Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ శృతి కథ మీ కథేనా … చదవండి, ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంది…

February 18, 2026 by M S R

.
Psy Vishesh …. బయట ప్రపంచానికి వారు విజేతలుగా కనిపిస్తారు, కానీ వారి మనసు లోపల మాత్రం “నేను ఒక మోసగాడిని, ఏ క్షణంలోనైనా నా అసమర్థత బయటపడుతుంది” అనే భయం నీడలా వెంటాడుతుంటుంది. ‘శృతి’ (పేరు, వివరాలు మార్చాను) అనే ఒక సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కథ ద్వారా ఈ విచిత్రమైన మానసిక స్థితిని అర్థం చేసుకుందాం.

“సార్, ప్రపంచం నన్ను ‘సక్సెస్ ఫుల్ ఉమెన్’ అని పిలుస్తుంటే నా లోపల నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూస్తున్న శృతి నిజమైనది కాదు… అది నేను క్రియేట్ చేసిన ఒక భ్రమ.
నేను ఆఫీసులోకి అడుగుపెట్టిన దగ్గర నుండి నా డెస్క్ దగ్గర కూర్చునే వరకు నా మెదడులో ఒకటే అలారం మోగుతుంటుంది..

‘జాగ్రత్త శృతి, ఈ రోజు నీ అసమర్థత బయటపడిపోతుంది!’. నా టీమ్ మెంబర్స్ నా దగ్గరకు వచ్చి ఏదైనా టెక్నికల్ డౌట్ అడిగితే, నా గుండె వేగం పెరిగిపోతుంది. ఆన్సర్ తెలిసినా కూడా, ‘నేను చెప్పేది కరెక్టేనా? వాళ్ళు నాకంటే తెలివైన వాళ్ళు కదా, నేను తప్పు చెబితే నన్ను చూసి నవ్వుతారేమో?’ అని భయం. నా గొంతులో వణుకు బయటకు తెలియకుండా ఉండటానికి నా గోళ్లను గట్టిగా నొక్కుకుంటూ మాట్లాడతాను.

Ads

నేను సాధించిన ప్రతిదీ ఒక యాక్సిడెంట్ అని నా నమ్మకం. నా మొదటి జాబ్ అదృష్టం వల్ల వచ్చింది, నా ప్రమోషన్ ఆ సమయంలో ఇంకెవరూ లేరు కాబట్టి నాకు ఇచ్చారు, నా ప్రాజెక్ట్ సక్సెస్ అయింది టీమ్ వల్ల తప్ప నా వల్ల కాదు.. ఇలా నా సక్సెస్ నుండి నన్ను నేను పూర్తిగా డిలీట్ చేసుకున్నాను.

ఎవరైనా నన్ను మెచ్చుకుంటే నాకు అది ఒక అబద్ధంలా వినిపిస్తుంది. ‘వీళ్ళకి నేను ఎంత పనికిమాలినదాన్నో తెలియదు, అందుకే ఇలా పొగుడుతున్నారు’ అని నా మనసు నన్ను నిరంతరం దెబ్బతీస్తుంటుంది.

నా అసమర్థత ఎక్కడ బయటపడిపోతుందో అనే భయం నన్ను రోజుకు 16 గంటలు పని చేసేలా చేస్తోంది. ఇది డెడికేషన్ కాదు సార్.. ఇది కేవలం నా భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను పడుతున్న తాపత్రయం. అందరూ నిద్రపోయాక కూడా నేను లాప్ టాప్ ముందు కూర్చుని పదే పదే చెక్ చేసుకుంటాను.

చిన్న పొరపాటు జరిగినా.. ‘చూశావా, నువ్వు దేనికీ పనికిరావు అని నాకు ముందే తెలుసు’ అని నా లోపలి గొంతు (Inner Critic) అరుస్తుంది. ఆ గొంతు నన్ను రాత్రిళ్ళు నిద్రపోనివ్వదు.

ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా, ఒక పెద్ద మీటింగ్ లో మాట్లాడాలన్నా నాకు జ్వరం వచ్చినంత పనవుతుంది. ‘శృతి, స్టేజ్ మీదకు వెళ్ళాక నీకు ఏమీ తెలియదు అని అందరికీ అర్థమైపోతుంది, అప్పుడు నిన్ను ఆఫీసు నుండి గెంటేస్తారు’ అనే ఆలోచన నన్ను పీడిస్తుంది. సార్, నేను ఒక చీకటి గదిలో బందీ అయిపోయాను.

బయట అందరూ నన్ను చప్పట్లతో అభినందిస్తున్నారు, కానీ లోపల మాత్రం నేను ఏ క్షణంలోనైనా పేలిపోయే బాంబు మీద కూర్చుని ఉన్నాను. ఈ సక్సెస్ నాకు ఆనందాన్ని ఇవ్వడం లేదు సార్, ఇది నన్ను నిరంతరం భయపెడుతోంది” అని వాపోయింది శృతి,

విజయం వెనుక ఉన్న అభద్రతా భావం. శృతి అనుభవిస్తున్నది Imposter Syndrome. ఇది ఒక జబ్బు కాదు కానీ, ఇది ఒక వ్యక్తి ఎదుగుదలను, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది.

🔹 The Perfectionist Trap: వీరు ఏ పని చేసినా నూటికి నూరుశాతం పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు. చిన్న పొరపాటు జరిగినా తమను తాము దారుణంగా నిందించుకుంటారు.
🔹 Discounting Success: తమ విజయాలను తాము సాధించినవిగా గుర్తించరు. “అది అందరూ చేసేదే”, “ఆ సమయంలో అదృష్టం కలిసొచ్చింది” అని తమ క్రెడిట్‌ను తామే తగ్గించుకుంటారు.

🔹 The “Genius” Myth: ఏదైనా విషయాన్ని మొదటి ప్రయత్నంలోనే పర్ఫెక్ట్‌గా చేయలేకపోతే, తాము మేధావులం కాదు అని ఫిక్స్ అయిపోతారు.
🔹 Fear of Being Exposed: తాము ఒక ‘ఫేక్’ అని ప్రపంచం గుర్తించేస్తుందనే నిరంతర భయం మెదడులోని Amygdala ని ఎప్పుడూ అలర్ట్‌గా ఉంచుతుంది, దీనివల్ల దీర్ఘకాలిక ఒత్తిడి (Chronic Stress) ఏర్పడుతుంది.
దీనివల్ల కలిగే నష్టాలు…

🔸 Burnout: తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయంతో అతిగా పని చేసి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం.
🔸 Missed Opportunities: ఏదైనా పెద్ద ఆఫర్ వచ్చినా “నేను దాన్ని హ్యాండిల్ చేయలేను” అనే భయంతో వెనక్కి తగ్గిపోవడం.
🔸 Low Self-Worth: ఎంత సాధించినా లోపల అసంతృప్తిగా, అసమర్థులుగా మిగిలిపోవడం.

మీ విలువను మీరు గుర్తించండి (Owning Your Success)
శృతి తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడానికి మేము మూడు నెలలపాటు కోచింగ్ అందించాం. Feelings are not facts అనే విషయం ఆమెకు అర్థమయ్యేలా చేశాము. Cognitive Reframing ద్వారా “నాకు అంతా తెలియదు” అనే ఆలోచనను “నేను నిరంతరం నేర్చుకుంటున్నాను” అనే పాజిటివ్ స్టేట్‌మెంట్‌గా మార్చాము. ఎవరైనా మెచ్చుకున్నప్పుడు దాన్ని నిరాకరించకుండా, “థాంక్యూ” అని స్వీకరించడం ప్రాక్టీస్ చేయించాము.

తన భయాలను నమ్మకమైన వారితో పంచుకోవడం వల్ల అది ఎంతటి చిన్న విషయమో ఆమెకు అర్థమైంది. ప్రపంచంలో 70% మంది సక్సెస్ ఫుల్ పీపుల్ ఈ భయాన్ని అనుభవిస్తున్నారని ఆమె తెలుసుకున్నప్పుడు ఆమెకు ఊరట లభించింది.

శృతి ఇప్పుడు తన విజయాలను సగర్వంగా అంగీకరిస్తోంది. ఏదైనా తెలియకపోతే “నాకు తెలియదు, నేర్చుకుంటాను” అని ధైర్యంగా చెప్పగలుగుతోంది. “సార్, ఆ ముసుగును తీసి పక్కన పెట్టాక ఇప్పుడు నాకు స్వేచ్ఛగా ఉంది” అని ఆమె సంతోషంగా చెబుతోంది.

శృతి కథ మీ కథేనా? మీరు ఎంత సాధించినా ఇంకా ఏదో తక్కువగా అనిపిస్తోందా? మీ ప్రతిభ మీద మీకే నమ్మకం లేదా? గుర్తుంచుకోండి.. మీరు ఉన్న పొజిషన్ మీ కష్టానికి, మీ మేధస్సుకు దక్కిన గౌరవం. అది అదృష్టం కాదు.

మీలోని ‘ఇంపోస్టర్’ను తరిమికొట్టి, అసలైన మిమ్మల్ని మీరు గౌరవించుకుందాం. మీ విజయాలను ఎంజాయ్ చేయడం నేర్చుకుందాం. సహాయం కోసం సంప్రదించండి. – మీ సైకాలజిస్ట్, Psy. Vishesh, Genius Matrix Hub…. 80190 00066 
👉 ఈ ఆర్టికల్‌ను షేర్ చేయండి. అవసరమున్నవారికి ఉపయోగపడవచ్చు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ శృతి కథ మీ కథేనా … చదవండి, ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంది…
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజంగా సిగ్గుపడాల్సిన ఓ వైఫల్యం..!!
  • ‘బలుపు కా బాప్’… నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేశావురా హార్దిక్…
  • తెలంగాణ రాజకీయాల్లో ఓ సైలెంట్ మార్పు..! బీసీ, వుమెన్ చైతన్యం..!
  • హోర్ముజ్ జలసంధిపై కుదరని సంధి… మళ్లీ ఉద్రిక్తతలు…
  • స్వరరచనలో లబ్ధి ప్రతిష్ఠుడే… లిటిగెంటుగా పే-ద్ద లుబ్ధ ప్రతిష్ఠుడే…
  • ఏపీ రాజకీయాల్లో కోవా – నెయ్యి – పెరుగు – ప్రతిదీ గాయిగత్తరే…
  • కరీంనగర్ ఇషాన్ కిషన్… బండి సంజయ్… ఓ ఉత్కంఠభరిత మ్యాచ్..!!
  • మేడం సార్, మేడం, అంతే… వయస్సు మీద పడినా భానుమతి లెవల్ అదే…
  • 24 ఏళ్లు సరే… అసలు ప్రత్యూష కేసులో న్యాయం జరిగినట్టేనా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions