.
‘‘2026 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ‘యోగి తరహా’ న్యాయం అందిస్తామని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి (బీజేపీ) శపథం చేశాడు… “మేం అత్యాచార నిందితులను కోర్టుకు పంపం… ఉదయాన్నే వారిని అదుపులోకి తీసుకుని, సాయంత్రానికే వారి పని పడతాం… మేము యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ అనుసరించిన మార్గాన్నే అనుసరిస్తాం…”
ఈ మాటలు ఎవరివో కావు… బీజేపీ గనుక బెంగాల్‌లో గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడని భావిస్తున్న సువేందు అధికారి వ్యాఖ్యలు… దీనిపై ప్రస్తుతం పెద్ద రచ్చ… చర్చ… ‘‘మరిక కోర్టులు దేనికి..? ఈ వ్యాఖ్యలు మన దేశ న్యాయవ్యవస్థ తీరూతెన్నూను అభిశంసించడమా..?
Ads
మరిక legal framework, due process, legal procedure, constitutional way పదాలకు అర్థం లేదా..? ఎన్‌కౌంటర్, బుల్‌డోజర్ రాజ్యాన్ని వోటర్లకు ప్రామిస్ చేస్తున్నాడా..? మన ప్రజాస్వామిక వ్యవస్థను డిస్టర్బ్ చేయడం కాదా ఇది.?… ఇవి సువేందు వ్యాఖ్యల్ని వ్యతిరేకించే వర్గం అభ్యంతరాలు… అఫ్‌కోర్స్, మన న్యాయవ్యవస్థలో న్యాయం ఓ ఎండమావిగా మారినప్పుడు ఇదే ఫ్రస్ట్రేషన్ కీలక వ్యక్తుల నుంచే వ్యక్తమవుతుంది…
కానీ మరి… కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా… దర్యాప్తు, ప్రాసిక్యూషన్, వేగవంతమైన తీర్పులు విషయంలో సోకాల్డ్ బీజేపీ ప్రభుత్వం చేసిందేముంది..? కోర్టే గనుక అడ్డుపడితే ఎక్స్‌పోజ్ చేయాలి కదా ప్రజాకోర్టులో..? భయమా..? వణుకా..?
అవును, సువేందు మాటల్లోని అర్థం ‘‘మేం అత్యాచార నిందితుల పట్ల కఠినంగా ఉంటాం’’ అని చెప్పడమే కావచ్చుగాక… రాజకీయంగా మహిళల ఆదరణ పొందడానికి లేదా వారిలో ఓ భరోసా నింపడానికి ఈ ఘాటు వ్యాఖ్యలు ఉన్నాయనేది ఓ విఫల సమర్థన కావచ్చుగాక…
కానీ వాడే పదజాలం చిక్కుల్లో పడేస్తుంది… కోర్టులకు పంపించం, పొద్దున పట్టుకుని, సాయంత్రానికి పనిపడతాం వంటివి కీలకస్థానాల్లో ఉన్న నేతలు మాట్లాడాల్సిన పదాలు కావు… ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఒక విధానం… న్యాయవ్యవస్థలోని లోపాలను, పోలీసుల దర్యాప్తు విధానాల్లో లోపాలను దిద్దడం ఒక విధానం…
సరే, పోలీస్ అవినీతి, అక్రమాల్ని దిద్దడం బహుశా ఈ ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మకూ సాధ్యం కావు… మన వ్యవస్థల్లోని తీవ్ర లోపం… పాతుకుపోయిన లోపం… మోడీకి వందరెట్లు అధికారం ఇచ్చినా దిద్దలేకపోవచ్చు… కానీ… పొద్దున క్యాచ్, సాయంత్రానికి మటాష్ వంటి వ్యాఖ్యలు, ప్రసంగాలు రాజకీయ పరిణతిని, వ్యవస్థాగత విజ్ఞతను సూచించవు…
నిజానికి యోగి శిక్షలు కూడా ‘‘ఒక డిఫరెంట్ లీగల్ ఫ్రేమ్‌వర్క్’’లోనే సాగుతాయి… తనను అర్థం చేసుకోవడంలో బీజేపీ నేతలది కూడా వైఫల్యమే… ఎక్కడైనా ఒక్క ఎన్‌కౌంటర్ జరిగితే రకరకాల విచారణలతో ఆ ఎన్‌కౌంటర్ బాధ్యులు కోర్టుల్లో నానా చిక్కులూ ఎదుర్కోవాలి…
