.
దురంధర్ 2: ఒక కామియో… ఒక సంకేతం… ఒక కొత్త బాలీవుడ్!
ఒక్క డైలాగ్…
కొన్ని సెకన్ల స్క్రీన్ టైమ్…
కానీ థియేటర్ మొత్తం షాక్ అయ్యే సీన్…
Ads
అదే యామీ గౌతమ్ చేసిన షాజియా బానో పాత్ర. యామీ గౌతమ్ తెలుసు కదా, దర్శకుడు ఆదిత్య ధర్ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి…
Dhurandhar: The Revenge లో ఆమె కేవలం ఓ నర్స్‌లా కనిపిస్తుంది. కానీ ఆ నర్స్ నిజానికి స్పై.
ఒక ఉగ్రవాదిని హాస్పిటల్లో చంపే సన్నివేశం…
అది కేవలం యాక్షన్ కాదు… అది ఒక మెసేజ్.
రణవీర్ సింగ్ పాత్రతో లింక్ అయిన ఈ సీన్… కథలో చిన్నది కాదు — కీలకం.
డైరెక్టర్ ఆదిత్య ధర్ స్పాయిలర్స్ చెప్పొద్దని అందరికీ చెప్పినా…
ఈ కామియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఎందుకు?
ఎందుకంటే ఇది కేవలం ఒక సీన్ కాదు…
బాలీవుడ్ మారుతున్న దిశకు సంకేతం…
దావూద్ నుంచి విలన్‌గా మారిన కథ
ఒకప్పుడు…
దావూద్ ఇబ్రహీం అనే పేరు అంటే బాలీవుడ్ కూడా భయపడేది.
బాంబే అండర్వల్డ్ను మాత్రమే కాదు…
సినిమా ఇండస్ట్రీని కూడా ప్రభావితం చేసిన వ్యక్తి. కాదు, బాలీవుడ్ తను చెప్పినట్టు నడిచేది…
కానీ ఇప్పుడు?
అదే బాలీవుడ్…
అతడిని విలన్‌గా చూపిస్తోంది. ఎంత మార్పు, ఒక తెగింపు…
ఇది చిన్న మార్పు కాదు.
ఇది “భయం నుంచి విముక్తి”కి సంకేతం…
ఆదిత్య ధర్ సినిమాల వెనుక ఉన్న గాయం
ఆదిత్య ధర్ సినిమాల్లో దేశభక్తి ఎందుకు అంత పచ్చి (రా)గా ఉంటుంది?
సమాధానం — ఆయన మూలాలు.
ఆయన ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందినవాడు.
1990లలో జరిగిన వలసలు… హింస… నష్టం…
ఇవి ఆయన కుటుంబం నేరుగానో, పరోక్షంగానే అనుభవించినవి. ఆ గాయాల తీవ్రత ఆ జాతిని పచ్చిపుండులా సలుపుతూనే ఉంది..
అందుకే ఆయన సినిమాల్లో ఉగ్రవాదం “విలన్” కాదు —
అది ఒక నిజమైన ప్రమాదం.
“ఉరి” నుంచి “దురంధర్” వరకు
Uri: The Surgical Strike లో మనం చూసింది:
- సర్జికల్ స్ట్రైక్
- సైనికుల త్యాగం
- వ్యూహాత్మక యుద్ధం
“హౌస్ ది జోష్?” అనేది కేవలం డైలాగ్ కాదు —
ఒక భావోద్వేగం.
ఇప్పుడు అదే లైన్‌ను మరింత గట్టిగా తీసుకెళ్తోంది
Dhurandhar & దాని సీక్వెల్.
ఇక్కడ యుద్ధం బాంబులతో కాదు…
ఇంటెలిజెన్స్, స్పై ఆపరేషన్స్‌తో.
షాజియా బానో లాంటి పాత్రలు…
సరిహద్దుల అవతల జరిగే “నిశ్శబ్ద యుద్ధం”కి ప్రతీక.

పాక్ వ్యతిరేకత కాదు… ఒక స్ట్రాటజీ
ఈ సినిమాలు పాకిస్థాన్‌ను తిట్టటానికి కాదు.
ఇవి ఒక కొత్త భారతదేశాన్ని చూపిస్తున్నాయి:
- మౌనం కాదు
- ప్రతిస్పందన
- వ్యూహం
- ఆత్మగౌరవం
క్రియేటివిటీకి పదును పెట్టిన వేదన
ఇక్కడ మరో పేరు గుర్తుకు వస్తుంది —
వివేక్ అగ్నిహోత్రి
ఆయన తీసిన
The Kashmir Files
ఒక సినిమా కాదు — ఒక చరిత్ర.
కశ్మీరీ పండిట్ల వేదనను ప్రపంచానికి చూపించింది.
అలాగే
The Tashkent Files
వ్యవస్థలపై ప్రశ్నలు లేపింది.
బాలీవుడ్ కొత్త దశలోకి?
ఇప్పుడు ఒక ప్రశ్న:
ఎందుకు ఈ రకం సినిమాలు పెరుగుతున్నాయి?
జవాబు సింపుల్:
👉 ప్రేక్షకులు మారారు
👉 దేశం మారింది
👉 కథలు మారాయి
ఒకప్పుడు “ఎంటర్టైన్మెంట్” మాత్రమే చూసిన ఇండస్ట్రీ…
ఇప్పుడు “ఐడెంటిటీ” గురించి మాట్లాడుతోంది.

అవును, భారత్ ఇప్పుడు కథల్లో కూడా బలంగా నిలబడుతోంది. ఒకప్పుడు భయపడి చెప్పలేని కథలు…
ఇప్పుడు గట్టిగా చెప్పబడుతున్నాయి. అదే “దురంధర్ ” అసలు విజయమే.
- ఆల్రెడీ ఏడ్చే ప్రకాశ్ రాజ్‌లు ఏడుస్తూనేే ఉన్నారు… ఎవరో కాంగ్రెస్ రమ్య దివ్య స్పందన వంటి కేరక్టర్లకు దురందర్ ఓ ప్రాపగాండా సినిమా… ఇంకెవడో ఏడుస్తున్నాడు, ఇది డబ్బు కోసం మతాల మధ్య పెట్టే చిచ్చు సినిమా అట… పహెల్గామ్లో మతం తెలుసుకుని మరీ కాల్చిచంపినప్పుడు ఒక్క గొంతూ పెగల్లేదు… ఇండియాలోనే ఉంటూ ఇండియాను ద్వేషించే ఇండియన్లు వీళ్లు…
- అవునూ, దురందర్ ఈ దేశభద్రత, గూఢచారుల కథ కదా… మతాన్ని లాగుతున్నారెందుకు..,? ఇప్పుడు నెటిజనం సంధిస్తున్న ప్రశ్న ఇది… ఇంకెవరో రాస్తున్నారు, పవన్ కల్యాణ్ సినిమాను వదిలి, తెలుగు స్టార్లు దురందర్ను మెచ్చుకోవద్దట.,. అక్కడి పవన్ కల్యాణ్ ఎప్పుడైనా తోటి తెలుగు స్టార్ సినిమాను ఎప్పుడైనా అభినందించాడా..?!
Share this Article