుకని గోపీనాథ్ ఫ్యామిలీ మెంబర్‌గా సునీత అఫిడవిట్ చెల్లదని ప్రద్యుమ్న ఫిర్యాదు చేశాడు… కానీ రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్ యాక్సెప్ట్ చేశాడు… ఎందుకు..? ఫ్యామిలీ సర్టిఫికెట్ ఆమె సమర్పించింది కాబట్టి…

Ads

ఇక్కడ ఓ ట్విస్టు… అసలు ఆ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎలా ఇస్తారని, అది తప్పుడు సర్టిఫికెట్ అని గోపీనాథ్ మొదటి భార్య రెవిన్యూ అధికారులను ఆశ్రయించింది… ఇప్పుడు బాల్ శేరిలింగంపల్లి తహసిల్దార్ కోర్టులో పడింది….

  • కుటుంబసభ్యులు తమ వివరణలను వినిపించారు, విచారణ వాయిదా పడింది… సో, ఎన్నిక వాయిదా ఉండదు… ఒకవేళ సునీత గెలిస్తే… అవును, ఒకవేళ గెలిస్తే… ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ గనుక తప్పు అని తేలితే, సునీత ఎన్నిక చెల్లదని గనుక ఎన్నికల సంఘం ప్రకటిస్తే… మళ్లీ ఉపఎన్నిక తప్పదు… (ఏమో, బీజేపీ సాయం బీఆర్ఎస్ కోరితే ఎలా ఉంటుందో… రహస్య స్నేహితులు కదా రెండు పార్టీలు…)

పోనీ, సునీత ఓడిపోతే… ఏ ప్రాబ్లమూ ఉండదు… ఆస్తులు, వారసత్వ వ్యవహారాలపై మొదటి భార్య, సునీత కోర్టులో కొన్నాళ్లు కొట్లాడుకోవాలి… కేవలం సీటును కాపాడుకోవడానికి, సానుభూతి వోట్ల కోసం సునీతను ఆదరించిన బీఆర్ఎస్ ఓటమి తరువాత పట్టించుకుంటుందనే నమ్మకం లేదు… ఏరు దాటడం వరకే సునీత కావాలి…

gopinath mother

  • ఇప్పుడు అసలైన ట్విస్టు… మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి తెరపైకి వచ్చింది… ‘‘విదేశాల నుంచి కేటీయార్ వచ్చేదాకా నా కొడుకు మరణాన్ని ఎందుకు ప్రకటించలేదు, కేటీయార్ జవాబు చెప్పాలి, నన్ను ఓసారి కొడుకును చూడనివ్వండి అని కేటీయార్‌ను బతిమిలాడినా ఎందుకు పట్టించుకోలేదు..? నన్ను ఎందుకు సునీత, పిల్లలు రానివ్వలేదు ఏవో సాకులు చెప్పి..?’’ అని కేటీయార్‌ను వివాదంలో బలంగా లాగింది… లింక్ ఇదుగో…

https://www.facebook.com/reel/1184077050533026

మొదటి భార్య ఏదో చెప్పిందంటే జనం పెద్దగా నమ్మరేమో గానీ… సాక్షాత్తూ 90 ఏళ్లు దాటిన గోపీనాథ్ తల్లి చెబుతోంది… దాంతో సునీత పట్ల వోటర్లలో వ్యతిరేకత పెరిగి, కేటీయార్ ఆశించిన సానుభూతి వోట్లకు కాస్తా గండి పడే ప్రమాదం ఏర్పడింది…

అవునూ, ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ అంటే ఏమిటంటారా..? ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సమయంలో ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ అవసరం పడుతుంది… ఇది అభ్యర్థి కుటుంబసభ్యుల ధ్రువీకరణ… వారసత్వ సంబంధాలు, కుటుంబ స్థితిని చెబుతుంది… ఒకవేళ దీని ప్రకారం అఫిడవిట్‌లో వివరాలు లేకపోతే చిక్కులే..!!

maganti

తాజాగా ఈ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది… మాగంటి గోపీనాథ్ సునీతను పెళ్లి చేసుకున్న చిత్రం… ఇందులో ఆయన తల్లి కూడా ఉంది… అయితే ఇది రిజిష్టర్ అయ్యిందా..? మరి మొదటి భార్య అసలు సునీతను పెళ్లి చేసుకోలేదు అంటోంది ఎందుకు..? ఈ పెళ్లి నాటికి మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదా..? అలాంటప్పుడు ఈ పెళ్లి చెల్లుతుందా..? ఆ తల్లి చెబుతున్నట్టు గోపీనాథ్ మరణంలో మిస్టరీ ఏమిటి..? అన్నీ ప్రశ్నలే… తేల్చాల్సింది ఎవరు..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నా డెత్ సర్టిఫికెట్ పోయింది… దొరికినవారు దయచేసి సంప్రదించగలరు…
  • బంగారు బల్లి… వెండి బల్లి… కంచిలో వాటి తాపడాలూ మార్చేసేశారు…
  • స్టార్ల సినిమాలు కాదు… ఇదుగో ఇవి కదా రీరిలీజ్ చేయాల్సింది..!!
  • బండి రాకతో జుబ్లీ హిల్స్ ప్రచార చిత్రంలో హఠాత్ మార్పు… ఎలాగంటే..?
  • జుబ్లీ ఇరకాటంలో కేటీయార్..! మాగంటి తల్లి పేల్చిన కొత్త బాంబులు..!!
  • బ్యాట్లు, లెగ్ గార్డుల షేరింగు అప్పట్లో… మ్యాచుకు జస్ట్ రూ. 1000 ఫీజు..!!
  • పర్సనల్ టచ్..! ఇందులో దేశంలో మోడీకి ఎవరూ పోటీ రాలేరు..!!
  • దత్తాత్రేయ భక్తులా మీరు..? తప్పక చదవాల్సిన ఓ ఆధ్యాత్మిక కథనం..!!
  • ఆదానీ అనగానే మోడీ… మోడీ అనగానే వ్యతిరేకత… ఎర్రన్నలు అంతే..!!
  • డ్రంకెన్ డ్రైవ్‌తోపాటు… డ్రంకెన్ స్పీచ్ టెస్టులూ అవసరం ఇప్పుడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions