.
హేట్ స్పీచ్ బిల్లు… విద్వేష ప్రసంగాల బిల్లును రేవంత్ రెడ్డి ప్రభుత్వం యథాతథంగా అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని ఉంటే బాగుండేది… అది అవసరమైన బిల్లు… సెలెక్ట్ కమిటీకి పంపించకుండా ఉండాల్సింది, ఇప్పుడైనా సరే, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేసుకుంటేనే బెటర్…
ఖచ్చితంగా అవసరం, ఎందుకంటే..? సొసైటీలో హేట్ స్పీచ్ ప్రమాదకరంగా మారింది… రాజకీయ నాయకులే కదా, సెలబ్రిటీలు, సొసైటీ ముఖ్యులు, ప్రత్యేకించి మహిళల మీద సాగుతున్న విషప్రచారం అంతాఇంతా కాదు… కోట్లకుకోట్ల ఖర్చుతో సాగే బీఆర్ఎస్ బాపతు హేట్ క్యాంపెయిన్, నెగెటివ్ ప్రాపగాండా సొసైటీలోకి ఓ విషాన్ని ఇంజెక్ట్ చేస్తోంది… ప్రత్యేకించి పింక్ అత్యుత్తమ సంస్కార సోషల్ మీడియా విభాగం అబద్ధపు పోస్టులు, మార్ఫ్‌డ్ వీడియోలు, ఎఐ ఇమేజ్‌లు, అభూతకల్పనలు, బూతుల వ్యాఖ్యలు… వాటికోసమే వందల యూట్యూబ్ చానెళ్లు, హ్యాండ్లర్స్, నకిలీ ఖాతాలు…
Ads
ఇక్కడ దొరికితే కష్టమని, విదేశాల నుంచి అప్‌లోడింగ్… సినిమా నటుల విభాగాలు కూడా ఇలాగే ఏడ్చాయి… పైగా వీటన్నింటికీ జర్నలిజం అని పేరు… ముసుగు… ప్రెస్ ఫ్రీడం అని రక్షణ ప్రయత్నాలు… ఇప్పుడు హేట్ బిల్లు ఉద్దేశం ఏమిటంటే..? (ఆల్రెడీ కర్నాటక ఈ బిల్లు ఆమోదింపజేసుకుంది)…
– మతం, కులం, లింగం, భాష, జాతి… ఏ పేరుతోనైనా సరే… ముద్రణ, డిజిటల్, రాతలు, కూతలు, వీడియోల ద్వారానైనా సరే… విద్వేషాన్ని వెళ్లగొక్కే ఏ ప్రయత్నమైనా శిక్షార్హం… పదే పదే అదే తప్పు చేస్తే జైలు శిక్ష కూడా..!
తప్పులేదు, తప్పుచేసేవాడు భయపడతాడు… బిల్లు చట్టం అయిపోతే ఫస్ట్ దెబ్బ… ప్రపంచ అత్యుత్తమ సోషల్ సంస్కారి కేసీయార్ మీద… తన గ్యాంగ్ మీద… తన కోట్ల ఖర్చుతో సాగే డర్టీ క్యాంపెయిన్ మీద… తన దరిద్రపు సోషల్ మీడియా యాక్టివిటీ మీద… పైకి ప్రపంచంలోకెల్లా అత్యంత నీతిమంతులుగా కలరింగ్ ఇచ్చుకునే సోకల్డ్ బీఆర్ఆస్, కేటీయార్ సోషల్ టీమ్ మీద… ఫాఫం, కేసీయార్‌ది ఏముందిలే… పొలిటికల్ ముట్లుడిగిన పాకమ ఆండ్రోపాజ్… (మేల్ మెనోపాజ్)…
మరోవైపు హరీష్ రావు పార్టీ మీద, ఆ కేసీయార్ కుటుంబం మీద కమ్ముకొస్తున్నాడు… కేటీయార్ అసంబద్ధ భావజాలానికి మద్దతుగా ఏవేవో పిచ్చి బాష్యాలు, అవగాహన రాహిత్య కథనాలు రాసే నమస్తే తెలంగాణను, దాని తాత టీన్యూస్‌ను కాసేపు వదిలేస్తే… (కేసీయార్ ఓన్ మీడియా అవగాహన, పరిణతి స్థాయి తెలిసిందే కదా… కనీసం కేటీయార్‌కు కూడా సోయి లేకపోతే ఎలా..?)

హేట్ స్పీచ్ బిల్లు మీద కూడా హేట్ బాష్యాల కథల్లోకి వెళ్దాం… నమస్తే తెలంగాణ, టీన్యూస్ ఏమాత్రం పరిపక్వత, పరిజ్ఞానం లేని టీమ్స్ అనుకుందాం… తన సోషల్ మీడియా అంతకు మించిన దరిద్రం అనుకుందాం… కానీ తన సోయి ఏమైంది..?
ఓసారి సుప్రీంకోర్టు ఏమన్నదో… సోకాల్డ్ కేటీయార్ మార్క్ పింక్ అడమెంట్ ధోరణి ఏమిటో చూద్దాం… ఈ బిల్లు భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం అట… జర్నలిజానికి డేంజర్ బెల్స్ అట… ఓసారి నమస్తే తెలంగాణలో కేటీయార్ మార్క్ నాన్సెన్స్, అబ్సర్డ్ వాదన చూడండి…

సరే, ఎవడో ఏదో రాశాడు, ఏదో కూశాడు… కేసీయార్ వారసుడిని, హరీష్ గిరిషీ జాన్తానై అని పురుగులా తీసిపారేసే కేరక్టర్‌కు కనీసం సబ్జెక్టు మీద గ్రిప్ ఉండాలి కదా… అదీ లేకపాయె… పాపం, కేటీయార్ పీఆర్ టీం… హరీష్ టీమ్ బెటర్ అనిపిస్తోంది…
.
మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టుల మీద కేసులు పెడతారు, భావప్రకటన స్వేచ్ఛకే గండం, ఎవడు ప్రభుత్వానికి, అధికారికి వ్యతిరేకంగా రాసినా జైలులో పడేస్టారు అనే ఈ వాదన అబ్సర్డ్… ఆ డ్రాఫ్ట్ బిల్లులో ఆ రూల్స్, సెక్షన్లు ఏమీ లేవు… ఇదంతా నమస్తే పంతులు గారి వక్ర బాష్యం… సోకాల్డ్ కేసీయార్‌కు అంతకుమించి దిక్కులేదు, పరిజ్ఙానం, పరిణతి కలిగిన టీమ్స్ అసలే లేవు…
భావప్రకటన స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉన్నాయిరా నాయనా..? రేవంత్ రెడ్డి ఎవరు సిఫారసు చేశారో గానీ సెలెక్ట్ కమిటీకి పంపించడమే వెనుకంజ… చంద్రబాబు కూడా సోషల్ మీడియా దరిద్రాల మీద కోపంగా ఉన్నాడు… తనూ ఓ బిల్ ఆలోచిస్తున్నాడు… సరే, మోడీకి అంత సీన్ లేదులే గానీ… సొసైటీలోకి విద్వేషాన్ని ఇంజక్ట్ చేసే చట్టం అత్యవసరం… అబ్బే, అది సుప్రీంకోర్టు ధోరణికి వ్యతిరేకం అంటున్నాడు…. పక్కా అబద్ధం… రేవంత్ రెడ్డి తన లీగల్, లెజిస్టేచర్ అడ్వయిజర్ల టీమ్స్‌ను అర్జెంటుగా మార్చుకోవాలి, ఎందుకంటే..?

భావ ప్రకటనా స్వేచ్ఛ కు పరిమితులు కూడా ఉంటాయని సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయి… నేను ఇష్టం వచ్చినట్టు కూస్తాను, రాస్తాను, ఏ రేవతితోనే డర్టీ చానెల్స్ ఓపెన్ చేసి, దరిద్రపు వీడియోలు చేస్తాను అంటే కుదరదు….(అప్పట్లో అమె అరెస్టయితే జర్నలిస్టు అంటూ కేటీయార్ మద్దతు, తన పెయిడ్ కేరక్టర్స్… మొన్నామధ్య పింక్ ప్రాపగాండిస్టు కాలికి గాయం తగిలితే కేటీయార్ విలవిలలాడిపోయాడు… దేవుడా… పొరపాటున సీఎం అవుతాడేమో ఈ రాష్ట్రానికి… విపత్తుల నుంచి రక్షించాలి దేవుడా…)
Freedom of speech and expression (Article 19(1)(a)) in India is a fundamental right allowing citizens to express opinions via speech, writing, or media. It is not absolute and is subject to “reasonable restrictions” under Article 19(2) regarding sovereignty, security, public order, decency, and defamation, ensuring freedom does not become anarchy.
Reasonable Restrictions (Article 19(2)) The state can restrict speech only through authorized laws based on the following grounds:
Sovereignty and Integrity of India: Protecting the nation’s integrity.
