.
అసలు అనసూయే అతి… అప్పుడప్పుడూ తన వీడియోల్లో తనేం మాట్లాడుతుందో తనకే తెలియదు… తన అశ్లీల వస్త్రధారణ, తన అసభ్య వీడియోల్లాగే…
ఏవో పాపడాలో, అప్పడాలో తింటూ… ఏదో వీడియో చేసింది… పారసైట్స్ అట… నా హెల్త్, నా సంపాదన అంటూ… ఇరిటేటింగ్ కరకర సౌండ్‌తో… ఆమె ఎవరిని విమర్శిస్తుందో ఎవడికీ తెలియదు… పారసైట్స్‌ను ఎరాడికేట్ చేయాలట, ఏం చేయాలో ఆలోచిస్తుందట… అదీ దరిద్రమైన ‘పీకుడు భాష’లో…
Ads
మళ్లీ ఇంకేదో వీడియో… ఆ చీర కట్టుకుని, ఆ నోటి కంపు ఏమిటో అని… అదెవరిని ఉద్దేశించో ఎవడికీ అర్థం కాదు, ఆమె మెంటాలిటీలాగే… సరే, అనసూయ అంటే అందరికీ తెలిసిందేగా… శివాజీ దరిద్రపు వ్యాఖ్యలకు భయపడకుండా ఎదురుతిరిగి రిటార్ట్ ఇచ్చిందనే కాస్త సదభిప్రాయం కూడా కోల్పోయేలా పిచ్చి పిచ్చిగా రియాక్టవుతోంది…

ఆ శివాజీ పిచ్చి కూతల ప్రభావం ఏమో గానీ… గరికపాటి, నాగబాబు, చిన్మయి, ప్రకాష్ రాజ్ మీదుగా… అన్వేష్ అనే వెధవ దాకా వెళ్లిపోయింది… అసలే హిందూ వ్యతిరేకి, ఆపై గలీజు వ్యాఖ్యలు… వాడి మీద కేసులు, లక్షల్లో వాడి చానెళ్లకు అన్‌సబ్‌స్క్రయిబులు… కేసులు… ఎక్కడికో వెళ్లిపోతోంది ఈ మైండ్ లెస్ స్టోరీ…
చివరకు నిన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా తొలిసారి చంద్రబాబు, జగన్ జోలికి పోకుండా… తనూ ఈ సామాన్ల కథలోకి జారిపోయాడు… కానీ తను రాసినట్టు లేదు, తన డూప్ ఎవరో రాసినట్టుంది… ఎటెటో పోయింది…
భారతంలో ద్రౌపది చీరెలాగితే ఓ కురుక్షేత్రమే జరిగింది అని… అవును, జయలలిత చీరె లాగితే డీఎంకే మట్టికరిచి పోయింది… అన్నీ నిజమే కానీ… చీరె కట్టినా సరే అనర్థాలు జరుగుతున్నాయి అంటూనే శివాజీ చీరె కట్టుకుంటే సేఫ్ అనే మాటలకు ఓ సమర్థన… చిత్రవిచిత్రమైన ఎడిటోరియల్ వ్యాసం… సేమ్, ఈ సామాన్ల స్టోరీ మలుపులు తిరుగుతూ పిచ్చి రేపుతున్నట్టుగానే…

అనసూయే అతి, మ్యాడ్ అనుకుంటే… మధ్యలో మాజీ నటి రాశి దూరింది… అదేదో షోలో అనసూయ రాశి గారి ఫలాలు అని తననుద్దేశించి బాడీ షేమింగ్ చేసిందట… దానికి జడ్జి పకపకా (రోజా) నవ్విందట… ఇది చెబుతూ కళ్లు తుడుచుకుంది… ఇక్కడ విషయం ఏమిటంటే… ఆ ఎపిసోడ్‌లో రాశి పట్ల బాడీ షేమింగ్ లేదు, అక్కడ వాడింది ‘సామాన్ల’ భాష కూడా కాదు…
నీకు కేన్సర్ (వ్యాధి) అని ఎందుకు నాకు చెప్పలేదు అంటుంది అనసూయ (కర్కాటకం రాశిని కూడా కేన్సర్ అంటాం)… నీది స్కార్పియో (వాహనం) అని నాకెందుకు చెప్పలేదు..? అంటాడు ఆది… స్కార్పియో అంటే వృశ్చిక రాశి… నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అనడుగుతుంది అనసూయ ఎడ్డి మొహంతో…. అవి రాశి గారి ఫలాలు కావు, రాశి ఫలాలు అని వెక్కిరిస్తాడు ఆది… ఇదంతా ఓ ఫన్…

ఇక్కడ సామాన్ల భాష లేదు, రాశిని ఉద్దేశించి ఏ వెగటు వ్యాఖ్య లేదు, అసలు ఆమెకు సంబంధమే లేదు… దానికి ఆ సంబాషణ అంతా తన ‘ఫలాల’ను ఉద్దేశించే, ఆ సామాన్ల భాషలోనే సాగిందని రాశి తనకు తానే ఊహించుకుని, అది బాడీ షేమింగ్ అని తేల్చేసుకుని ఓ వీడియో వదిలింది… పైగా రోజా నవ్వును కూడా లాగింది తప్పుపడుతూ… (ఈ ఎపిసోడ్‌లో అనసూయ, రోజా, ఆది తప్పేమీ లేదు… అందులో వాళ్లు ఎవరికీ కించపరచలేదు…)
(నా పేరు విజయలక్ష్మి, తెర పేరు రాశి, తమిళంలో మంత్రి అని చెబుతూ రాశిఫలాలు అంటే తనకు సంబంధం లేదు గానీ, రాశి ‘గారు’లో తనున్నదట… హేమిటో వింత విచిత్ర వివరణలు, తనకు తానే ఆపాదించుకోవడాలు…)
ముందే అనుకున్నాం కదా… ఈ సామాన్ల వివాదం ఆ ఆంటీ ఎవరో, ఆమెను వెక్కిరిస్తూ వీడియో చేసిన వాడెవడో గానీ… ఆరు నెలలయ్యాక శివాజీ కూతలతో మళ్లీ మొదలై… ఇది ఎటెటో తిరుగుతూ ఎంతోమంది జ్ఞానసంపదల్ని బయటపెట్టేస్తోంది… అదేదో టీవీ చానెల్ సహా చాలా యూట్యూబ్ చానెళ్లకు కొద్దిరోజులుగా ఇదొక్కటే కనిపిస్తోంది…!!

Share this Article