కానీ కొన్ని వేల ఎన్‌కౌంటర్లు యూపీలో… ఈ రికార్డు ఇక ఎవరికీ సాధ్యం కాదేమో… డ్రగ్స్ మీద యుద్ధం చేసిన ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే (Rodrigo Duterte) చేయించిన ఎన్‌కౌంటర్ల సంఖ్య కూడా తక్కువేనేమో బహుశా… (తను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ విచారణ ఎదుర్కుంటున్నాడు)…
ఐతే వేలాది ఎన్‌కౌంటర్లు సాగినా యూపీలో పెద్దగా వాటి బాధ్యులు చిక్కుల్లో పడలేదు, కారణం… ఫేక్ కాదు, రియల్ ఎన్‌కౌంటర్లే… యూపీ మాఫియా, క్రిమినల్స్‌తో పోలీసులు నేరుగా తలపడ్డారు… పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు… గాయపడ్డారు… యుద్ధమే… మాఫియా వర్సెస్ సర్కార్…
లొంగిపోయినవారిని జైళ్లకు పంపించారు, కోర్టు కేసులు నడుస్తున్నాయి… సాఫీగా అరెస్టులు జరిగితే వారినీ కోర్టుల్లో హాజరు పరుస్తున్నారు… అదొక సిస్టమాటిక్ మార్గం… అంతేతప్ప న్యాయవ్యవస్థను ధిక్కరించి, సమాంతరంగా మరో ‘విచారణ వ్యవస్థ’ను నడిపించడం లేదు… యోగీ సన్యాసి కాదు, సన్నాసీ కాదు… కొన్ని వేల మంది అరాచకవాదుల్ని ఉక్కుపిడికిలితో అణిచేసిన రియల్ ‘‘రూలర్’’…
మరో చిన్న ఉదాహరణ… న్యాయవ్యవస్థ వేగంగా, చురుకుగా ఉంటే ఫలితం ఏమిటనేది మొన్నటి సీజేఐ స్పందన తెలియజేస్తోంది… మాల్డా జిల్లాల్లో ఏడుగురు న్యాయాధికారులను ఆందోళనకారులు నిర్బంధిస్తే… చివరకు డీజీపీ, సీఎస్ కూడా స్పందించకపోతే… నేరుగా సీజేఐ రంగంలోకి దిగి, కేంద్ర బలగాలను పంపించి, రక్షించాల్సి వచ్చింది… సో, రాజ్యాధినేతను బట్టే పరిపాలన, ప్రజలకు న్యాయం… అంతేతప్ప న్యాయవ్యవస్థనే పక్కనపెట్టేసి, మొత్తం తమ చేతుల్లోనికి తీసేసుకోవడం మాత్రం వాంఛనీయం కాదు…
- (అఫ్‌కోర్స్, బెంగాల్‌లో యోగీ గనుక ఉండి ఉంటే… బంగ్లాదేశీ ప్రేమీ, భారత వ్యతిరేకి మమత సీఎంగా ఉండకపోతే కథ వేరే ఉండేది… మోస్ట్ అన్‌వాంటెడ్ ఎలిమెంట్ ఇన్ ఎంటైర్ ఇండియన్ సిస్టం… థాంక్స్ టు మోడీ ఇనెబులిటీ…)
అక్రమార్కులకు వత్తాసు, అవినీతి వంటి మరకలు లేవు కాబట్టి యోగి వోకే అనుకుందాం… అదే ఇతర నేతలూ ఇవే పద్దతుల్లోకి తెగబడితే తలెత్తే అరాచకం మాటేమిటి..? ఇదంతా పెద్ద డిబేటబులే… భారతదేశ న్యాయ వ్యవస్థకు మూలస్తంభాలైన చట్టబద్ధ పాలన, సక్రమమైన విచారణ ప్రక్రియ, రాజ్యాంగ రక్షణలు దెబ్బతింటే అరాచకమే… సో, ఇది మల్టిపుల్ కాంప్లెక్స్ సబ్జెక్ట్… డిబేట్ అవసరం… అవసరం…
చివరగా.... మమతా బెనర్జీ అనే బంగ్లాదేశీ మానసపుత్రిక, అక్రమ వలసదారుల అభిమాన పుత్రిక.... ఇండియా ఏమైపోతేనేం అనే ఓ అరాచక పొలిటికల్ కేరక్టర్ కోణంలో చూసినప్పుడు... సువేందు అధికారి వ్యాఖ్యలు పెద్దగా అభ్యంతరకరం కానే కావు... ఇదీ జనం రియాక్షన్..!!
Share this Article