Security of the State: Preventing acts like inciting rebellion or overthrowing the government.
Friendly Relations with Foreign States: Maintaining cordial relations with other nations.
Public Order: Restricting speech that causes public disorder.
Decency or Morality: Controlling obscene material.
Contempt of Court: Preventing speech that undermines judicial authority.
Defamation: Protecting individuals from attacks on their reputation.
Incitement to an Offence: Restricting speech that encourages illegal acts.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం, వాక్ స్వాతంత్ర్యంపై ప్రభుత్వం విధించగలిగే సమంజసమైన నిబంధనలు (Reasonable Restrictions) ఈ క్రింది విధంగా ఉన్నాయి….
ఆర్టికల్ 19(2) కింద పరిమితులు:
-
భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత (Sovereignty and Integrity of India): దేశం ఐక్యతను దెబ్బతీసేలా లేదా దేశాన్ని విడగొట్టేలా మాట్లాడే మాటలపై ప్రభుత్వం పరిమితులు విధించవచ్చు…
-
రాజ్య భద్రత (Security of the State)….: తిరుగుబాటును ప్రోత్సహించడం లేదా ప్రభుత్వాన్ని పడగొట్టేలా చేసే హింసాత్మక చర్యలను నిరోధించడానికి ఈ నిబంధన ఉపయోగపడుతుంది.
-
విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు (Friendly Relations with Foreign States):… ఇతర దేశాలతో మన దేశానికి ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసేలా మాట్లాడకూడదు….
-
ప్రజా శాంతి (Public Order)…: సమాజంలో గొడవలు సృష్టించే లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రసంగాలను నియంత్రించవచ్చు….
-
మర్యాద లేదా నైతికత (Decency or Morality)…: సమాజంలో అశ్లీలతను వ్యాప్తి చేసే లేదా నైతిక విలువలను దెబ్బతీసే విషయాల ప్రదర్శనపై పరిమితులు ఉంటాయి….
-
కోర్టు ధిక్కరణ (Contempt of Court)…: న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా లేదా న్యాయాధికారాన్ని తక్కువ చేసేలా మాట్లాడటాన్ని ఇది నిరోధిస్తుంది….
-
నష్టపరిహారం / పరువు నష్టం (Defamation)…: ఒక వ్యక్తి గౌరవానికి లేదా ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేయకూడదు….
-
నేర ప్రేరణ (Incitement to an Offence)…: చట్టవిరుద్ధమైన పనులు చేయమని లేదా నేరాలకు పాల్పడమని ఇతరులను రెచ్చగొట్టేలా మాట్లాడకూడదు….
- అవును, హేట్ బిల్లు ఆమోదింపబడి ఉంటే… ఫస్ట్ కేసు పాడి కౌశిక్ రెడ్డి మీదే అయి ఉండేది… కరీంనగర్ సీపీ మీద ఏవో పిచ్చి తిట్లు, దుర్భాషలు చేశాడు కదా…. అఫ్‌కోర్స్, సీఐడీ కేసు పెట్టి, నోటీసులు జారీ చేసిాంది, అది వేరే విషయం, చట్టం బలంగా ఉంటే కదా…. శిక్షించేది…..
హరీష్ రావుకు ఇంగ్లిష్ ఏమాత్రం రాకపోవచ్చుగాక… అర్థం గాకపోవచ్చు, కానీ కేటీయార్‌కుబాగానే తెలుసు కదా… ఈ హేట్ స్పీచ్ బిల్లు సుప్రీంకోర్టు ధోరణికి వ్యతిరేకంగా ఏమీ లేదు, పైగా సానుకూలంగా ఉంది… భావప్రకటన స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయని సుప్రీం స్పష్టంగా చెబుతోంది… ఆ స్వేచ్ఛను భంగపరిచే పెడధోరణులను ‘స్టేట్’ కంట్రోలో చేయాలీ అంటోంది…
ఒక మోడీకి చేతకాలేదు… ఒక రేవంత్ రెడ్డి బిల్లు ప్రవేశపెడితే మాత్రం ఉలిక్కిపడతారు, హడలిపోతారు… తమ అక్రమ, కుసంస్కార ప్రచారం తీరు బయటపడి, కోర్టులో విచారణకు నిలబడాల్సి వస్తుంది కాబట్టి…!! నిజంగా సొసైటీలో విషాన్ని, విద్వేషాన్ని ప్రచారం చేసే శక్తులకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశం, శక్తి రేవంత్ రెడ్డికి ఉన్నాయా..!!
Share this Article
