.
ముంబై తారలు అనగానే ఆరబోతకు, స్కిన్ షోలకు పనికొచ్చే ఎంపికలు, నటన కావల్సిన తారలయితే మలయాళీలు బెటర్ అనే ఓ భావన స్థూలంగా ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా ఉన్నదే… దాన్ని అప్పుడప్పుడూ మృణాల్ ఠాకూర్ వంటి తారలు బ్రేక్ చేస్తారు… సీతారామం ఆమెలోని నటిని ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులు చూసిందే… ఇప్పుడు డెకాయిట్ సినిమాలో ఆమెకు లభించిన పాత్ర, దాన్ని ఆమె సమర్థవంతంగా మెప్పించిన తీరు అభినందనీయం…
మనకు తెలిసిందే కదా అడివి శేషు నటన బాగుంటుంది… ఏమాత్రం డౌట్ లేదు, పాత్రకు సరిపడా నటనను పక్కాగా అందిస్తాడు… ఈ సినిమాలో కొన్నిచోట్ల శేషును బీట్ చేస్తుంది మృణాల్… తల్లిగా, ప్రియురాలిగా, భార్యగా విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర ఆమెది… సిజానికి సినిమా కథ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది… చివరికి హీరో ఆమె కోసం త్యాగం చేసేదాకా… కథ ఆమెదే… సినిమా కూడా ఆమెదే…
Ads

ఈ మాట అనడానికి మరో కారణం ఉంది… శేషు సినిమా అంటేనే ఓ వైవిధ్యం, రొటీన్ పాంప్లెట్ స్టోరీలకు భిన్నంగా ఉంటాయి… చిక్కటి స్క్రీన్ ప్లేతో ఎక్కడా బోర్ కొట్టవు… కొత్తదనం ఉంటుంది… ఈ డెకాయిట్‌లో కూడా ఓ మూస ప్రేమకథను ఎంచుకోలేదు… ఏదో ఓ కులాంతర వివాహం, అడ్డంకులు, చివరకు శుభం కార్డు తరహాలో సాగదు.., దీనికి కాస్త యాక్షన్ జోడించారు… ఈ క్రమంలో శేషు మార్క్ పాత్ర కనిపించదు, సగటు తెలుగు హీరోగా కమర్షియల్ పోకడలు కనిపిస్తాయి… (సహజనటుడు నాని రూపాంతరం చెందినట్టే)…
చివరకు స్టెప్పులు కూడా..! సరే, భిన్నంగా ట్రై చేశాడేమోలే అనుకున్నా… సగటు శేష్ మార్క్ మెరుపులు సినిమాలో కనిపించవు పెద్దగా… పైగా తనే కథ రాశాడుట, సొంత సినిమా (? సుప్రియ సినిమా అన్నా, శేషు సినిమా అన్నా ఒకటే కదా)… కథనం కూడా పడుతూ లేస్తూ అక్కడక్కడా సాగదీత అనిపిస్తుంది… ప్రియురాలే తనను ఓ హత్యాచారం కేసులో ఎందుకు ఇరికించింది అనే పాయింట్ పెద్దగా కన్విన్సింగుగా అనిపించదు…

పైగా ఆమెను కూడా అలాగే ఓ కేసులో ఇరికించేసి, తను దుబయ్ జంపైపోదామనే ప్లాన్ కూడా పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీసింది… చివరకు హీరోయిన్ సినిమా కష్టాలు, చివరలో హీరో త్యాగం (గతంలో ప్రేయసి రావె, నినుకోరి సినిమాలు కూడా సేమ్?) కూడా ఈతరం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సిందే… కొత్త తరం ప్రేక్షకులకు ఇలాంటి త్యాగాలు, క్లైమాక్సులు నచ్చవు పెద్దగా…
తన అనారోగ్యం, తన సమస్యలతో హీరోయిన్ ఏకంగా పెద్ద పెద్ద సాహసాలకు సిద్ధపడి, పాత ప్రేమికుడితో యాక్షన్, ఛేజింగ్ రూట్‌లోకి వెళ్లడం కూడా పెద్ద కన్సిన్సింగ్ అనిపించదు… క్లైమాక్స్‌లో ఎమోషన్ బాగా దట్టించాం అనుకున్నాడు దర్శకుడు ప్లస్ కథారచయిత శేషు… కానీ అది నిజంగా సినిమాను పైకి లేపుతుందా, పడేస్తుందా చూడాల్సిందే ఇక…
సినిమాలో మెచ్చదగిన అంశం ఒకటుంది… కరోనా సమయంలో కార్పొరేట్ హాస్పిటల్స్, దాదాపు అన్ని హాస్పిటల్స్ ఎలా జనాన్ని దోచుకున్నాయో సమర్థంగా కథలో చూపించగలిగారు… అఫ్‌కోర్స్, రోజూ చేసే పని అదే, కాకపోతే కరోనా వాళ్లకు దండిగా అవకాశాల్ని అదనంగా కల్పించింది… నిలువు దోపిడీ కేంద్రాలు… చివరగా… సినిమాకు ప్లస్ పాయింట్స్ శేషు, మృణాల్ నటన… అలాగే నిర్మాణ విలువలు… అవునూ, ఆ పోలీసాయనకు అయ్యప్ప డ్రెస్ ఎందుకు వేసినట్టు..?! మరో ప్రశ్న… ఈమాత్రం సినిమాకు ఇంత గ్యాప్ తీసుకున్నాడా శేషు?!
Share this Article