Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాపం కమలహాసన్..! త్యాగమో, వైరాగ్యమో, సన్యాసమో… హిట్ వికెట్..!

March 28, 2026 by M S R

.

నటనలో లోకనాయకుడు అనిపించుకున్న నటఘనుడు కమలహాసన్ పరిస్థితి రాజకీయాల్లో మరీ ఎంత అవమానకరమైన స్థాయికి దిగజారిపోయిందో చూస్తుంటే తన పట్ల సానుభూతి కలుగుతుంది… తన రాజకీయ ధోరణులతో తీవ్రంగా విభేదించేవాళ్లు సైతం తనను చూసి జాలిపడుతున్నారు…

అవును, రాజకీయాలు అంటే సినిమాల్లో నటించడం కాదు… విషయం ఏమిటంటే..? డీఎంకే అధినేత స్టాలిన్ నేతృ‌త్వంలో 23 పార్టీల సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ మళ్లీ అధికారం సాధించాలనే లక్ష్యంతో… సీట్ల సర్దుబాటులో కాస్త పట్టూవిడుపులు ప్రదర్శించింది…

Ads

మొత్తం 234 సీట్లకు గాను డీఎంకే 175, కాంగ్రెస్ 28, డీఎండీకే 10, వీసీకే 8, సీపీఐ 5, సీపీఎం 5, ఎండీఎంకే 4, ముస్లిం లీగ్ 2, కేఎండీకే 2, ఎంఎంకే 2… వోట్లు ఏమాత్రం చీలిపోకుండా కొన్ని పార్టీలకు వాటి బలంకన్నా స్టాలిన్ ఎక్కువ ఔదార్యాన్నే కనబరిచాడు..? (డీఎంకే, అన్నాడీఎంకే గాకుండా రెండు కూటముల్లోనూ జాతీయ పార్టీలు సహా మిగతావన్నీ తోక పార్టీలే తమిళనాడులో)…

మరి కమలహాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం పరిస్థితి..? జీరో… అవును, సున్నా…! పాపం, అందరికీ ఇచ్చినట్టే రెండో మూడో ఇవ్వకపోయాడా స్టాలిన్… ఇద్దామనే అనుకున్నాడు… కానీ నీ పార్టీ గుర్తు చూసినా, నీ పార్టీ పేరుతో పోటీచేసినా ఎవడు వోట్లేస్తాడు, సో, ఆ రెండు సీట్లలోనూ మా డీఎంకే గుర్తుతోనే పోటీచేస్తేనే సీట్లిస్తాను అని మెలిక పెట్టాడు స్టాలిన్… (KMDK, MMK వంటి పార్టీలు డీఎంకే గుర్తుపైనే బరిలోకి దిగుతున్నాయి…)

స్టాలిన్ ఒక్క సీటు దగ్గర కూడా రాజీపడటం లేదు… తనే 175 సీట్లలో పోటీకి దిగి, మొత్తం కూటమి తరఫున 200 సీట్లు గెలవాలనేది టార్గెట్… ఈ స్థితిలో అసలు నీకు రాజ్యసభ సీటు ఇవ్వడమే ఎక్కువ కదా అన్నట్టుగా కమలహాసన్ సీట్ల డిమాండ్లను తీసి పడేశాడు… కాలం ఎదురుతంతే అంతే మరి… డీఎంకే పార్టీ పేరుతో, ఆ గుర్తుతో పోటీచేయడంకన్నా పోటీ నుంచి దూరం ఉండటమే బెటర్ అనుకున్నాడు కమలహాసన్… సో, ప్రస్తుతానికి కమలహాసన్ పార్టీ అసలు పోటీలోనే లేదు… అదీ సంగతి… ఈసారి బ్యాలెట్ పేపర్ల మీద ఎక్కడా ‘టార్చ్‌లైట్’ గుర్తు కనిపించదు…

కార్యకర్తలు వేరు- అభిమానులు వేరు… పార్టీ వేరు, సినిమా ప్రాజెక్టు వేరు… ఏమో, విజయ్‌కు కూడా తెలిసొస్తుందనే అనుకుంటున్నారు చాలామంది… గత ఎన్నికల్లో మన పవన్ కల్యాణుడి పరిస్థితి తెలుసు కదా… కమల్ హాసన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ అభినందిస్తూ, ఇది ఒక గొప్ప ‘త్యాగం’ అని కొనియాడాడు… త్యాగమా, వైరాగ్యమా, తప్పనిసరి సన్యాసమా జనానికి తెలుసు…

నిజానికి కమలహాసన్ పార్టీకి 2021 ఎన్నికల్లో 2.6 శాతం వోట్లు వచ్చాయి… అర్బన్ ఏరియాల్లో, ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూర్… ఈ పార్టీ మెరుగైన ప్రభావమే చూపింది… కొన్ని చోట్ల 10% కంటే ఎక్కువ ఓట్లు సాధించింది…

2019 లోకసభ (Lok Sabha) ఎన్నికల్లో, అంటే పార్టీ స్థాపించిన ఏడాదికే జరిగిన ఈ ఎన్నికల్లో MNM ఒంటరిగా పోటీ చేసింది… సుమారు 3.72% (దాదాపు 16 లక్షల ఓట్లు) వచ్చాయి… చెన్నైలోని మూడు నియోజకవర్గాల్లోనూ, కోయంబత్తూర్‌లోనూ ఈ పార్టీ అభ్యర్థులు లక్షకు పైగా ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు…

ఇక 2024 లోకసభ ఎన్నికల్లో పోటీ చేయనేలేదు... ప్రస్తుతమూ పోటీ లేదు... అసలు ఒక్కచోట కూడా పోటీచేయకపోవడం అంటే... సొంతంగా తనే పార్టీకి ఉరివేస్తున్నట్టు..!! రాను రాను ఇక ఎవరికీ ‘గుర్తుండదు’...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీరు క్రికెట్ ప్రేమికులా..? ఐతే తప్పకుండా ఓసారి చదవాల్సిందే…
  • ‘కోడి మెడ’..! ఒవైసీ చేతికి చిక్కుతుందా..? బెంగాల్ ముఖచిత్రమేంటి..?!
  • పాపం కమలహాసన్..! త్యాగమో, వైరాగ్యమో, సన్యాసమో… హిట్ వికెట్..!
  • సదరు ప్రవచనకర్తకు అస్సలు నచ్చని 2 వార్తలు..! అవేమిటంటే..?!
  • సారా కొంటేనే రేషన్ పంపిణీ… వ్యభిచారానికి చట్టబద్ధత… ఇంకా..?
  • ఐటీ హబ్ మాత్రమే కాదు… ‘మంచి’రేవులకు భక్తి పర్యాటక వైభోగం…
  • జగదానంద కారకా… జయ జానకీ ప్రాణనాయకా… శుభ స్వాగతం…
  • ‘కొరుకుడుపడని’ రోత… మారితే మల్లెమాల కాదు… జబర్దస్త్ అసలే కాదు…
  • ప్లీజ్ సర్, కాదంటే మా మీదొట్టే… ఈ గౌరవ డాక్టరేట్ తీసుకొండి ప్లీజ్
  • ఎహె… ఈ రేవంతుడికి ఏమీ తెల్వదు, మొత్తుకోదు… ఏదీ సమజ్ కాదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions