.
నక్సలైట్ల ప్రస్థానం ముగింపు ఆపరేషన్లకు తెలంగాణ పోలీసులు ఫినిషింగ్ టచ్ / పంచ్ ఇవ్వబోతున్నారా..? నిజమేనా..? సంకేతాలు అలాగే కనిపిస్తున్నాయి… కేంద్ర కమిటీల లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతోంది కదా… మిగిలిన ముఖ్య నేతల్లో తిరుపతి, ఆజాద్, మల్లా రాజిరెడ్డి, దామోదర్ తదితరులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయే సూచనలు…
అదే జరిగితే ఇక తెలంగాణ పోలీసులు నక్సలైట్ల ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టిన క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్నట్టే..! హిడ్మా లొంగుబాటుకు సిద్ధమయ్యాక… ఎప్పుడైతే ఏపీలో ఎన్‌కౌంటర్ అయ్యాడో దాంతో లొంగిపోవాలనుకున్న నేతలకు ఏపీ సేఫ్ కాదనే సంగతి అర్థమైపోయింది… సో, ఇక తెలంగాణలో లొంగిపోవడమే మావోయిస్టు నేతలకు సేఫ్…
Ads
ఎపీ ఎస్ఐబీ ఏడీజీ ఏమంటున్నాడు..? తిరుపతి అలియాస్ దేవ్‌జీ (మావోయిస్టు కేంద్ర కార్యదర్శి) ఏపీలో లేడు, బహుశా ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో ఉండొచ్చు అంటున్నాడు… వినిపిస్తున్న సమాచారం, కనిపిస్తున్న సంకేతాలు మేరకు… ఆల్రెడీ తెలంగాణ పోలీసుల క్యాంపులోకి ఆల్రెడీ ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు వచ్చేసినట్టేనట…
మరి తిరుపతి..? అది కదా కీలకమైన వికెట్… లొంగుబాటుపర్వంలో తమదైన పనితీరు కనబరుస్తున్న తెలంగాణ పోలీసులు బహుశా తిరుపతిని కూడా సరెండర్ చేయించవచ్చు… ఏమో, ఆల్రెడీ పోలీసుల దగ్గరకు చేరుకున్నాడనే వార్తలనూ కొట్టిపారేయలేం…
నిజానికి ఈ లొంగుబాట్లకు సంబంధించి నాలుగు రాష్ట్రాల స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరోల నడుమ ఓ పోటీ నడుస్తోంది… మంచిదే… ఎవరి ఎఫర్ట్ వాళ్లది… అంతిమంగా ఈ దేశ అంతర్గత భద్రత సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టడం… మావోయిస్టు కేంద్ర కమిటీలోనే ఆయుధాలు త్యజించి, పోరాటాన్ని విరమించాలనీ, ఇప్పుడు నడుస్తున్న బాట ఆశించిన గమ్యానికి చేర్చలేదనే చర్చ నడుస్తోంది… మల్లోజుల, తక్కళ్లపల్లి లొంగుబాట్లు సంపూర్ణ సాయుధ విరమణ సంకేతాలే…
అమిత్ షా, అంటే కేంద్ర హోం శాఖ పెట్టిన వచ్చే ఏడాది మార్చి గడువుకన్నా ముందే… బహుశా వచ్చే 28న ఆల్ ఇండియా డీజీపీల సదస్సులోపే తెలంగాణలో కీలక పరిణామం జరగొచ్చు… ఈ సదస్సులోపే తమ టార్గెట్ పూర్తి చేయనుందేమో తెలంగాణ ఎస్ఐబీ… మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు టార్గెట్‌గా తెలంగాణ SIB వ్యూహాలు…
కొన్ని సంకేతాల మేరకు… రెండు రోజుల్లో రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముందు లొంగిపోనున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు… మీడియా ముందుకు కేంద్ర కమిటీ సభ్యులు మల్లారాజి రెడ్డి, అజాద్, దామోదర్… ఏమో… తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ కూడా..! రికార్డ్ ఆపరేషన్స్‌తో దేశవ్యాప్తంగా మావోయిస్టు లొంగుబాట్లలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ ఎస్ఐబీ (అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం)… ఇక నక్సలిజానికి ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నట్టుంది..!!
మరి గణపతి ఎక్కడున్నాడు..? ఈ ప్రశ్నకు జవాబు ఆల్రెడీ పోలీసులకు తెలిసిపోయినట్టుంది… కొన్నాళ్లు గోప్యమేమో… ఐతే మావోయిస్టుల కీలకనేత హిడ్మా, టెక్ శంకర్ ఎన్‌కౌంటర్ల వెనుక కోవర్టు ఆపరేషన్స్ సాగినట్టు ప్రచారాలు కూడా సాగుతున్నాయి… అంతేకాదు, అగ్రవర్ణాలు వర్సెస్ గిరిజన నేతలు, కోవర్టులు అనే ప్రచారాలూ వినిపిస్తున్నాయి… ఇక రెండుమూడు రోజుల పరిణామాలు వేచి చూడాల్సిందే..!!
Share this Article