Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రళయ్..! ఇక ప్రేక్షకులందరి చూపూ ఈ కొత్త సినిమాపైనే..!

April 6, 2026 by M S R

.

దురంధర్ రెండు పార్టులు అయిపోయాయి… రణబీర్ సింగ్‌ను ఎక్కడికో తీసుకుపోయి నిలబెట్టాయి… అటు దర్శకుడు, ఇటు హీరో ఇద్దరూ ట్రెండింగ్ ఇప్పుడు… కొన్నేళ్ల దాకా ఇక ఢోకా లేదు వీళ్లకు… కానీ దురంధర్-3 లేదు కదా… మరి రణబీర్ సింగ్ తదుపరి సినిమా ఏమిటి..?

ఎస్, ఈ భారీ విజయం తరువాత ఆ దర్శకుడు, ఆ హీరో చేయబోయే తదుపరి ప్రాజెక్టులపై విపరీతమైన అంచనాలు ఏర్పడతాయి… ఏమాత్రం తేడా కొట్టినా కొట్టుకుపోవడం ఖాయం… ఆదిత్య ధర్ విషయానికి వస్తే తన కలల ప్రాజెక్టు ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ ప్రాజెక్టును పట్టాలెక్కించొచ్చు… భారీ బడ్జెట్ కారణంగా, అప్పటి ఆదిత్య థర్ మీద కొందరు హీరోలకు నమ్మకం లేక అది ఆగిపోయింది… కానీ ఇప్పుడు తన రేంజ్ వేరు కదా…

Ads

లేదా చంద్రగుప్త మౌర్య కథ ఆధారంగా ఓ హిస్టారికల్ సినిమా తీస్తాడేమో… అదీ రణబీర్ సింగ్‌తోనే… ఇవి సరే, మరి రణబీర్ సింగ్ తదుపరి ప్రాజెక్టు ఏమిటి..? ప్రస్తుతానికి తన చేతిలో ఏ సినిమాలూ లేవు… తన సొంత సినిమా తప్ప..! నిజం… కాకపోతే ప్రళయ్ త్వరలో షూటింగ్ పట్టాలెక్కే సూచనలైతే ఉన్నాయి…

ఎవరి సినిమాయో కాదు, అది తన సొంత సినిమా… ఈసారి కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలనే భావనలో ఉన్నాడు తను… తన సొంత సినిమా నిర్మాణ సంస్థ పేరు ‘మా కసమ్ ఫిలిమ్స్’… ఈ సినిమాపై ఆల్రెడీ ఇండస్ట్రీలో హైప్ స్టార్టయింది కూడా… దానికి ప్రధాన కారణాలు, విశేషాలు ఏమిటంటే..?

1. జానర్ & కథా నేపథ్యం (Genre & Story) … ఇది ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు చూడని ‘పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ థ్రిల్లర్’ (Post-apocalyptic Zombie Thriller)… అంటే ప్రపంచ వినాశనం తర్వాత, జాంబీల గురైన నగరంలో ప్రాణాల కోసం చేసే పోరాటం… దీనిని ‘ముంబై వెర్షన్ ఆఫ్ హంగర్ గేమ్స్’ తరహాలో ప్లాన్ చేస్తున్నారట… ఇది ఒక ఒరిజినల్ కథ అని హన్సల్ మెహతా స్పష్టం చేశాడు…

2. దర్శకుడు (Director) …  దర్శకుడు హన్సల్ మెహతా కుమారుడు జై మెహతా (Jai Mehta) ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు… గతంలో తను ‘స్కామ్ 1992’, ‘లూటెరే’ వంటి వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు… జై మెహతా వర్క్ నచ్చి రణవీర్ స్వయంగా ఆయనకు ఆఫర్ ఇచ్చాడట…

3. కేస్టింగ్ విశేషాలు (Casting) … కళ్యాణి ప్రియదర్శన్, మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి, ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది… 2025లో వచ్చిన ‘లోక’ (Lokah) చిత్రంతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెను, రణవీర్ స్వయంగా ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నాడట…

4. భారీ బడ్జెట్ & టెక్నీషియన్స్ …. దాదాపు ₹300 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు… హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం అంతర్జాతీయ క్రూని ఈ ప్రాజెక్ట్ కోసం నియమించుకున్నారు… తక్కువ ఖర్చుతోనే హాలీవుడ్ క్వాలిటీ తీసుకురావడమే వీరి లక్ష్యం…

5. హైప్ ఎందుకు? … హిందీలో జాంబీ సినిమాలు వచ్చినా (‘గో గోవా గాన్’ వంటివి) అవి ఎక్కువగా కామెడీ టచ్‌తో ఉన్నాయి… కానీ ‘ప్రళయ్’ పూర్తి స్థాయి సీరియస్ సర్వైవల్ థ్రిల్లర్‌గా, భారీ ఎత్తున రూపొందుతుండటంతో అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది… ఈ సినిమా షూటింగ్ 2026 మధ్యలో ప్రారంభం కావొచ్చు… ప్రస్తుతం రణవీర్ చేతిలో దీనితో పాటు ‘డాన్ 3’, ‘రాక్షస్’ వంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, అధికారికంగా మాత్రం ‘ప్రళయ్’ పనులే వేగంగా జరుగుతున్నాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రళయ్..! ఇక ప్రేక్షకులందరి చూపూ ఈ కొత్త సినిమాపైనే..!
  • ఇరాన్‌లో చిక్కుకున్న అమెరికన్ పైలట్‌ను కాపాడింది ఇదేనా..?!
  • ఏడేళ్ల ‘బాలీవుడ్ బాద్‌షా’ పీఠానికి ఎసరు..! తొలిసారి రణబీర్‌కు కిరీటం..!
  • కొబ్బరి బొండాం..! అప్పట్లో కామెడీ హీరో అంటే ఓన్లీ రాజేంద్ర ప్రసాద్..!
  • అర్చకుల విదేశీ ప్రయాణాలు నిషిద్ధమా..? శృంగేరీ చెప్పిందే ఆగమమా..?!
  • అసెంబ్లీ నక్సలైట్..! ముందస్తు జాగ్రత్తగా ఉపా కేసు వర్తిస్తుందా యువరానర్..!!
  • అన్నదాత చెమట చుక్కకు తెలుసు మెతుకు విలువ… అవమానించకండి…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ మార్మిక భావన…
  • జంట నెలవంకలుండే నింగి ఉంటుందేమో…. ‘అలాంటి పిల్ల’ దొరకదు…
  • గురువును కేజ్రీ వదిలేశాడు… కేజ్రీని మిగతా నేతలు వదిలేస్తున్నారు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions